E-Paper
Advertisement

ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ రుజువు కాదు.. ఎందుకో చెప్పిన యూఐడీఏఐ?

ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ రుజువు కాదు.. ఎందుకో చెప్పిన యూఐడీఏఐ?
Advertisement

Aadhaar Not Date Of Birth: ఆధార్ కార్డు మీ ఐడెంటిటీని తెలియజేసే కార్డు మాత్రమే. అది డేట్ ఆఫ్ బర్త్ రుజువుగా పనిచేయదు. ఈ విషయాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) స్వయంగా స్పష్టం చేసింది. ఆధార్ గుర్తింపు రుజువుగా ఉపయోగపడుతుందని UIDAI సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది. అయితే, దీనిని పుట్టిన తేదీకి రుజువుగా పరిగణించమని పేర్కొంది. పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్‌ను అంగీకరించే విషయంపై 2016 ఆధార్ చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవని UIDAI పేర్కొంది. ఆధార్‌లోని పుట్టిన తేదీ కచ్చితత్వంపై వివాదం తలెత్తితే, అది రుజువు చేయవలసిన బాధ్యత ఆధార్ నెంబర్ హోల్డర్‌పై ఉంటుందని యూఐడీఏఐ డైరెక్టర్ సంజీవ్ యాదవ్ అన్నారు.

ఆధార్ లో పుట్టిన తేదీ నమోదు చేసే విషయంలో.. ఆధార్ వినియోగదారు ఏజెన్సీలు ఇ-కేవైసీ వినియోగదారు ఏజెన్సీలకు నిర్ణయాధికారం ఉంటుంది. పుట్టిన తేదీ రుజువు గురించి ఆధార్ చట్టంలో ఎలాంటి స్పష్టత లేకపోవడంతో.. పుట్టిన తేదీ రుజువుగా ఆధార్ ను పరిగణించలేమని పేర్కొంది.

ఆధార్‌ను పుట్టిన తేదీ రుజువుగా ఎందుకు పనిచేయదు?

  • ఆధార్ చట్టం, 2016 ప్రకారం.. ఐడెంటిటీ కోసం ఆధార్‌ను ఉపయోగించవచ్చని స్పష్టంగా పేర్కొంటుంది. కానీ పుట్టిన తేదీకి రుజువుగా వాడడంపై ఎలాంటి స్పష్టం ఇవ్వలేదు.
  • ​​ఆధార్ చట్టంలోని సెక్షన్ 4(3) ఆధార్‌ను గుర్తింపు రుజువుగా పేర్కొంటుంది. కానీ దానిని పుట్టిన తేదీ రుజువుగా ప్రస్తావించదు.
  • ఆధార్ లో పుట్టిన తేదీని స్వతంత్రంగా ధృవీకరించబడిన రికార్డుల ఆధారంగా కాకుండా, నివాసి అందించిన వివరాల మేరకు నమోదు చేస్తారు.
  • ఆధార్ నమోదు లేదా అప్ డేట్ సమయంలో జనన ధృవీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్‌లు లేదా పదో తరగతి సర్టిఫికెట్‌ వంటి పత్రాల ఆధారంగా, కార్డు హోల్డర్ చెప్పిన విధంగానే UIDAI పుట్టిన తేదీని నమోదు చేస్తుంది.
  • ఒక నివాసికి చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకపోతే, పుట్టిన తేదీని సుమారుగా లేదా ప్రకటించలేదు అని నమోదు చేస్తారు. ఈ సందర్భాలలో క్యాలెండర్ ఇయర్ ప్రకారం జనవరి 1వ తేదీని డిఫాల్ట్‌గా తీసుకుంటారు.
  • UIDAI పాత్ర గుర్తింపు సంఖ్యలను జారీ చేయడం, గుర్తింపు రుజువును అందించడానికి మాత్రమే పరిమితం. యూఐడీఏఐ ప్రాథమిక జనన రిజిస్ట్రీగా పనిచేయదు.
Advertisement

Also Read: ఆధార్ కార్డు మిస్సయిందా? నంబర్ తెలియకపోయినా, మొబైల్ లింక్ లేకున్నా, ఇలా రికవర్ చేసుకోవచ్చు!

ఆధార్ కార్డు ఉపయోగాలు

ఆధార్ నమోదు సమయంలో బయోమెట్రిక్స్, ఇతర పత్రాలను నమోదు చేస్తారు. దీంతో ఆధార్ నెంబర్.. ఆ వ్యక్తి రుజువును నిర్థారిస్తుందని అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ తెలిపారు.

  • సబ్సిడీ లేదా సేవ కోరుతున్న వ్యక్తి, ఆధార్‌ నమోదు చేసుకున్న వ్యక్తి ఇద్దరూ ఒక్కటే అని ధృవీకరించడమే ఆధార్ ముఖ్య ఉద్దేశం అని సుప్రీం కోర్టు నిర్ధారించింది.
  • సంక్షేమ పథకాలు అందించడానికి లేదా ఇతర ప్రయోజనాల కోసం ఆధార్‌ను ఎంత వరకూ ఉపయోగించాలనేది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నిర్ణయాధికారంపై ఆధారపడి ఉంటుంది.
  • ఆధార్ గుర్తింపు లేదా చిరునామా రుజువుగా ఉపయోగించవచ్చు. కానీ పుట్టిన తేదీ రుజువుగా కాదు.

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×