E-Paper
Advertisement

టీవీకే ప్రభుత్వంపై స్టాలిన్ హాట్ కామెంట్స్, ఆ విధంగా అధికారంలోకి, ఫీనిక్స్ పక్షి మాదిరిగా

టీవీకే ప్రభుత్వంపై స్టాలిన్ హాట్ కామెంట్స్, ఆ విధంగా అధికారంలోకి,  ఫీనిక్స్ పక్షి మాదిరిగా
Advertisement

Thanjavur: తమిళనాడులో రాజకీయాలు హీటెక్కాయి. వారం రోజులుగా ప్రభుత్వం పాలనను గమనించిన డీఎంకె అధినేత స్టాలిన్.. అధికార టీవీకే పార్టీని టార్గెట్ చేశారు. అంతేకాదు ఇన్‌స్టా ద్వారా అధికారంలోకి వచ్చేశారని తేల్చేశారు. ఓటమితో మళ్లీ పీనిక్స్ బర్డ్‌లా డీఎంకె పుంజుకుంటుందని చెప్పకనే చెప్పేశారు.

టీవీకే ప్రభుత్వంపై స్టాలిన్ హాట్ కామెంట్స్

Advertisement

తమిళనాడులో అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు డీఎంకే చీఫ్, మాజీ సీఎం ఎంకె స్టాలిన్. ఇన్‌స్టాగ్రామ్‌తో టీవీకే అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. సోమవారం తంజావూర్‌లో ఓ వివాహ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఓటమి-గెలుపు సమాన దృష్టిలో పెట్టుకొని చూసి, పని చేసేది ఒక్క డీఎంకే పార్టీ అని అన్నారు.

టీవీకే పార్టీ బూత్‌ ఏజెంట్లను, ఓట్ల లెక్కింపు ఏజెంట్లను నియమించకుండా అధికారంలోకి వచ్చిందన్నారు. టీవీకే విజయం వెనుక బలమైన కారణం కేవలం సోషల్ మీడియా అని తేల్చేశారు. చిన్నారులతో ప్రచారం చేయించి వారి తల్లిదండ్రుల ఓట్లు వేసుకునేలా చేశారని వ్యాఖ్యానించారు.

Advertisement

పీనిక్స్ పక్షి మాదిరిగా డీఎంకె పంజుకుంటుంది-స్టాలిన్

ఆ విధంగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ద్రవిడ నమూనాలో అమలు చేసిన పథకాలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆ డిమాండ్ ఎలా నెరవేరుతుందో మనం చూడాలన్నారు. ఒక రకంగా చెప్పాలంటే తాము ఇంకా ప్రభుత్వంలో ఉన్నామని చెప్పకనే చెప్పారు.

తాజా ఎన్నికల్లో డీఎంకే పార్టీ పనైపోయిందని కొందరు అంటున్నారని, ఇలాంటివి డీఎంకే ఎన్నో చూసిందన్నారు. ఓడినప్పుడు ఫీనిక్స్‌ పక్షిలా డీఎంకే పార్టీ పుంజుకుంటుందని అసలు గుట్టు బయటపెట్టారు. తాము అధికారంలోకి ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేసిందన్నారు.

ALSO READ: సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం.. ‘అమ్మ క్యాంటీన్ల’పై కీలక ఆదేశాలు జారీ

తాము తెచ్చిన పథకాలు అమల్లో ఉన్నంతకాలం ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని మనసులోని మాట బయటపెట్టారు. ఎన్నికల్లో ఓడిపోయామని ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమిపై పరిశీలన చేసేందుకు ఓ కమిటీని నియమించామన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు.. టీవీకే పాలన నిజ స్వరూపం బయటపడుతుందని, మరిన్ని నిజాలు బయటి వస్తాయన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ పరిణామాలను విజయ్ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది.  ప్రమాణ స్వీకారం, అసెంబ్లీలో బల పరీక్ష సీఎం విజయ్ మాట్లాడే తప్పారు. మరి స్టాలిన్ కామెంట్స్‌పై సమయం, సందర్భం చూసి గట్టిగా కౌంటరివ్వాలని ఆలోచన చేస్తోంది అధికార ప్రభుత్వం.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×