E-Paper
Advertisement

గర్భిణీలను మాత్రమే చంపుతున్న సైకో కిల్లర్… ఆరు నెలల తరువాత ఓటీటీలోకి… ట్రెండింగ్ లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్

గర్భిణీలను మాత్రమే చంపుతున్న సైకో కిల్లర్… ఆరు నెలల తరువాత ఓటీటీలోకి… ట్రెండింగ్ లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller Movie on OTT : ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కు ఒక వేదికలా ఓటీటీలు తయ్యారయ్యాయి. వరల్డ్ వైడ్ ఏ సినిమా వచ్చినా వీటిలో అడుగుపెట్టాలసిందే. ఇక వీటిలో థ్రిల్లర్ కంటెంట్ కు క్రేజ్ విపరీతంగా ఉంది. తెలుగులో కూడా వీటిని డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు కూడా. అలాగే తెలుగులో కూడా మంచి కంటెంట్ ఉన్న థ్రిల్లర్ సినిమాలు వస్తున్నాయి. రీసెంట్ గా ఓటీటీకి వచ్చిన ఒక తెలుగు సినిమా ఇప్పుడు ట్రెండింగ్‌ అవుతోంది. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఓటీటీలో మాత్రం టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. దీనినికి ఐయండిబిలో 8రేటింగ్ ఉందంటే సినిమా ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఇది రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ. గర్భిణులను హత్య చేసే ఒక సైకో కిల్లర్ చుట్టూ కథ తిరగుతుంది. ఒక అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాలనుకుంటే సీమంతం సినిమా చూసేయచ్చు.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘Cమంతం’ (Cmantham). దర్శకుడు సుధాకర్ పాని తెరకెక్కించిన ఈ సినిమాలో వజ్రయోగి, శ్రేయ భారతి ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాది నవంబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, పెద్ద నటీనటులు లేకపోవడం, సరైన ప్రమోషన్లు లోపించడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రీసెంట్ గా ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుని మే 15 నుంచి రిలీజ్ చేయగా, ఆడియన్స్ కూడా తెగ చూస్తున్నారు. ఇప్పుడు ఇది ట్రెండింగ్ లో కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా రెంటల్ విధానంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా చూసేందుకు మరికొంత సమయం పట్టవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల బాధలో ఉంటాడు ఒక డిటెక్టివ్. సరిగ్గా అదే సమయంలో నగరంలో వరుసగా గర్భిణులు హత్యకు గురవుతారు. ఈ దారుణమైన హత్యలు జరుగుతూ ప్రజలను వణికిస్తుంటాయి. ఎలాగైనా ఆ సైకో కిల్లర్‌ను పట్టుకోవాలనే పట్టుదలతో ఈ డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. మొదట్లో ఇది మామూలు మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ లాగే స్టార్ట్ అయినా, రోజులు గడిచేకొద్దీ హంతకుడిని పట్టుకోవడం అతనికి ఒక పిచ్చిగా, ఒక అబ్సెషన్‌గా మారిపోతుంది. ఆ కిల్లర్ వదిలిన ఒక్కో ఆధారాన్ని వెతుక్కుంటూ వెళ్లే కొద్దీ, డిటెక్టివ్ ఊహించని ఎన్నో రహస్యాలు తెలుసుకుంటాడు. చివరికి ఆ ప్రమాదకరమైన సైకో కిల్లర్ ను ఎలా కనిపెట్టాడు ? కిల్లర్ గర్భిణీలనే ఎందుకు చంపుతున్నాడు? ఈ వేటలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి ? అనేదే ఈ సినిమా కథ.

Read Also : ప్రతిరోజూ దెయ్యాల టైమ్‌లో నిద్రలేచే అమ్మాయి… మూడు సీజన్ల పాటు ఫుల్ థ్రిల్ ఇచ్చే హర్రర్ స్టోరీ

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×