E-Paper
Advertisement

టీసీఎస్ నాసిక్ యూనిట్‌లో లైంగిక వేధింపులు.. వెలుగులోకి సంచ‌ల‌న నిజాలు

టీసీఎస్ నాసిక్ యూనిట్‌లో లైంగిక వేధింపులు.. వెలుగులోకి సంచ‌ల‌న నిజాలు
Advertisement

TCS Harassment Case: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ యూనిట్‌లో ఒక మహిళా ఉద్యోగినిపై గత కొన్ని నెలలుగా జరిగిన లైంగిక వేధింపులు, వేధించడం (Stalking), మతపరమైన వ్యాఖ్యల ఉదంతం కలకలం సృష్టిస్తోంది. 2025 జూన్ నుండి 2026 మార్చి మధ్య కాలంలో ఐదుగురు సహోద్యోగులు తనను వేధించినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగం పోతుందనే భయంతో ఆమె ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నట్లు తెలిపారు.

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్ర‌కారం.. బాధితురాలు జూన్ 20, 2025న టీసీఎస్‌లో అసోసియేట్‌గా చేరగా, శిక్షణ ప్రారంభమైనప్పటి నుండే వేధింపులు మొదలయ్యాయి. శిక్షణ సమయంలో సంబంధం లేకపోయినా ట్రైనింగ్ రూమ్‌లోకి వచ్చి బాధితురాలి వ్యక్తిగత జీవితంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసేవాడని ఆమె ఆరోపించారు. ఆమెకు ‘ప్లేయర్’ అనే ముద్దుపేరు పెట్టి పిలిచేవాడని, 2026 మార్చిలో ఉగాది (గుడి పడ్వా) సందర్భంగా ఆమె చీరను వెనుక నుండి లాగి అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

సెప్టెంబర్ 2025లో ఈయన బాధితురాలి పక్కన కూర్చుని అభ్యంతరకరంగా తాకడం, చేయి పట్టుకోవడం వంటి పనులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. వివాహం అయిందని తెలిసినా తనతో బయటకు రావాలని ఒత్తిడి చేసేవాడని, మతపరమైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ హిందూ దేవతలను అవమానించాడని ఆమె వాపోయారు.

ప్రతిరోజూ ఆమె డెస్క్ దగ్గరకు వచ్చి డ‌బుల్ మీనింగ్ తో కూడిన మాటలు మాట్లాడటం, పని నేర్పిస్తాననే నెపంతో అసభ్యంగా తాకడం చేసేవాడని బాధితురాలు పేర్కొన్నారు. వీరు కూడా బాధితురాలిని తదేకంగా చూడటం, ఆమె రూపంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా వేధించినట్లు ఫిర్యాదులో ఉంది.

Advertisement

నాసిక్ టీసీఎస్ యూనిట్‌లో కేవలం లైంగిక వేధింపులే కాకుండా, అత్యాచారం, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే తీవ్రమైన ఆరోపణలు రావడంతో జాతీయ మహిళా కమిషన్ (NCW) ఒక ఫ్యాక్ట్-ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ లోతైన విచారణ జరిపి నివేదిక సమర్పించనుంది.

ఈ ఘటనలపై టీసీఎస్ స్పందిస్తూ, వేధింపుల పట్ల తమకు ‘జీరో టాలరెన్స్’ పాలసీ ఉందని స్పష్టం చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న ఐదుగురు ఉద్యోగులను విచారణ పూర్తయ్యే వరకు తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు కంపెనీ ధృవీకరించింది. పోలీసుల దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తామని యాజమాన్యం వెల్లడించింది.

Read Also: సైబర్ దొంగలతో బ్యాంకు సిబ్బంది కుమ్మక్కు.. 32 మంది అరెస్టు..!

Related News

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×