E-Paper
Advertisement

Tamil Nadu election Results Live Updates: తమిళనాడు ఎన్నికల ఫలితాలు.. దూసుకుపోతున్న విజయ్‘పతాకం’, వెనుకబడిన అధికార డీఎంకె

Tamil Nadu election Results Live Updates: తమిళనాడు ఎన్నికల ఫలితాలు.. దూసుకుపోతున్న విజయ్‘పతాకం’,  వెనుకబడిన అధికార డీఎంకె
Advertisement

Tamil Nadu election Results Live Updates: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార డీఎంకెకు ఓటర్లు షాకిచ్చినట్టు కనిపిస్తోంది. సినీ నటుల పార్టీలను అభిమానించే తమిళ ఓటర్లు, ఈసారి అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. కాకపోతే కరుణానిధి వారసుడు, అధికార డీఎంకెను ఓటర్లు దూరం పెట్టారు.

తమిళనాడు ఎన్నికల ఫలితాలు.. దూసుకుపోతున్న విజయ్‘పతాకం’

Advertisement

పోస్టల్ బ్యాలెట్‌లో కొనసాగించిన అధికార డీఎంకె, అదే జోరు కొనసాగించలేకపోయింది. కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ టీవీకె పార్టీ 100 సీట్లు ఆధిక్యంలో కొనసాగుతోంది. సోమవారం ఉదయం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్‌లో జోరు కొనసాగించింది అధికార డీఎంకె.

దీంతో మరోసారి ఓటర్లు ఆ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని భావించారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. అప్పటివరకు తొలి ప్లేస్‌లో ఉన్న డీఎంకె, మూడో స్థానానికి పడిపోయింది. ఈలోగా నటుడు విజయ్ కొత్త టీవీకె దూసుకొచ్చింది. ఏకంగా 90 సీట్లపైగా ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యం కొనసాగుతున్నారు.

Advertisement

వెనుకబడిన అధికార డీఎంకె.. సెకండ్ ప్లేస్‌లో అన్నాడీఎంకె

విపక్ష అన్నాడీఎంకె కూడా జోరందుకుంది. ఏకంగా 73 సీట్లు లీడ్స్‌లో ఉంది. అధికార డీఎంకెకు ప్రజలు షాకిచ్చినట్టు కనిపిస్తోంది. కేవలం 60 సీట్లపైగా అధిక్యంలో ఉంది. ముక్కోణపు పోటీలో సునాయాశంగా విజయం సాధించవచ్చని అధికార డీఎంకె భావించింది. కానీ ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చినట్టు అర్థమవుతోంది.

విజయ్ కొత్త పార్టీని ఆదరించినట్టు కనిపిస్తోంది. వెలువడుతున్న ఫలితాలను పరిశీలిస్తే.. ఓటర్లు ఏ పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వలేనట్టు కనిపిస్తోంది. ఈ లెక్కన టీవీకె పార్టీ చీఫ్ విజయ్ అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ALSO READ: అస్సాం వార్ వన్ సైడ్.. ఎన్డీయే దూకుడు.. కాంగ్రెస్ వెనుకంజ‌

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×