BigTV English
Advertisement

OTT Movie : తండ్రి పై ప్రేమతో తల్లినే చంపాలనుకునే కూతురు… గూస్ బంప్స్ తెప్పించే హారర్ థ్రిల్లర్

OTT Movie : తండ్రి పై ప్రేమతో తల్లినే చంపాలనుకునే కూతురు… గూస్ బంప్స్ తెప్పించే హారర్ థ్రిల్లర్

OTT Movie : ఇప్పుడు కొత్త కొత్త కథలతో వస్తున్న హారర్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. గత ఏడాది బాలీవుడ్ లో వచ్చిన ముంజ్యా, స్త్రీ సినిమాలు రికార్డులు క్రియేట్ చేశాయి. అవికా గోర్ ప్రధాన పాత్రలో నటించిన, అటువంటి మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ (Disney +hotstar) లో

ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ (1920 Horrors of the heart). 2023లో విడుదలైన ఈ మూవీని విక్రమ్ భట్ ప్రొడక్షన్, హౌస్‌ఫుల్ మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై విక్రమ్ భట్, డాక్టర్ రాజ్ కిషోర్ ఖవారే, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్ నిర్మించారు. ఈ సినిమాకు కృష్ణ భట్ దర్శకత్వం వహించాడు. అవికా గోర్, రాహుల్ దేవ్, బర్ఖా బిష్ట్, అమిత్ బెల్, అవతార్ గిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను 2023లో జూన్ 23న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేశారు. ఈ మూవీ ఆగస్టు 20 నుండి డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ (Disney +hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

మేఘన, అర్జున్ ఇద్దరూ ఒకరిని ఒకరు ప్రాణంగా ప్రేమించుకుంటూ ఉంటారు. మేఘన పుట్టినరోజు కావడంతో ఈ విషయం తండ్రికి చెప్పాలనుకుంటుంది. పుట్టినరోజు కానుకగా తన ప్రేమను తండ్రి ఒప్పుకుంటాడని సంతోషంతో ఇంటికి వెళుతుంది. ఇంట్లో తన తండ్రి ఉన్న పరిస్థితిని చూసి షాక్ అవుతుంది. మేఘన తండ్రి ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయి ఉంటాడు. ఆ పరిస్థితుల్లో తన తండ్రిని చూసి దుఃఖంలో మునిగిపోతుంది. పోస్టుమార్టం రిపోర్టులో తన తండ్రికి హార్ట్ లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు డాక్టర్లు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన మేఘన తన తండ్రి రాసిన డైరీని చదువుతూ ఉంటుంది. అందులో మేఘన తల్లి రాధిక చనిపోలేదని, నేను ఒకవేళ చనిపోతే దానికి కారణం నీ తల్లి అని రాసి ఉంటుంది. చిన్నప్పుడే నన్ను ఒకసారి చంపడానికి ప్రయత్నించిందని, ఆ తర్వాత నన్ను, నిన్ను వదిలి మరొక డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని చెప్తాడు. ఆ తర్వాత తండ్రి చనిపోయిన సమాధి దగ్గరికి వచ్చి మేఘన ఏడుస్తూ ఉంటుంది. ఈ విషయం తనకు ముందే చెప్పాల్సిందని ఏడుస్తూ ఉంటుంది.

ఆమె దగ్గరికి చనిపోయిన తండ్రి ఆత్మ వస్తుంది. తండ్రి ఆత్మతో ఈ స్థితికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టనని ప్రమాణం చేస్తుంది మేఘన. ఈ క్రమంలోనే ఆమె తన తల్లి ఇంటికి వెళుతుంది. అయితే తల్లి, కూతుర్ని కలవడానికి ఇష్టపడదు. ఆ ఇంట్లో ఉండటానికి మాత్రం అవకాశం దొరుకుతుంది. ఆ తర్వాత ఆమె బాయ్ ఫ్రెండ్ కి ఈ విషయం తెలుస్తుంది. నువ్వు ఇక్కడ ప్రమాదంలో పడటానికి వీలు లేదని, ఇక్కడి నుంచి తొందరగా బయటికి రావాల్సిందిగా ఆమెను కోరతాడు. 24 గంటల సమయం ఇచ్చి రాకపోతే ఈ విషయం అందరికీ చెప్తానని అంటాడు. చివరికి తండ్రి చావుకు కారణమైన తల్లిపై మేఘన పగ తీర్చుకుంటుందా? తండ్రి ఆత్మ మేఘనకి సహాయం చేస్తుందా? మేఘన, అర్జున్ ల ప్రేమ చివరికి ఏమవుతుంది. ఈ విషయాలు తెలుసుకోవాలంటే ‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ (1920 Horrors of the heart) అనే  ఈ మూవీని చూడాల్సిందే.

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×