E-Paper
Advertisement

Vijay Signs First Order: తమిళనాడు సీఎం విజయ్.. ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం దానిపైనే

Vijay Signs First Order: తమిళనాడు సీఎం విజయ్.. ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం దానిపైనే
Advertisement

Vijay Signs First Order: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా సెక్రటేరియేట్‌కు వెళ్లారు. అక్కడ ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై ఆయన తొలి సంతకం చేశారు. ఎన్నికల సమయంలో తాను హామీ ఇచ్చిన విధంగా వివిధ ఫైళ్లపై సంతకాలు చేశారు.

తమిళనాడు సీఎం విజయ్ తొలి సంతకం ఉచిత విద్యుత్

Advertisement

తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది. ఆ రాష్ట్ర చరిత్రలో దాదాపు 60 ఏళ్ల తర్వాత తొలిసారి డీఎంకె, అన్నాడీఎంకే పార్టీ యేతర ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఆదివారం కొలువుదీరింది. ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే నేరుగా సెక్రటేరియేట్‌కు మంత్రులతో వెళ్లారు.

నేరుగా తన ఆఫీసులో మంత్రులతో అడుగుపెట్టారు విజయ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మాదిరిగా తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారు ఆయన. ఆ తర్వాత మహిళా భద్రతపై, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వంటి హామీలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు.

Advertisement

ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు

సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయంతో తమిళనాడులోని పేద-మధ్యతరగతి కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. తమ పాలనలో సామాన్యుల సంక్షేమమే ముఖ్యమన్నారు. మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌, వాటికి సంబంధించిన నేరాలను ఎదుర్కోవడానికి ప్రత్యేక మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు విజయ్ ప్రభుత్వం ప్రకటించింది.

వీటి బారిన పడిన వారిని రక్షించి, పునరావాసం కల్పించి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి మేము కృషి చేస్తామన్నారు. మహిళల భద్రతను బలోపేతం చేయడం, మహిళలపై నేరాలను పరిష్కరించడం లక్ష్యంగా ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు ఫైలుపై సంతకం చేశారు.

ALSO READ: స్క్రిప్ట్ అదిరిపోయింది.. అవమానించిన చోటే పట్టాభిషేకం.. నెహ్రూ స్టేడియంలో విజయ్ సరికొత్త చరిత్ర

తమిళనాడు దాదాపు రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని సీఎం విజయ్ తన ప్రసంగంలో హైలైట్ చేశారు. పారదర్శక పాలన కోసం తమ ప్రభుత్వం ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తుందన్నారు. తమిళనాడు ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేస్తుందన్నారు.

 

 

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×