E-Paper
Advertisement

భార్యపై భర్త పైశాచికత్వం.. నచ్చిన కూర వండలేదని.. శరీరంపై పలుమార్లు కొరికి, బండరాయితో దాడి!

భార్యపై భర్త పైశాచికత్వం.. నచ్చిన కూర వండలేదని.. శరీరంపై పలుమార్లు కొరికి, బండరాయితో దాడి!
Advertisement

UP Wife Attack: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇష్టమైన కూర వండలేదన్న కోపంతో ఓ భర్త భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. బంగాళదుంప పెట్టినందుకు పాశవికంగా దాడికి తెగబడ్డాడు. చౌరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దోమంపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే..

పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలిని 40 ఏళ్ల ప్రీతి విశ్వకర్మగా గుర్తించారు. నిందితుడైన ఆమె భర్త ఓం ప్రకాష్ విశ్వకర్మ ఘటన జరిగిన రోజు సాయంత్రం ఇంటికి వచ్చి భోజనం వడ్డించమని కోరాడు. ప్రీతి బంగాళాదుంప కూర వడ్డించగా.. అదేంటని భర్త నిలదీశాడు. ఇంట్లో కూరగాయాలు లేవని ఉన్న బంగాళదుంపతోనే తాను ఈ కూర వండినట్లు ప్రీతి అతనికి వివరణ ఇచ్చింది.

రక్తం కారేలా కొట్టి.. రాళ్లతో దాడి

Advertisement

భార్య చెప్పిన సమాధానాన్ని ఏ మాత్రం పట్టించుకోని ఓం ప్రకాష్.. ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. ఆమెపై విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా ఆమె శరీరంపై పలుచోట్ల కొరికేశాడు. అంతటితో ఆగకుండా బండరాయితో తలపై బలంగా బాదడంతో ఆమె అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆమె స్పృహ కోల్పోవడాన్ని గమనించిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

పిల్లల ఆర్తనాదాలు.. స్పందించిన పొరుగువారు

తల్లి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని చూసి భయపడిన ఆ దంపతుల పిల్లలు.. బోరున విలపిస్తూ కేకలు వేశారు. పిల్లల రోదనలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న ప్రీతిని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అదే సమయంలో పోలీసులకు కూడా సమాచారం అందించారు.

ఆస్పత్రికి తరలింపు..

Advertisement

మరోవైపు ప్రీతి తల భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం అదే రోజు రాత్రి ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కేసు నమోదు చేసిన పోలీసులు

బాధితురాలు ప్రీతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. హత్యాయత్నానికి సంబంధించిన సెక్షన్ 109(1)తో పాటు మరికొన్ని సెక్షన్లను ఎఫ్ఐఆర్ లో జోడించినట్లు పోలీసు ఆఫీసర్ రాజీవ్ కుమార్ సింగ్ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలతో గాలిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Also Read: సీఎం రేవంత్‌ మాదిరిగా గడ్డం పెంచుకుంటే అధికారంలోకి వస్తావా? కేటీఆర్‌కు విప్ వీరేశం స్ట్రాంగ్ కౌంటర్

భోపాల్, ఢిల్లీలోనూ ఇంతే..

ఇలాంటి అమానుష ఘటనలు ఇటీవలి కాలంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ వెలుగుచూశాయి. భోపాల్‌లో ఓ భర్త కోరిన ఆహారం కాకుండా పూరి వండిందన్న కోపంతో భార్యపై దాడి చేసి పారిపోయాడు. అలాగే ఢిల్లీలోని తిగ్రి ప్రాంతంలో వంట విషయంలో చెలరేగిన వాగ్వాదంలో భర్త రెచ్చిపోయాడు. 31 ఏళ్ల భార్యను తుపాకీతో దారుణంగా కాల్చి చంపాడు. గత నెల సెప్టెంబర్ లో జరిగిన ఈ ఘటన.. దేశవ్యాప్తంగా అందరిని షాక్ కు గురిచేసింది.

Also Read: భర్త లేని సమయం చూసి దారుణం.. ప్రేయసిని హత్య చేసి.. పరారైన ఏసీ టెక్నీషియన్!

Tags

Related News

భర్త లేని సమయం చూసి దారుణం.. ప్రేయసిని హత్య చేసి.. పరారైన ఏసీ టెక్నీషియన్!

మత మార్పిడి రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, వారికి నో బీసీ కోటా

నాలుగేళ్లు రిలేషన్ షిప్.. ఉదయం పెళ్లి సాయంత్రం విడిపోయారు, పెళ్లికొడుకు అసలు రూపం

జర్మనీలో షాకింగ్ కేసు కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబో!

‘చెవి కొరికి తినేసి.. ఇప్పుడేమో ముందస్తు బెయిలా?’.. నిందితుడిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!

Big Stories

Advertisement
×