BigTV English

Sonia Gandhi Oath: సోనియాకు శుభాకాంక్షలు.. మొదలైన న్యూ ఇన్నింగ్స్!

Sonia Gandhi Oath: సోనియాకు శుభాకాంక్షలు.. మొదలైన న్యూ ఇన్నింగ్స్!
Fiber Rich Foods for Digestion Problems
Fiber Rich Foods for Digestion Problems

Sonia Gandhi Oath as Member of RajyaSabha: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఇప్పటివరకు సుదీర్ఘకాలం లోక్‌సభ సభ్యురాలిగా కొనసాగిన ఆమె, తొలిసారి రాజ్యసభలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యురాలిగా సోనియాగాంధీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.


రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్.. సోనియాగాంధీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఖర్గే ట్వీట్ చేశారు. రెండున్నర దశాబ్దాల పాటు ఆమె లోక్‌సభకు సేవలందించారు. నేను, నా తోటి సభ్యులు ఆమె ఎగువ సభకు హాజరుకావాలని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. అలాగే రాహుల్, ప్రియాంకగాంధీ దంపతులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఉన్న ఫోటోనే షేర్ చేశారు.

ఏపీ, తెలంగాణకు చెందిన సభ్యులతోపాటు బీజేపీ, కాంగ్రెస్ మిగతా పార్టీల నుంచి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో వడ్డిరాజు రవిచంద్ర, వైవీ సుబ్బారెడ్డి, మేడ రఘునందారెడ్డి, గొల్ల బాబురావు, అజయ్‌ మాకెన్, రైల్వేమంత్రి అశ్విని వైభవ్, మధన్ రాథోడ్, భట్టాచార్య వంటి నేతలు ఉన్నారు.


Also Read: South East Central Railway: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 పోస్టులు.. తొందరగా అప్లై చేసేయండి..

మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సహా 54 మంది పదవీ విరమణ చేశారు. వీరిలో తొమ్మిది మంది కేంద్రమంత్రులు ఉన్నారు. మంగళవారం ఒక్కరోజే 49 మంది ఎంపీలు విరమణ చేశారు. ప్రస్తుతం కేంద్రమంత్రులుగా కొనసాగుతున్నవారిలో ఏడుగురు సభ్యుల పదవీకాలం ముగిసింది. ఈ క్రమంలో మంత్రులు కూడా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

 

Tags

Related News

Kerala Court Judgment: తల్లికి భరణం చెల్లించని వ్యక్తికి జైలు శిక్ష

Malaria vaccine: మలేరియాకు మందు.. భారత తొలి వ్యాక్సిన్‌కు హైదరాబాద్ నుంచే శ్రీకారం

Milk Prices: శుభవార్త.. తగ్గనున్న పాల ధరలు.. లీటర్‌కు ఎంత తగ్గిస్తారంటే

Indian Constitution: పొరుగు దేశాలు చూశారా ఎలా ఉన్నాయో.. నేపాల్, బంగ్లాదేశ్‌లపై.. భారత సుప్రీం కోర్డు కీలక వ్యాఖ్యలు

Samruddhi Mahamarg: సమృద్ధి మహామార్గ్ ఘటన.. అసలు కారణం ఇదే

Nepal Viral Video: మా హోటల్‌కు నిప్పు పెట్టారు.. బయటకు వెళ్లలేని పరిస్థితి.. నేపాల్‌లో భారత మహిళకు భయానక అనుభవం

Big Stories

×