E-Paper
Advertisement

తన జీవిత గాథ అలానే ముగియాలి..తన బయోపిక్ మూవీ పై సల్మాన్ ఖాన్ కామెంట్స్!

తన జీవిత గాథ అలానే ముగియాలి..తన బయోపిక్ మూవీ పై సల్మాన్ ఖాన్ కామెంట్స్!
Advertisement

Salman Khan Biopic: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా ఎన్నో వైవిద్య భరితమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సల్మాన్ ఖాన్ ఇప్పటికి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్ గా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన గత 15 సంవత్సరాలుగా హిందీ బిగ్ బాస్ హోస్ట్ గా కొనసాగుతూ ఉన్నారు.

సల్మాన్ ఖాన్ బయోపిక్ సినిమా డైరెక్టర్..

ఇప్పటికే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా సల్మాన్ ఖాన్ తాజాగా కరణ్ జోహార్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ (Koffee With Karan) టాక్ షోలో పాల్గొన్నారు. ఈ టాక్ షోలో భాగంగా ఈయన తన కెరీర్ కి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు అయితే ఇదే ఎపిసోడ్లో పాల్గొన్న మరో నటి కరిష్మా కపూర్(Karishma Kapoor) సల్మాన్ ఖాన్ ప్రశ్నిస్తూ మీ బయోపిక్ సినిమా చేస్తే ఏ డైరెక్టర్ చేస్తే బాగుంటుంది అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సల్మాన్ ఖాన్ సమాధానం చెబుతూ..

నా జీవిత గాధ ఇలాగే ముగిసిపోవాలి..

Advertisement

తన జీవితం గురించి బయోపిక్ సినిమా చేయటానికి తనకు ఇష్టం లేదని తెలిపారు. తన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడానికి తాను ఇష్టపడతాను తప్పా, బయోపిక్ సినిమా చేయటానికి ఇష్టపడనని ,నా జీవిత గాధ ఇలాగే ముగిసిపోవాలి అంటూ ఈయన బయోపిక్ సినిమాపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఒకవేళ సినిమా చేస్తే ఏ డైరెక్టర్ తో చేస్తే బాగుంటుందో ఊహించుకోండి అంటూ కరిష్మా కపూర్ మరో ప్రశ్న వేశారు.సూరజ్ బర్జాత్యా, కబీర్ ఖాన్, డేవిడ్ ధావన్ మరియు సంజయ్ లీలా భన్సాలీలలో ఏ దర్శకుడిని ఎంచుకుంటారని కరిష్మా అడిగారు.

బయోపిక్ సినిమా ఇష్టం లేదు..

ఈ ప్రశ్నకు సల్మాన్ ఖాన్ సమాధానం చెబుతూ..నా జీవితంపై కామెడీ సినిమా తీయాలి అనుకుంటే కచ్చితంగా డైరెక్టర్గా డేవిడ్ ధావన్ చేయాల్సి ఉంటుంది అలాగే సాంప్రదాయ విషాద ప్రేమకథా సినిమా చేయాలి అనుకుంటే సంజయ్ లీలా భన్సాలీ, అందమైన ప్రేమకథలు తీయాలనుకుంటే సూరజ్ బర్జాత్యా. నా జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా యాక్షన్ తరహా ప్రేమకథ తీయాలనుకుంటే కబీర్ ఖాన్ డైరెక్షన్ చేస్తే బాగుంటుంది అంటూ ఈయన చెప్పారు. కానీ తన బయోపిక్ సినిమా చేయటానికి మాత్రం సల్మాన్ ఖాన్ ఇష్టపడటం లేదని ఈ సందర్భంగా బయటపెట్టారు. అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు క్రీడా రంగానికి చెందిన వారి బయోపిక్ సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ బయోపిక్ గురించి అడగడంతో ఆయన తనకిష్టం లేదని తేల్చి చెప్పారు.

Advertisement

Also Read: తన జీవిత గాథ అలానే ముగియాలి..తన బయోపిక్ మూవీ పై సల్మాన్ ఖాన్ కామెంట్స్!

Related News

భార్య అంటే ఉచితంగా వచ్చే పనిమనిషా?- అనుపమ కామెంట్స్ వైరల్!

సాయి దుర్గ తేజ్ బర్తడే స్పెషల్.. అమ్మవారి మొక్క నాటిన నాగబాబు!

బోల్డ్ ఫోటోషూట్ తో రచ్చ చేస్తున్న అక్కినేని కోడలు.. టార్గెట్ చేసిన సమంత ఫ్యాన్స్!

మొదటసారి రష్మికతో కలసి పుట్టపర్తి వచ్చిన విజయ్ దేవరకొండ!

‘ భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి’ బయోపిక్ పై రజినీకాంత్ కామెంట్స్!

నానా పటేకర్ చనిపోలేదా.. హాట్ బాంబు పేల్చిన నటి!

ఆ ఒక్క క్షణమే పునీత్ ప్రాణం తీసిందా..ఇన్నేళ్ళకి బయటపడ్డ నిజం!

Big Stories

Advertisement
×