E-Paper
Advertisement

విజయ్ సీఎం కావాలంటే ఎన్ని సీట్లు కావాలి? మ్యాజిక్ ఫిగరెంత?

విజయ్ సీఎం కావాలంటే ఎన్ని సీట్లు కావాలి? మ్యాజిక్ ఫిగరెంత?
Advertisement

Tamil Nadu election Results Live Updates: తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారునున్నాయా? అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదా? తమిళనాడులో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? విజయ్ పార్టీ టీవీకె ఎక్కువ అవకాశాలు ఉన్నాయా? మ్యాజిక్ ఫిగర్ ఎంత కావాలి? మళ్లీ క్యాంప్ రాజకీయాలు వేడెక్కనున్నాయా? స్టాలిన్‌కు సన్ స్ట్రోక్ తగిలిందా? బీజేపీ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయ్యిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

హంగ్ దిశగా తమిళనాడు.. ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వని ఓటర్లు

Advertisement

తమిళనాడు ఓటర్లు ఈసారి విలక్షణమైన తీర్పు ఇచ్చారు. నాలుగైదు దశాబ్దాలుగా డీఎంకె, అన్నాడీఎంకె పాలన చూసిన ఓటర్లు, ఏ పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వలేదు. కాకపోతే విజయ్ సారథ్యంలోని టీవీకె పార్టీకి అధిక సీట్లు ఇచ్చారు. అయినా సరే హంగ్ దిశగా నడుస్తోంది.

234 సీట్లు తమిళనాడు శాసనసభకు ఏ పార్టీ అధికారంలోకి రావాలంటే 118 సీట్లు కావాలి. ప్రస్తుతం పార్టీల ఆధిక్యం పరిశీలిస్తే.. టీవీకె పార్టీకి-105, అన్నాడీఎంకె-75, డీఎంకె-54 సీట్లలో ఆధిక్యం కనబరుస్తున్నాయి. కాకపోతే నాలుగైదు సీట్లు అటు ఇటు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వని ఓటర్లు.. అప్పుడే రిసార్ట్ రాజకీయాలు మొదలు

రాజకీయాల్లో బద్ద శత్రువులుగా ఉన్నా డీఎంకె-అన్నాడీఎంకె జతకట్టడం కలవడం కష్టమని అక్కడి రాజకీయ పార్టీల నేతలు బలంగా చెబుతున్నారు. ఎటుచూసినా విజయ్ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. పూర్తి మెజార్టీ రావడం కష్టమని ముందుగా పసిగట్టిన విజయ్ పార్టీ.

ఈ నేపథ్యంలో మహాబలిపురం సమీపంలోని పూంజేరి వద్ద ఓ లగ్జరీ ప్రైవేట్ రిసార్ట్‌ మొత్తాన్ని బుక్ చేసింది. మధ్యాహ్నం తర్వాత గెలిచిన అభ్యర్థులంతా అక్కడికి రానున్నారు. ఫలితాల సరళి తర్వాత డీఎంకె, అన్నాడీఎంకె ముఖ్యనేతలు టీవీకే పార్టీతో మంతనాలు మొదలుపెట్టినట్టు సమాచారం.

ALSO READ: తమిళనాడు ఎన్నికల ఫలితాలు.. దూసుకుపోతున్న విజయ్‘పతాకం’, వెనుకబడిన అధికార డీఎంకె

టీవీకె పార్టీకి సీఎం పీఠం.. ఆర్థిక, హోం శాఖలను మాకు ఇవ్వాలని ఇరు పార్టీలు బేరాలు మొదలుపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.  పూర్తిగా ఫలితాలు వెల్లడి తర్వాత చూద్దామని దాట వేసే ప్రయత్నం టీవీకె పార్టీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇదే సమయంలో విజయ్ సన్నిహితంగా ఉండే త్రిషతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నాయట అక్కడి పార్టీలు.

మరోవైపు టీవీకె పార్టీ అధినేత విజయ్ వెనుక బీజేపీ చక్రం తిప్పిందని అంటున్నారు కొందరు నేతలు. అందుకు కారణాలు లేకపోలేదు. పొత్తుల విషయంలో తొలుత టీవీకె పార్టీకి తొలుత ఆఫర్ ఇచ్చింది బీజేపీ. అందుకు ఆ పార్టీ ససేమిరా అనడంతో ఆ పార్టీపై ప్రజల్లో మాంచి ఊపు వచ్చిందని అంటున్నారు. ఓవైపు అన్నాడీఎంకెతో ఉంటూనే, విజయ్‌కు బూస్ట్ ఇచ్చిందని మరికొందరి నేతల మాట.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×