E-Paper
Advertisement

Epstein Files: స్వీడిష్ అందగత్తెతో అనిల్ అంబానీ? ఎప్‌స్టిన్ ఫైల్స్‌లో సంచలనం.. ఇది నిజమేనా?

Epstein Files: స్వీడిష్ అందగత్తెతో అనిల్ అంబానీ? ఎప్‌స్టిన్ ఫైల్స్‌లో సంచలనం.. ఇది నిజమేనా?
Advertisement

Epstein Files: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లైంగిక కుంభకోణం ఎప్ స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త (Indian businessman) అనిల్ అంబానీ (Anil Ambani) పేరు.. ఈ ఫైల్స్ రావడం యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అమెరికా న్యాయ శాఖ (United States Justice Department) కొత్తగా విడుదల చేసిన పత్రాల్లో తొలిసారి ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్ స్టీన్ తో భారత వ్యాపారవేత్తకు ఉన్న సంబంధాల గురించి ఈ ఫైల్స్ లో ఉన్నాయి. ఎప్ స్టీన్ గ్లోబల్ నెట్ వర్క్.. అమెరికా దాటి భారతదేశానికి సైతం ఏవిధంగా విస్తరించిందో తాజా పత్రాలు హైలెట్ చేస్తున్నాయి.

ఎప్‌స్టీన్‌తో సంప్రదింపులు..!

2017-2019 మధ్య మైనర్లను లైంగిక చర్యల కోసం అక్రమ రావాణా చేశారన్న ఆరోపణలపై 2019లో జెఫ్రీ ఎప్ స్టీన్ ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన అరెస్టుకు కొద్ది నెలల ముందు వరకూ భారత వ్యాపారవేత్త అనిల్ అంబానీతో ఎప్ స్టీన్ కు పరస్పర సంప్రదింపులు జరిగినట్లు తాజా పత్రాలు బయటపెట్టాయి. అంతర్జాతీయ వ్యవహరాలు, వ్యాపార ఆసక్తులు, వ్యక్తిగత విషయాలు సహా అనేక అంశాలపై ఇరువురు చర్చించుకున్నట్లు తేలింది. ఎవరికీ తెలియకుండా ప్రైవేటుగా కలుసుకోవాలని కూడా ఇద్దరు భావించినట్లు లేటెస్ట్ ఎప్ స్టీన్ ఫైల్స్ తెలియజేశాయి.

పొడవైన స్వీడిష్ అందగత్తె!

Advertisement

2017 మార్చి 9వ తేదీన జరిగిన ఒక సంభాషనను కూడా తాజా ఫైల్స్ రివీల్ చేశాయి. ఈ పత్రాల ప్రకారం.. పొడవైన స్వీడిష్ అందగత్తె.. మీ రాకను మరింత సరదాగా మార్చేస్తుందని ఎప్ స్టీన్.. అనిల్ అంబానీతో అన్నారు. దానికి అంబానీ బదులిస్తూ.. ఏర్పాట్లు చేసుకోండి అంటూ సమాధానం ఇచ్చినట్లు తాజా ఫైల్స్ వెల్లడించాయి. అదే సంభాషణలో ఇద్దరూ పారిస్ సమావేశం గురించి కూడా చర్చించుకున్నారని తాజా పత్రాలు తెలియజేశాయి. ఇందుకు అనుగుణంగా మాన్‌హట్టన్‌లోని ఎప్ స్టీన్ కు చెందిన అప్పర్ ఈస్ట్ సైడ్ నివాసంలో వారిద్దరు సమావేశమైనట్లు కూడా కొందరు సహాయకులు ధ్రువీకరించినట్లు తాజా ఫైల్స్ వెల్లడించాయి.

Also Read: Big TV Malayalam: బిగ్ టీవీ మరో సంచలనం.. కేరళ గడ్డపైకి దమ్మున్న ఛానెల్.. ఆదివారమే ఆరంభం

అంబానీ బుక్స్ ఆర్డర్!

Advertisement

మరోవైపు 2017లో అంబానీ ఫ్యామిలీకి చెందిన అనేక డిజిటల్ పుస్తకాలను ఎప్ స్టీన్ ఆర్డర్ చేసినట్లు కూడా తాజా పత్రాలు తెలియజేశాయి. వాటిలో అనిల్ అంబానీ, అతని సోదరుడు ముఖేష్ అంబానీ మధ్య వ్యాపార పోటీని తెలియజేసే శీర్షికలు ఉన్న పుస్తకాలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే 2002లో ధీరూభాయ్ అంబానీ మరణం తర్వాత ఆయన సామ్రాజ్యం కుమారులు ఇద్దరికీ రెండుగా చీలిపోయింది. ప్రస్తుతం ముకేశ్ అంబానీ 98.4 బిలియన్ డాలర్ల నికర ఆస్తితో ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. మరోవైపు అనిల్ అంబానీ ఆర్థిక పరిస్థితి మాత్రం బాగా క్షీణించింది.

Also Read: BJP – Janasena Alliance: బీజేపీ-జనసేన పొత్తుకు బీటలు? వెనక్కితగ్గిన కమలం.. మున్సిపోరులో ఒంటరిగానే?

Related News

ఆఫీసులోనే గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×