E-Paper
Advertisement

Tanveer Ahmed: 15వ‌ ఓవర్ నుంచే ఫిక్సింగ్…క్యూరేటర్ మెడ‌పై క‌త్తి పెట్టి, పిచ్ అనుకూలంగా జై షా మార్చుకున్నాడు

Tanveer Ahmed: 15వ‌ ఓవర్ నుంచే ఫిక్సింగ్…క్యూరేటర్ మెడ‌పై క‌త్తి పెట్టి, పిచ్ అనుకూలంగా జై షా మార్చుకున్నాడు

Tanveer Ahmed: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  నేపథ్యంలో ఫైనల్ స్టేజ్ కు టీమిండియా దూసుకు వెళ్ళింది. ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన టీమిండియా… ఫైనల్ ఆడే అర్హత సంపాదించుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ( Wankhede Stadium, Mumbai) వేదికగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India vs England 2nd Semi-Final) మధ్య రెండో సెమీ ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన ఈ మ్యాచ్ లో కేవలం ఏడు పరుగులు తేడాతో టీమిండియా విక్టరీ సాధించింది. దీంతో ఫైనల్ లోకి దూసుకు వచ్చింది ఇండియా. అయితే టీమిండియా ఫైనల్ కు వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతున్నారు. ఎప్పటి లాగే ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) మరోసారి ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు. జై షా ( ICC Jay shah) ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు ఫిక్సింగ్ జరుగుతూనే ఉంటుందని బాంబు పేల్చారు.

Also Read: T20 World Cup 2026: శ్రీలంకలో ఆ పాకిస్తాన్ ప్లేయ‌ర్ అరాచ‌కాలు…హోట‌ల్ ప‌ని మ‌నిషిపై లైంగిక దాడి !

మెడ‌పై క‌త్తి పెట్టి, పిచ్ అనుకూలంగా జై షా మార్చుకున్నాడు

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో టీమిండియా ఫైనల్ కు చేరడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సంచలన ఆరోపణలు చేశారు. క్యూ రేటర్ మెడపై కత్తి పెట్టి మరి.. ఇండియాకు అనుకూలంగా పిచ్ సిద్ధం చేసుకున్నారని… ఈ తతంగం అంతా నడిపించింది ICC బాస్ జై షా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ముంబైలోని వాంఖడే స్టేడియం గ్యాలరీలో కూర్చొని.. ఐసీసీ బాస్ జై షా ఫిక్సింగ్ కు తెర లేపారని సంచలన ఆరోపణలు చేశారు తన్వీర్ అహ్మద్. అందుకే టీమిండియా విజయం సాధించిందని పేర్కొన్నారు.

15వ‌ ఓవర్ నుంచి.. ఇండియాకు అనుకూలంగా మ్యాచ్ జరిగేలా సీన్ క్రియేట్ చేశాడని బాంబు పేల్చాడు. ఇంగ్లాండ్ ప్లేయర్లను కొనేసి ఈ మ్యాచ్ టీమ్ ఇండియా గెలిచేలా జై షా చక్రం తిప్పినట్లు ఆరోపణలు చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. మీ పాకిస్తాన్ వాళ్లకు ఒళ్లంతా పచ్చకామర్లే ఉన్నాయని… అందుకే ప్రతి విషయం కూడా ఫిక్సింగ్ లాగానే కనిపిస్తుందని మండిపడుతున్నారు. మీకు ఆడడం చేతకాదు.. గెలవడం రాదు అంటూ చురకలు అంటిస్తున్నారు.

ఫైనల్ కు జరిగిన టీమిండియా.. న్యూజిలాండ్ తో ఫైట్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో సెమీఫైనల్ గెలిచిన టీమిండియా, ఫైనల్స్ లో అడుగు పెట్టింది. ఇక మార్చి 8వ తేదీన న్యూజిలాండ్ తో ఫైనల్స్ ఆడనుంది టీం ఇండియా. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు షురూ కానుంది.

Also Read: SA vs NZ 1st Semi-Final: ద‌క్షిణాఫ్రికా కొంప‌ముంచిన క్యాచ్‌..వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ కు చేరిన న్యూజిలాండ్

 

?utm_source=ig_web_copy_link

 

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×