E-Paper
Advertisement

Malayalam horror comedies OTT : మలయాళం సినిమాలంటే పిచ్చా ? అయితే ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాల్సిన ఈ హర్రర్ కామెడీ మూవీస్ మీ కోసమే

Malayalam horror comedies OTT : మలయాళం సినిమాలంటే పిచ్చా ? అయితే ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాల్సిన ఈ హర్రర్ కామెడీ మూవీస్ మీ కోసమే
Advertisement

Malayalam horror comedies OTT : మలయాళ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు అద్భుతమైన థ్రిల్లర్లకు పెట్టింది పేరు. అయితే ఈ మధ్యకాలంలో థ్రిల్లర్‌కు కామెడీని జోడిస్తూ సరికొత్త ఎంటర్టైన్ ఇస్తున్న కొన్ని సినిమాలు, తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇవి థియేటర్లతో పాటు, ఓటీటీలో కూడా సత్తా చాటుతున్నాయి. వీటిలో వెబ్ సిరీస్ లు కూడా ఏమాత్రం తీసిపోవట్లేదు. వీటన్నిటిని కూడా ఫ్యామిలీతో కలసి ఎంచక్కా ఎంజాయ్ చయచ్చు. ఇప్పుడు ఈ హారర్ కామెడీ థ్రిల్లర్లపై ఓ లుక్ వేద్దాం పదండి.

Nellikkampoyil Night Riders (నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్):

ఒక గ్రామంలో రాత్రిపూట జరిగే వింత సంఘటనలు, ఒక ముసుగు ధరించిన ఆగంతకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక వైపు భయం పుట్టిస్తూనే, మరో వైపు నవ్వు తెప్పిస్తుంటుంది ఈ సినిమా. ఈ కామెడీ థ్రిల్లర్‌లో మాథ్యూ థామస్ ప్రధాన పాత్ర పోషించారు. ఇది 2026 ఫిబ్రవరి 6 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది.

Sarvam Maya (సర్వం మాయ)

Advertisement

దేవుడిని నమ్మని ఒక మ్యూజిషియన్ అనుకోకుండా పూజారిగా మారాల్సి వస్తుంది. ఒక ఆడ దెయ్యంతో అతను పంచుకునే ప్రయాణం, ఆ తర్వాత జరిగే సరదా సంఘటనలే ఈ సినిమా. నివిన్ పౌలీ చాలా కాలం తర్వాత తనదైన కామెడీ టైమింగ్‌తో ఈ సూపర్‌నేచురల్ కామెడీలో అలరించారు. ఇది 2026 జనవరి 30 నుండి JioHotstarలో అందుబాటులో ఉంది.

Sumathi Valavu (సుమతి వలవు)

కేరళలోని ఒక రోడ్డు మలుపు దగ్గర జరిగే మరణాలు, అక్కడ ఉన్న ఒక శాపం చుట్టూ తిరిగే కథ ఇది. ఫోక్లోర్ అంశాలను కామెడీతో చూపిస్తూ దర్శకుడు విష్ణు శశి శంకర్ దీనిని తెరకెక్కించారు. ఇందులో అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇది
2025 సెప్టెంబర్ 26 నుండి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

Inspection Bungalow (ఇన్‌స్పెక్షన్ బంగ్లా)

Advertisement

మలయాళంలో వచ్చిన మొదటి హారర్ కామెడీ వెబ్ సిరీస్ ఇది. ఇందులో ఒక పాడుబడిన పాత బంగ్లాను పోలీస్ స్టేషన్‌గా మారుస్తారు. అక్కడ విధులు నిర్వహించే పోలీసులకు ఎదురయ్యే భయంకరమైన సంఘటనలు, అదే సమయంలో నవ్వు తెప్పించే కామెడీ సీన్స్ తో ఈ సిరీస్ నడుస్తుంది. ఇది 2025 నవంబర్ 14 నుండి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also :  కొరియన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. అదరగొట్టే సిరీస్‌లు ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ ?

Tags

Related News

హఠాత్తుగా ఆకాశంలో హోల్… టైమ్ ట్రావెల్ తో థ్రిల్లింగ్ సై-ఫై అడ్వెంచర్

విశ్వంభర ఓటీటీ డీల్ పై సందిగ్ధత.. తెరపైకి కొత్త విడుదల తేదీ!

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

Big Stories

Advertisement
×