E-Paper
Advertisement

జంతర్ మంతర్‌ వ్యవహారం.. కేంద్రానికి-ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు

జంతర్ మంతర్‌ వ్యవహారం.. కేంద్రానికి-ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు
Advertisement

Delhi Jantar Mantar: నిరసనలు తెలిపేందుకు అనువైన ప్రాంతం ఢిల్లీలోని జంతర్ మంతర్‌. ఈ ప్రాంతం కీలకమైన ఏరియాలో ఉండడంతో నిరసనలకు కేంద్రంగా మారింది. గడిచిన కొన్నాళ్లుగా అక్కడ జరుగుతున్న నిరసనలను గమనించిన కేంద్రం, మరొక ప్రాంతానికి  మార్చింది.  దీనిపై భగ్గుమన్న నిరసనకారులు, సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఈ క్రమంలో కేంద్రానికి, ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేసింది.

జంతర్ మంతర్‌ వేదిక వ్యవహారం

జంతర్‌మంతర్‌ ప్రాంతాన్ని నిరసన ప్రదేశాల నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని గురువారం విచారణ చేపట్టింది న్యాయస్థానం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం-ఢిల్లీ పోలీసుల నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. కేంద్రం, ఢిల్లీ పోలీసుల నుంచి సమాధానాలు సంతృప్తికరంగా లేకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొంది.

కేంద్రానికి-ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు

Advertisement

గతంలో తాము చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని జంతర్‌మంతర్‌ ప్రాంతాన్ని నిరసన వేదికగా తొలగించారా? స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారా? అంటూ ప్రశ్నించింది న్యాయస్థానం. సుప్రీంకోర్టు వ్యాఖ్యల వల్ల నిర్ణయం తీసుకోలేదని సొలిసిలిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. అందుకోసం హోంశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ నివేదిక ఆధారంగా మార్పు చేసినట్లు వివరించారు. నిరసనలకు వేదికగా ఆందోళనలు నిర్వహించుకునేందుకు కొత్త వేదికలపై ఢిల్లీ పోలీసులు ప్రకటన చేశారని తెలిపారు. అందుకోసం రామ్‌లీలా మైదాన్, బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్‌ ప్రాంతాలను గుర్తించినట్టు తెలిపారు.

కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సిఫారసుల ఆధారంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ జంతర్ మంతర్‌ను నిరసన వేదికను  తొలగిస్తూ అక్టోబర్ 11న ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషన్‌పై వాదనలు వినిపించారు సీనియర్ అడ్వకేట్లు ముక్తా గుప్తా, గోపాల్ శంకరనారాయణన్‌లు. ఈ సందర్భంగా జంతర్ మంతర్ ప్రాముఖ్యతను గుర్తు చేశారు. ప్రభుత్వ సంస్థలకు సమీపంలో ఉండటం వల్ల నిరసనకారులు తమ గొంతును సమర్థవంతంగా వినిపిస్తున్నారని తెలిపారు. ఢిల్లీ సిటీ కొద్దిమందికి పరిమితం కాకూడదని, నిరసన తెలిపే ప్రాథమిక హక్కును మోడీ సర్కార్ కాలరాస్తోందని వాదించారు. కొత్తగా గుర్తించిన ప్రదేశాలకు వెళ్లడం ప్రజలకు ఇబ్బందిగా మారుతుందని పిటిషన్లు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

ALSO READ: భార్యపై భర్త పైశాచికత్వం.. నచ్చిన కూర వండలేదని.. శరీరంపై పలుమార్లు కొరికి, బండరాయితో దాడి!

తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కష్టమవుతుందని ప్రస్తావించారు. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన ధర్మాసనం.. అధికారుల నుంచి రిప్లై వచ్చిన తర్వాత లోతుగా పరిశీలిస్తామని తెలిపింది. ప్రజాస్వామ్యంలో నిరసనల ప్రాముఖ్యత, ప్రత్యామ్నాయ వేదికల ప్రభావంపై వాదనలను విన్న తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

Related News

భార్యపై భర్త పైశాచికత్వం.. నచ్చిన కూర వండలేదని.. శరీరంపై పలుమార్లు కొరికి, బండరాయితో దాడి!

భర్త లేని సమయం చూసి దారుణం.. ప్రేయసిని హత్య చేసి.. పరారైన ఏసీ టెక్నీషియన్!

మత మార్పిడి రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, వారికి నో బీసీ కోటా

నాలుగేళ్లు రిలేషన్ షిప్.. ఉదయం పెళ్లి సాయంత్రం విడిపోయారు, పెళ్లికొడుకు అసలు రూపం

జర్మనీలో షాకింగ్ కేసు కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబో!

‘చెవి కొరికి తినేసి.. ఇప్పుడేమో ముందస్తు బెయిలా?’.. నిందితుడిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

Big Stories

Advertisement
×