Big Stories

Cholera Outbreak in Bengaluru: ఒకవైపు నీటి సంక్షోభం.. మరోవైపు కలరా కలవరం.. ఈ నగరానికి ఏమైంది..?

Cholera Outbreak in Bangalore
Cholera Outbreak in Bangalore

Water Crisis and Cholera Outbreak in Bengaluru: ఒకవైపు నీటి సంక్షోభం.. మరోవైపు కలరా విజృంభణ.. ప్రస్తుతం బెంగళూరులో నెలకొన్న పరిస్థితి ఇది. ఫిబ్రవరి నుంచి తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బెంగళూరు వాసులను ఇప్పుడు కలరా వ్యాప్తి కలవరపాటుకు గురిచేస్తోంది. నగరంలో భారీగా కలరా కేసులు నమోదైనట్లు వస్తున్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

- Advertisement -

మల్లేశ్వరం ప్రాంతంలో ఒక కలరా కేసు నమోదవ్వగా.. మరో రెండు అనుమానిత నమూనాలను పరీక్షకు పంపించారు. కలరా వ్యాప్తిపై స్పర్ష్ హాస్పిటల్ లోని కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ శ్రీహరి మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో కలరా కేసులు 50 శాతం పెరిగినట్లు తెలిపారు. సగటున రోజుకు 20 కేసులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, కలుషితమైన నీటి కారణంగానే కలరా కేసులు పెరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.

- Advertisement -

ఈ ఏడాది మార్చి నెలలో 15 రోజుల్లోనే 6-7 కేసులు నమోదైనట్లు నగరంలోని ప్రైవేటు ఆస్పత్రులు తెలిపాయి. సాధారణంగా ఈ కేసుల సంఖ్య 1-2గా ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. ముఖ్యంగా వీధుల్లో దొరికే తినుబండారాలను తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ పెరుగుతుందన్నారు. నీటికొరత ఉన్న నేపథ్యంలో.. నీరు దొరికితే చాలనుకుని దొరికినవి తాగడం వల్ల కూడా కలరా వ్యాప్తికి ఒక కారణంగా భావిస్తున్నారు.

Also Read: సొంతూళ్లకు వెళ్లేవారికి శుభవార్త.. 4 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు..

కలరా పెరుగుతుండటంతో BBMP (Bruhat Bengaluru Mahanagara Palike) చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ ఆరోగ్య సూచనలు జారీ చేశారు. పరిశుద్ధమైన నీటిని తాగాలని సూచించింది. అలాగే తినుబండారాలకు దూరంగా ఉండాలని తెలిపింది. ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవడం, కాచిన నీటిని తాగడం వంటి జాగ్రత్తలను పాటించాలని బీబీఎంపీ సూచించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News