E-Paper
Advertisement

Sukhoi Jet Crash: అస్సాంలో కూలిన యుద్ధ విమానం.. భారీ పేలుడు శబ్దం, స్థానికులు బెంబేలు

Sukhoi Jet Crash: అస్సాంలో కూలిన యుద్ధ విమానం.. భారీ పేలుడు శబ్దం, స్థానికులు బెంబేలు
Advertisement

Sukhoi Jet Crash: అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లా పరిధిలోని మారుమూల కొండ ప్రాంతంలో గురువారం సాయంత్రం భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానం కూలింది. జోర్హాట్ ఎయిర్‌ బేస్ నుండి బయలు దేరిన కొద్దిసేపటికే యుద్ధ విమానం రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. చొకిహోలా పరిధిలోని కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందులోవున్న ఇద్దరు పైలట్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

అస్సాంలో కూలిన యుద్ధ విమానం.. కొండలో భారీ పేలుడు శబ్దం

Advertisement

గురువారం సాయంత్రం అసొంలోని జోర్హాట్‌లోని వైమానిక బేస్ నుండి బయలు దేరింది సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం. గాల్లోకి ఎగిరిన కాసేపటికి రాడార్ సంబంధాలు కోల్పోయింది. విమానం, ఇద్దరు పైలట్లను గుర్తించడానికి రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ విమానం రాత్రి 7.42 గంటల సమయంలో గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

యుద్ధ విమానం ప్రమాద సమయంలో కొండల వైపు నుండి భారీ పేలుడు శబ్దం వినిపించిందని స్థానిక గ్రామస్తులు చెబుతున్నారు. కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో మారుమూల కొండ ప్రాంతం నుండి పేలుడు శబ్దం వినిపించిందని అంటున్నారు. చీకటి పడిన తర్వాత జరిగిన ఈ పేలుడు ధాటికి సమీపంలోని ప్రజలు ఇళ్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.

Advertisement

పైలట్లు మిస్సింగ్.. గాలింపు ముమ్మరం చేసిన సిబ్బంది

శబ్దం వచ్చిన దట్టమైన పొగలు అలుముకున్నాయని పలువురు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం అడవులు, ఎత్తైన కొండల మధ్య జరిగినట్టు అంచనా వేస్తున్నారు. అటు వైపు వెళ్లడం కాసింత కష్టమేనని చెబుతున్నారు స్థానికులు. ఈ ఘటనపై వైమానిక విభాగం నుంచి ఓ ప్రకటన వచ్చింది. విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసింది భారత వాయుసేన బృందం.

ప్రమాద స్థలం జనవాసాలకు దూరంగా ఉండటంతో ఆయా బృందాలకు కష్టంగా మారింది. దీనికితోడు భౌగోళిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు సమాచారం. కచ్చితంగా విమానం క్రాష్ అయినట్టు అధికారులు భావిస్తున్నారు. మరి విమానంలోని పైలట్ల పరిస్థితి ఆరా తీస్తున్నారు. ఇంతకీ వారు సేఫ్‌గా బయటపడ్డారా? ప్రమాదంలో చిక్కుకున్నారా? అనేది ఇంకా క్లారిటీ రావాల్సివుంది.

ALSO READ: వెస్ట్ బెంగాల్ గవర్నర్ రాజీనామా.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిగ్ ట్విస్ట్!

IAF వద్ద 260 కి పైగా Su-30 MKI జెట్‌ విమానాలు ఉన్నాయి. దేశంలో అత్యంత శక్తివంతమైన, ముఖ్యమైన యుద్ధ విమానాల్లో ఇది కూడా ఒకటి. సుఖోయ్-30 MKI విమానం రెండు ఇంజన్లు కలిసి ఉంటుంది. దేశ వైమానిక రంగానికి వెన్నెముక. రష్యాకు చెందిన సుఖోయ్- దేశానికి చెందిన HAL సంయుక్తంగా నిర్మించిన యుద్ధ విమానాలలో ఇది కూడా ఒకటి.

 

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×