Intinti Ramayanam Today Episode February 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి శ్రీకర్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కొట్టేయాలని డాక్యుమెంట్స్ కోసం వెతకడం శ్రీకర్ చూస్తాడు. ఇక కనకం అవన్నీ ఇన్ డైరెక్ట్ గా ఇంట్లోంచి వెళ్ళమని చెప్తుంది. ఇక శీనుకు కనకం ఫోన్ చేస్తే అది పల్లవి వింటుంది అమ్మగారు అంటున్నారు అంటే కచ్చితంగా అవని ఉంటుంది అని అనుకుంటుంది శ్రీను అని అడిగితే శ్రీను చెప్పాడు దాంతో మాస్టర్ ప్లాన్ వేస్తుంది. నీ భార్యకు పండక్కి చీర కొన్నాను ఇవ్వలేకపోయాను ఈ చీర ఇవ్వు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. పల్లవి శీను ని ఫాలో అవుతుంది. శీను ఇంటికి వెళ్లిన పల్లవి అవని ఎక్కడా అని అడుగుతుంది ఇద్దరినీ చంప పగలగొడుతుంది కానీ అవని వెళ్లిపోయిందని కనుక చెప్తుంది. అవని వెళ్లిపోయిందా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీను కనకం కావాలని ఇంట్లో నుంచి పంపించింది అని షాక్ అవుతాడు. అవని బయటకు వెళ్లడంతో బాధ పడతాడు. అవని రోడ్డు పై యాక్సిడెంట్ అవ్వడం చూసి ఆమెను ఇంటికి తీసుకొని వెళ్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. స్వరాజ్యం ఇంట్లో కి దయాకర్ వస్తారు. యాక్సిడెంట్ అయితే ఈ అమ్మాయి తీసుకొచ్చి వదిలిపెట్టిందండి అనేసి అనగానే ఈ అమ్మాయి నాకు ఎందుకు తెలియదు రాజేంద్రప్రసాద్ కోడలు కదా అనేసి అంటాడు.. ఆయనకు అసలు విషయాన్ని చెప్తాడు దయాకర్.. ఆ తర్వాత అక్షయ్ ద్వారా బందువులం అని దయాకర్ నిజం చెప్తాడు. మేము నీకు బంధువులం అవుతాము.. నువ్వేం బాధపడకు భయపడకు అనేసి దయాకర్ అంటారు. పరాయి వల్ల మేం కాదమ్మా అని దయాకర్ అక్షయ్ కు మేనమామ అని నిజం చెప్తాడు. అయితే నేను ఇక్కడ ఉండడం పెద్ద సమస్య అండి మా ఇంట్లో వాళ్లకి తెలీదు నేను ఒక చిన్న సమస్యలో ఉన్నాను అనేసి అవని అంటుంది మీ ప్రవర్తన చూసి నువ్వు సమస్యలో ఉన్నావా అని అర్థమైంది కార్పోరేటర్ గా నీ సమస్య ఏంటో తీరుస్తాను అనేసి స్వరాజ్యం అంటుంది. ఏం లేదండి మా ఇంట్లో వాళ్లకు తెలియకుండా నేను బయటున్నాను అనేసి అవని అంటుంది మీ సమస్య ఏదో కానీ ఆ సమస్య పూర్తయ్యేంత వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు అనేసి స్వరాజ్యం అంటుంది. ఇక దయాకర్ కూడా నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు అమ్మ అనేసి అంటాడు.
అవని ఎన్నిసార్లు చెప్పినా కూడా దయాకర్, స్వరాజ్యం ఇద్దరు ఒప్పుకోరు. మా ఇంట్లోనే ఉండాలని అంటారు.. ఇక అవని తప్పని పరిస్థితులలో అక్కడే ఉండటానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత అవనిని వాళ్ళు సొంత కూతురు లాగా చూసుకుంటారు. వాళ్ళ పరిస్థితిని చూసి ఎలాగైనా ఆదుకోవాలి అని అనుకుంటుంది అవని.. ఏదైనా జాబ్ చెయ్యాలని అనుకుంటుంది. జాబ్ కోసం కంపెనిలు తిరుగుతుంది.. కానీ ఎక్కడ కూడా జాబ్ దొరకదు. నిరాశ పడుతుంది. కానీ మళ్లీ ప్రయత్నించాలని అనుకుంటుంది. ఇక అలసిపోయి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది. కానీ అక్కడకు కొందరు రౌడీలు వచ్చి మిస్ బిహేవ్ చేస్తారు. కానీ అవని మాత్రం వారికి చెంప దెబ్బతో బుద్ధి చెప్తుంది. అప్పుడే అక్కడకు అక్షయ్ వస్తాడు. రౌడీ లను చితక్కోడుతాడు.. ఇక అవనిని రమ్మని చెబుతాడు. దానికి అవని మాత్రం ఎక్కడకు రావాలి.. మి ఇంటికా అని అడుగుతుంది. అక్షయ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత శ్రీకర్ మాత్రం పల్లవి ప్లాన్స్ ను తప్పేలా చెయ్యాలని అనుకుంటాడు. ఇక కమల్ మాత్రం వదినను ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని ప్లాన్ చేస్తాడు.. అక్షయ్ మాత్రం అవని కోసం బాధ పడుతాడు.. అక్కడి తో ప్రోమో ఎండ్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.. సోమవారం ఎపిసోడ్ లో అవని ఇంటికి వెళుతుందేమో చూడాలి..