E-Paper
Advertisement

Emmanuel: చాలా బాధపెట్టాను.. దేవుడిచ్చిన వరం నువ్వు.. ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ పోస్ట్!

Emmanuel: చాలా బాధపెట్టాను.. దేవుడిచ్చిన వరం నువ్వు.. ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Emmanuel: ఇమ్మాన్యుయేల్ అంటే అందరికీ టక్కున జబర్దస్త్ కమెడియన్ గానే గుర్తుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్(Bigg Boss) కంటెస్టెంట్ గా ఈయన ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న ఇమ్మాన్యుయేల్ అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేశారు. అయితే ఇటీవల ఈటీవీకి దూరంగా ఉంటున్న ఇమ్మాన్యుయేల్ స్టార్ మా కార్యక్రమాలలో సందడి చేశారు. కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ 2 సందడి చేసిన ఇమ్మాన్యుయేల్ అనంతరం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఫినాలే వరకు కొనసాగి మంచి ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు.

ఏ కష్టం రానివ్వను..

ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో ఎవరికీ తెలియని కొన్ని విషయాలను ఇమ్మాన్యుయేల్ బయటపెట్టారు. తనని ఒక అమ్మాయి ప్రేమిస్తుందని, త్వరలోనే మా పెళ్లి అనే విషయాన్ని ఈయన వెల్లడించారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే తన ప్రేయసిని కూడా అందరికీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే కొత్త సంవత్సరం సందర్భంగా తన ప్రేయసితో కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేస్తూ ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా తన ప్రియురాలిని ముద్దుగా వేస్ట్ అమ్మ అని పిలుచుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు.

లవ్ యు సో మచ్ బుజ్జి ఫెలో..

Advertisement

ఈ సందర్భంగా ఇమ్మాన్యుయేల్ స్పందిస్తూ.. నా జీవితంలోకి వచ్చినందుకు నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు థాంక్యూ.. నిన్ను నేను చాలా బాధపెట్టాను. ఇక ఈ ఏడాది నుంచి మనిద్దరం మరింత స్ట్రాంగ్ గా ఉండి జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఇప్పటినుంచి నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని మాటిస్తున్నాను.. నేను అడగకుండానే దేవుడు నాకు ఇచ్చిన పెద్ద వరం నువ్వు .. నీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు ఎల్లప్పుడూ నాకు అండగా నిలబడి అపారమైన ప్రేమను పంచినందుకు థాంక్యూ సో మచ్ ఐ లవ్ యు సో మచ్ బుజ్జి ఫెలో.. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

ఇక ఇమ్మాన్యుయేల్ పోస్ట్ చూస్తే తన పేరు రుచి అని స్పష్టమవుతుంది . ఇక ఈ పోస్ట్ చేసిన ఇమ్ము వీరిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలో తన ప్రియురాలు ఫేస్ కనపడకుండా చేతులు అడ్డు పెట్టుకున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఇమ్మాన్యుయేల్ ఒక మాల్ లో తన లవర్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసినప్పటికీ అక్కడ కూడా తన ఫేస్ కనపడకుండా జాగ్రత్తపడ్డారు. తాజాగా మరోసారి తన ప్రియురాలితో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఈయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక తన పేరు రుచి అని తెలియడంతో ఆమె ఎలా ఉంటారు? ఏం చేస్తారనే? విషయాల పట్ల సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  Nayanthara:చిరు కోసం తన రూల్స్ పక్కన పెట్టేసిన నయన్.. కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి అంటూ..

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×