E-Paper
Advertisement

S26 Ultra Privacy Display: గెలాక్సీ S26 అల్ట్రాలో ఇమేజ్ క్వాలిటీపై మండిపడుతున్న యూజర్లు.. ఆర్డర్లు క్యాన్సిల్

S26 Ultra Privacy Display: గెలాక్సీ S26 అల్ట్రాలో ఇమేజ్ క్వాలిటీపై మండిపడుతున్న యూజర్లు.. ఆర్డర్లు క్యాన్సిల్
Advertisement

Galaxy S26 Ultra Privacy Display| శాంసంగ్ ఇటీవల గెలాక్సీ S26 సిరీస్‌ ఫోన్స్ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ఇందులో అత్యంత అడ్వాన్స్, హై ఎండ్ మోడల్ గెలాక్సీ S26 అల్ట్రా. ఈ ఫోన్‌లో ప్రత్యేక్యంగా ప్రైవసీ డిస్‌ప్లే‌ని కొత్త ఫీచర్‌గా శాంసంగ్ పరిచయం చేసింది శాంసంగ్. లాంచ్ ఈవెంట్‌లో శాంసంగ్ దీన్ని హైలైట్ చేసింది. ఇతర దేశాల్లో సేల్స్ ప్రారంభమయ్యాయి. మొదటి యూజర్లు ఈ ఫీచర్‌లో పెద్ద సమస్య గమనించారు. చాలా మంది ఆర్డర్లు రద్దు చేస్తున్నట్లు సమాచారం.

ప్రైవసీ డిస్‌ప్లే అంటే ఏమిటి?

ప్రైవసీ డిస్‌ప్లే ఫీచర్ మీ స్క్రీన్‌ను పక్క నుంచి చూసేవారి నుంచి రక్షిస్తుంది. ఇందులో ఉన్న ప్రత్యేక పిక్సెల్స్ వ్యూయింగ్ యాంగిల్‌ను తగ్గిస్తాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో మీరు ఫోన్ చూస్తున్న సమయంలో ఇతరులకు మీ స్క్రీన్ సరిగా కనిపించదు. ప్రైవసీ ప్రాధాన్యం కోసమే శాంసంగ్ ఈ ఫీచర్ తీసుకొచ్చింది. బ్యాంకింగ్, ఇతర ఓటిపీలు, ప్రైవేట్ కంటెంట్ యూజర్ చూస్తున్నప్పుడు సురక్షితంగా ఉంటుంది.

స్క్రీన్ బ్రైట్‌నెస్, క్వాలిటీని తగ్గించే ప్రైవసీ డిస్‌ప్లే

Advertisement

ఆండ్రాయిడ్ అథారిటీ ప్రకారం.. రోలాండ్ క్వాండ్ట్ బ్లూస్కైలో S26 అల్ట్రా స్క్రీన్ ఇమేజ్‌లు షేర్ చేశారు. ప్రైవసీ డిస్‌ప్లే ఆన్ మరియు ఆఫ్ చేసినప్పుడు స్క్రీన్ ఎలా కనిపిస్తుందో చూపించారు. ఆఫ్ చేసినప్పుడు అన్ని పిక్సెల్స్ బాగా పనిచేస్తాయి. ఆన్ చేసినప్పుడు స్క్రీన్ తక్కువ బ్రైట్‌గా కనిపిస్తుంది. అంటే అన్ని పిక్సెల్స్ పనిచేయవు. ఇమేజ్ క్వాలిటీ తగ్గుతుంది, డిస్‌ప్లే మసకబారుతుంది.

ప్రైవసీ డిస్‌ప్లే ఎలా పనిచేస్తుంది?

గెలాక్సీ S26 అల్ట్రాలో రెండు రకాల పిక్సెల్స్ ఉన్నాయి. నారో పిక్సెల్స్, వైడ్ పిక్సెల్స్. నారో పిక్సెల్స్ నేరుగా చూసినప్పుడు మాత్రమే ఇమేజ్ చూపిస్తాయి. వైడ్ పిక్సెల్స్ పక్క నుంచి చూసినా సాధారణ బ్రైట్‌నెస్‌తో సరిగా కనిపించదు. ప్రైవసీ డిస్‌ప్లే ఆన్ చేసినప్పుడు నారో పిక్సెల్స్ ఎక్కువగా పనిచేస్తాయి. దీంతో సైడ్ వ్యూస్ బ్లాక్ అవుతాయి. కానీ బ్రైట్‌నెస్, షార్ప్‌నెస్ తగ్గుతాయి.

డిస్‌ప్లేలో పెద్ద తేడా గమనించిన యూజర్లు

Advertisement

ఇతర యూజర్లు పాత మోడల్స్‌తో పోల్చారు. ప్రైవసీ డిస్‌ప్లే ఆన్ చేసినప్పుడు S26 అల్ట్రా డిస్‌ప్లే, తక్కువ బ్రైట్, షార్ప్‌గా ఉందని చెప్పారు. క్లియర్, బ్రైట్ స్క్రీన్ కావాలనుకునే యూజర్లకు ఇది సమస్య కావచ్చు.

గెలాక్సీ S26 అల్ట్రా ముఖ్య స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.9 ఇంచ్ AMOLED 2X, 120Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5
ర్యామ్: 16GB
స్టోరేజ్: 1TB వరకు వేరియంట్ ఉంటుంది.
బ్యాటరీ: 5000mAh, 60W ఫాస్ట్ చార్జింగ్, 25W వైర్‌లెస్ చార్జింగ్

కెమెరా సెటప్

క్వాడ్-కెమెరా సిస్టమ్: 200MP ప్రైమరీ, 50MP టెలిఫోటో, 50MP పెరిస్కోప్, 10MP అల్ట్రా-వైడ్
సెల్ఫీ: 12MP ఫ్రంట్ కెమెరా

Also Read:  టూబ్‌లైట్ లాంటి మొబైల్.. 15000 నిట్స్‌తో ప్రపంచంలోనే అత్యంత బ్రైట్ డిస్‌ప్లే లాంచ్ చేసిన TCL

సాఫ్ట్‌వేర్, ధర

ఫోన్ OneUI 8తో Android 16 ఆధారంగా రన్ అవుతుంది. భారతదేశంలో ప్రారంభ ధర రూ.1,39,999.

Also Read: శాంసంగ్ మిడ్ రేంజ్ ఫోన్స్ ధరల పెంపు.. కొత్త ఫోన్స్ లాంచ్‌కు ముందే ధరలు లీక్

ఇప్పుడు కొనడం సరైనదేనా?

ఈ ఫోన్‌లో ఉన్న ప్రైవసీ డిస్‌ప్లే కొత్త ప్రైవసీ లేయర్ ఇస్తుంది. కొంత వరకు లోపాలు ఉన్నాయి. ఫీచర్ ఆన్ చేసినప్పుడు స్క్రీన్ బ్రైట్‌నెస్, క్లారిటీ తగ్గుతాయి. షార్ప్, బ్రైట్ డిస్‌ప్లేలు కావాలనుకునేవారికి ఇది సమస్య కావచ్చు. కానీ జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో క్రౌడెడ్ ప్రైవసీ కావాలనుకునేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

 

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×