Surajkund Fair: హర్యానాలోని సూరజ్‌కుండ్ మేళాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ భారీ జెయింట్ స్వింగ్ అకస్మాత్తుగా విరిగిపడింది. ఈ దుర్ఘటనలో ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. మరో 13 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో సూరజ్‌కుండ్ లో విషాదచాయలు అలముకున్నాయి.
హర్యానలోని కూరజ్‌కుండ్ మేళాలో ఘోర ప్రమాదం
హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా సూరజ్‌కుండ్ గుజ్జర్ల అంతర్జాతీయ మేళాకు వేదికైంది. అయితే ఈ మేళా గంటల వ్యవధిలో రెండు ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపింది. మేళా పేరు చెప్పగానే చాలు, జనం తండోపతండాలుగా వస్తుంటారు. అక్కడే అదే జరిగింది. సందర్శకులతో కిక్కిరిసిన ఓ భారీ జెయింట్ స్వింగ్ శనివారం రాత్రి అకస్మాత్తుగా విరిగిపడింది. ఈ దుర్ఘటనలో ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రాణాలు కోల్పోయాడు.
మరో 18 మందికి గాయపడ్డారు.ఈ మేళాలో మేళాలో ఏర్పాటు చేసిన అమ్యూజ్‌మెంట్ రైడ్లలో ఒకటి జెయింట్ స్వింగ్. సందర్శకులతో మూవ్ అవుతుండగా ఒక్కసారిగా దాని పిల్లర్లలో ఒకటి విరిగిపోయింది. దీంతో స్వింగ్ అదుపు తప్పి నేల కూలింది. ప్రమాదాన్ని గమనించిన ఇన్‌స్పెక్టర్ జగదీశ్ ప్రసాద్ వెంటనే స్పందించారు.
కూలిన జెయింట్ స్వింగ్.. స్పాట్‌లో 18 మంది
ప్రజలను రక్షించేందుకు ప్రయత్నంలో కూలుతున్న స్వింగ్ ఇనుప భాగం ఆయనపై పడింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా జగదీశ్ ప్రసాద్ మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
కేంద్ర పర్యాటక- వస్త్ర సంస్కృతి-విదేశాంగ మంత్రిత్వ శాఖల సహకారంతో సూరజ్‌కుండ్ మేళాని హర్యానా టూరిజం నిర్వహించింది. ఈ ఏడాది జనవరి 31న మొదలైన ఈ ఉత్సవం, ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. ఈ ప్రమాదానికి దాదాపు మూడు గంటల ముందు బలమైన గాలుల కారణంగా వేదిక వద్ద ఫుడ్ కోర్ట్ సమీపంలో ఓ గేటు కూలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు.
ALSO READ: స్వీడిష్ అందగత్తెతో అనిల్ అంబానీ? ఎప్‌స్టిన్ ఫైల్స్‌లో సంచలనం
ఫెయిర్ గ్రౌండ్స్ లోపల షాపులు మధ్య పెద్ద సంఖ్యలో ప్రజలు తిరుగుతున్నారు. ఈ సమయంలో ఘటన జరిగింది. గేటు కొంతకాలంగా ఉందని ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని, దీనివల్ల అది అకస్మాత్తుగా కూలిపోయిందని మేళా నిర్వాహకులు తెలిపారు. ప్రమాదం తర్వాత ప్రదేశం మూసివేయలేదు నిర్వాహకులు. ఆదివారం పంజాబీ గాయకుడు గురుదాస్ మాన్ ప్రదర్శనతో సహా వారాంతంలో జరగాల్సిన కార్యక్రమాలు కంటిన్యూ అవుతున్నట్లు చెప్పారు. పోలీసు అధికారి మృతికి హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ సంతాపం తెలిపారు.
That How the swing broke in #Surajkund fair in #Faridabad leaving one cop dead and 13 injured. Though this is #Haryana's biggest annual cultural event safety seems to have been ignored. Not just this fair but in every single one in country nobody cares to check rides , their… pic.twitter.com/jjye9x4D7m
— Sumedha Sharma (@sumedhasharma86) February 7, 2026