E-Paper
Advertisement

Laptop Offers: బడ్జెట్ అంటే ఇదీ.. రూ.11వేలకే ల్యాప్‌టాప్ ఇస్తున్న లెనోవో.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుల్ రచ్చ

Laptop Offers: బడ్జెట్ అంటే ఇదీ.. రూ.11వేలకే ల్యాప్‌టాప్ ఇస్తున్న లెనోవో.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుల్ రచ్చ
Advertisement

Laptop Offers: టెక్నాలజీ వేగంగా మారుతున్న ఈ రోజుల్లో విద్యార్థులు, ఫ్రీలాన్సర్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి ల్యాప్‌టాప్ రోజువారీ అవసరంగా మారింది. ఆన్‌లైన్ క్లాసులు, డాక్యుమెంట్ వర్క్, వెబ్ బ్రౌజింగ్, వీడియో కాల్స్, సాధారణ మల్టీటాస్కింగ్ కోసం లైట్‌వెయిట్, ఫాస్ట్ బూట్ అప్, లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉన్న డివైస్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. సాధారణంగా ల్యాప్‌టాప్ ధరలు రూ.20 వేల నుంచి ప్రారంభమవుతాయి. ఈ పరిస్థితిలో ప్రముఖ బ్రాండ్ లెనోవో బడ్జెట్ యూజర్లకు మంచి అవకాశం ఇచ్చింది. లెనోవో 100e క్రోమ్‌బుక్ జెన్ 4ను చాలా తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువచ్చి, విద్యార్థులు, హోమ్ యూజర్లు, ప్రాథమిక ఆఫీస్ పనులు చేసే వారికి సరైన ఎంపికగా నిలిచింది.

క్రోమ్ ఓఎస్ .. జెమినీ AI సపోర్ట్

Advertisement

లెనోవో 100e క్రోమ్‌బుక్ జెన్ 4 గూగుల్ క్రోమ్ ఓఎస్‌పై పనిచేస్తుంది. స్విచ్ ఆన్ చేసిన వెంటనే 8–10 సెకన్లలోనే రెడీ అవుతుంది, విండోస్ ల్యాప్‌టాప్‌లలాగా ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆటోమాటిక్ అప్‌డేట్స్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే పూర్తవుతాయి, వైరస్ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ ఉండటంతో నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్, గేమ్స్, ఫోటో ఎడిటింగ్ యాప్‌లను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ జెమినీ AI ఇంటిగ్రేషన్ ఉండటం ఈ ధరలో పెద్ద ప్లస్‌గా నిలుస్తుంది, ముఖ్యంగా ఆన్‌లైన్ క్లాసులు చదువుతున్న విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

యాంటీ గ్లేర్ కోటింగ్‌తో డిస్‌ప్లే

Advertisement

11.6 అంగుళాల హెచ్‌డి 1366×768 డిస్‌ప్లే యాంటీ గ్లేర్ కోటింగ్‌తో వస్తుంది. బయట సూర్యరశ్మి ఉన్నా, క్లాస్‌రూమ్‌లో లైట్స్ ఎదురుగా ఉన్నా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది, కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఎడ్యుకేషన్ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీతో తయారు చేయడంతో పిల్లలు జారవిడిచినా, బ్యాగ్‌లో గట్టిగా పెట్టినా డ్యూరబుల్‌గా ఉంటుంది. బరువు కేవలం 1.23 కేజీలు మాత్రమే ఉండటంతో పాటు స్లిమ్ డిజైన్ ఉండటంతో 10 నుంచి 15 సంవత్సరాల వయసు పిల్లలు కూడా ఈసిగా మోసుకెళ్లగలుగుతారు.

Also read: iPhone 14 offer: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు షాక్.. రిలయన్స్ డిజిటల్‌లో ఐఫోన్ 14 ధర చూస్తే పిచ్చెక్కిపోద్ది

528 ఆక్టా కోర్ ప్రాసెసర్‌

మీడియాటెక్ కొంపానియో 528 ఆక్టా కోర్ ప్రాసెసర్‌కు 4జిబి ఎల్‌పిడిడిఆర్4ఎక్స్ ర్యామ్ కలిసిన కాంబినేషన్ రోజువారీ వినియోగానికి చాలా స్మూత్ అనుభవాన్ని ఇస్తుంది. 20 నుంచి 25 ట్యాబ్స్ ఓపెన్ చేసి జూమ్ కాల్, గూగుల్ డాక్స్, యూట్యూబ్ ఒకేసారి రన్ చేసినా హ్యాంగ్ అవ్వని స్థిరమైన పనితీరు కనిపిస్తుంది. 64జిబి ఇఎంఎంసి స్టోరేజ్ ఉన్నప్పటికీ క్రోమ్‌బుక్ కావడంతో ఎక్కువ డేటా క్లౌడ్‌లోనే ఉంటుంది. గూగుల్ డ్రైవ్‌లో 100జిబి వరకు ఫ్రీ స్టోరేజ్ లభిస్తుంది. ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్ వంటి యాప్‌లు ఆఫ్‌లైన్‌లో కూడా సాఫీగా పనిచేస్తాయి. ప్లే స్టోర్‌లో లభించే ఆండ్రాయిడ్ గేమ్స్, ఫోటో ఎడిటింగ్ యాప్‌లు కూడా ల్యాగ్ లేకుండా స్మూత్ అనుభవాన్ని అందిస్తాయి.

7500mAh బ్యాటరీ

7500mAh బ్యాటరీతో ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రియల్ వరల్డ్ యూసేజ్‌లో 9–11 గంటల వరకు ఈసిగా నడుస్తుంది. ఉదయం 8 గంటలకు స్కూల్ లేదా కాలేజీకి తీసుకెళ్లినా సాయంత్రం 5–6 గంటల వరకు ఛార్జర్ అవసరం ఉండదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి కూడా ఒక్క ఛార్జ్‌తో పూర్తి రోజు వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. USB-C ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో 1 గంట ఛార్జ్ చేస్తే సుమారు 50–60శాతం వరకు బ్యాటరీ వస్తుంది. ఈ ధరలో ఇలాంటి ఫీచర్లు ఇవ్వడం బడ్జెట్ వినియోగదారులను టార్గెట్ చేసినట్టే కనిపిస్తోంది.

భారీ తగ్గింపు..ప్రస్తుత ధర వివరాలు

ఈ లెనోవో 100e క్రోమ్‌బుక్ జెన్ 4 అసలు ధర సుమారు రూ. 37,690, కానీ ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో ఇది కేవలం రూ. 10,999కి అందుబాటులో ఉంది, అంటే మొత్తం ధరలో సుమారు 70 శాతం తగ్గింపు లభిస్తోంది, ఇది సాధారణంగా అరుదుగా కనిపించే భారీ డిస్కౌంట్. అదనంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో చెల్లిస్తే మరో 10 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా పొందవచ్చు, అలాగే పాత ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్‌ను ఎక్స్‌చేంజ్ చేస్తే గరిష్టంగా రూ.10,500 వరకు మరింత తగ్గింపు కూడా పొందవచ్చు, అందుచే ఖరీదైన డివైస్‌ను బడ్జెట్ ధరలో పొందే అవకాశం పెరుగుతుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే ఉంది కనుక విద్యార్థులు, ఫ్రీలాన్సర్లు, హోమ్ యూజర్లు ఇలా సరసమైన ధరలో లైట్, ఫాస్ట్, లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉన్న క్రోమ్‌బుక్ కోసం చూస్తున్న వారు వీలైనంత త్వరగా ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేసి కొనుగోలు చేసుకోవాలి.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×