E-Paper
Advertisement

GST on Tobacco: దమ్ముంటే కొనండి.. లేదంటే మానేయండి! ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లపై ‘టాక్స్’ టెర్రర్

GST on Tobacco: దమ్ముంటే కొనండి.. లేదంటే మానేయండి! ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లపై ‘టాక్స్’ టెర్రర్
Advertisement

GST on Tobacco: ధూమపాన ప్రియులకు భారీ షాకిచ్చింది కేంద్ర ప్రభుత్వం. వచ్చే రోజుల్లో వారిపై పడనున్న సెస్సును బట్టీ చూస్తుంటే.. వారు పొగాకు సేవించకుండానే గుండెలదిరిపోయేలా ఉన్నాయి. అంతగా పొగాకు, పాన్ మసాలా ఉత్పత్తులపై సెస్ విధించనుంది కేంద్ర ప్రభుత్వం.

Advertisement

ధూమపాన ప్రియులకు కేంద్రం షాక్..

ఫిబ్రవరి 1 నుంచి పొగాకు, పాన్ మసాలా ఉత్పత్తులపై పాత పన్ను రద్దు చేస్తూ కొత్త ఎక్సైజ్ డ్యూటీని విధిస్తోంది కేంద్రం. ఈ మార్పు వల్ల సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలు ఫిబ్రవరి 1 నుంచి పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని జనవరి ఫస్ట్ నాడు అధికారికంగా ప్రకటించింది.

Advertisement

పాతపన్ను రద్దు చేస్తూ కొత్త ఎక్సైజ్ డ్యూటీ..

ఇది వరకు పొగాకు ఉత్పత్తులపై 28 శాతం జీఎస్టీతో పాటు కంపన్సేషన్ సెస్ విధిస్తుండగా.. ఈ సెస్ మార్చి 2026 లోపు ముగియనుంది. దీని వల్ల టుబాకో ప్రోడక్ట్స్ ధరలు తగ్గే అవకాశముండటంతో.. ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ డ్యూటీని ప్రవేశపెట్టబోతోంది.

సిగరెట్ పొడవు, ఫిల్టర్ రకాన్ని బట్టీ మారే సెస్

వెయ్యి సిగరెట్లపై రూ. 2050 నుంచి రూ. 8500 మేర ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నారు. ఇది సిగరెట్ పొడవు, ఫిల్టర్ రకం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని రిపోర్టుల ప్రకారం ఈ పరిధి రూ. 2700 నుంచి రూ. 11 వేల వరకూ ఉండొచ్చని అంచనా.

తక్కువ ధర సిగరెట్లపై అధిక ప్రభావం పడే అవకాశం

ఈ మార్పు కారణంగా సిగరెట్ ధరలు ఎలా పెరుగుతాయని చూస్తే.. తక్కువ ధర సిగరెట్లపై ప్రభావం ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. ప్రీమియం బ్రాండ్ల మీద తక్కువగా ఉండేలా తెలుస్తోంది. ఉదాహరణకు రూ. 10 కి అమ్మే సిగరెట్ లూస్ సేల్ మీద రెండు రూపాయల నుంచి పది రూపాయల వరకూ పెరిగే ఛాన్సుంది.

Also Read: ఏపీలో భారీగా మద్యం అమ్మకాలు.. రికార్డు స్థాయిలో ఆదాయం

చౌకగా లభించే సిగరెట్లు రూ. 18 నుంచి రూ. 25కి పెరొగొచ్చని అంచనా

కొన్ని అంచనాల ప్రకారం చౌకగా లభించే సిగరెట్లు రూ. 18 నుంచి రూ. 25- 30 వరకూ పెరగొచ్చని తెలుస్తోంది. అయితే కొన్ని అంచనాల ప్రకారం ఒక సిగరెట్ ధర.. రూ. 72 వరకూ పెరగొచ్చని కూడా అంటున్నారు. కానీ అదేమంత వాస్తవం కాదన్న మాట కూడా వినిపిస్తోంది.

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×