E-Paper
Advertisement

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మోడల్స్ పై ఏకంగా రూ. 2.12 లక్షల తగ్గింపు!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మోడల్స్ పై ఏకంగా రూ. 2.12 లక్షల తగ్గింపు!
Advertisement

Massive Discounts on Honda Cars: ఈ నెలలో కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి హోండా కార్స్ ఇండియా అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా హోండా ఎలివేట్, హోండా సిటీ, హోండా అమేజ్ మోడళ్లపై  క్రేజీ డిస్కౌంట్లు అందుబాటులో తీసుకొచ్చింది. ఈ ఆఫర్లు మే 31 వరకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ ప్రకటించింది.

⦿ హోండా ఎలివేట్

ఈ మిడ్‌సైజ్ SUVపై రూ. 2.12 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. ఇందులో సుమారు రూ. 40,000 వరకు నేరుగా క్యాష్ డిస్కౌంట్స్, రూ. 30,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ, ఆఫర్ బెనిఫిట్స్ ఉన్నాయి. గత సంవత్సరం తయారైన స్టాక్‌పై అదనపు ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఇందులో తక్కువ ధరకు 7 సంవత్సరాలు పొడిగించిన వారంటీ కూడా కల్పిస్తున్నారు. ధర విషయానికి వస్తే, ఎలివేట్ సుమారు రూ. 11.60 లక్షల నుంచి రూ. 16.57 లక్షల వరకు ఉంటుంది. ఈ SUV మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైరిడర్ లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది.

⦿ హోండా సిటీ

Advertisement

ఇక హోండా సిటీ సెడాన్‌పై కూడా మంచి తగ్గింపులు ఉన్నాయి. హైబ్రిడ్ వెర్షన్‌ పై ఎక్కువ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. సుమారు రూ. 1.80 లక్షల వరకు నేరుగా క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎక్స్‌ టెండెడ్ వారంటీ కూడా తగ్గింపు ధరకు అందిస్తున్నారు. పెట్రోల్ వెర్షన్ కు సంబంధించి మొత్తం  రూ. 1.56 లక్షల వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో రూ. 40,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 60,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ ఆఫర్లు ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్ కారు రూ. 12 లక్షల నుంచి రూ. 16.07 లక్షల వరకు ఉండగా, హైబ్రిడ్ వెర్షన్ ధర సుమారు రూ. 20 లక్షల దగ్గర ఉంటుంది. ఈ సెడాన్ మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా, వోక్స్‌వ్యాగన్ విర్టస్, స్కోడా స్లావియాలకు గట్టి పోటీ ఇస్తుంది.

⦿ హోండా అమేజ్

ఈ కాంపాక్ట్ సెడాన్‌ పై కూడా కొన్ని మంచి ఆఫర్లు ఉన్నాయి. థర్డ్ జెనరేషన్ మోడల్‌పై  రూ. 67,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 15,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి. మరోవైపు, సెకెండ్ జెనరేషన్ మోడల్‌పై  కాస్త తక్కువ ఆఫర్లు ఉన్నాయి. ఈ మోడల్ పై రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. 10,000 వరకు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ లభిస్తుంది. రెండు మోడళ్లపైనా లాయల్టీ ప్రయోజనాలు, 7 సంవత్సరాలు పొడిగించిన వారంటీని తక్కువ ధరకు అందించారు. ధర విషయానికి వస్తే, సెకెండ్ జెనరేషన్ అమేజ్ రూ. 6.98 లక్షల నుంచి రూ. 7.80 లక్షల వరకు ఉండగా, థర్డ్ జెనరేషన్ మోడల్ ధరలు రూ. 7.51 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉన్నాయి. ఈ కారు మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ లాంటి కార్లతో  పోటీ పడుతోంది.

Advertisement

Read Also: స్టైలిష్ లుక్, క్రేజీ ఫీచర్స్.. మారుతి బ్రెజ్జా ఫేస్‌ లిఫ్ట్ వచ్చేస్తోంది!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×