Visakhapatnam Railway Zone: విశాఖ రైల్వేజోన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ రైల్వే జోన్ పరిధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు మోడీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వాల్తేర్ డివిజన్ ను విశాఖ డివిజన్ గా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్త రాయగఢ రైల్వే డివిజన్ ను ఏర్పాటు చేసి, దాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకురాన్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
రైల్వేమంత్రి ఏమన్నారంటే?
విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించి కొత్త పరిధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఆంధ్రా ప్రజలు కోరుకున్నట్లుగానే వాల్తేర్ డివిజన్ ను కొత్త రైల్వే జోన్ లోనే కొనసాగిస్తున్నట్టు తెలిపారు. వాల్తేర్ డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్ గా మారుస్తున్నట్టు వెల్లడించారు. ఏపీ పునర్వ్యవస్తీకరణ చట్టానికి లోబడి కొత్త రైల్వే జోన్ ను ఏర్పాటు చేశామని ప్రకటించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో కొత్తగా రాయగఢ పేరిట ఓ డివిజన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ డివిజన్ ను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో కలుపుతున్నట్లు తెలిపారు. అయితే, అరకు స్టేషన్ ఏ డివిజన్ లో ఉంది? అనే విషయంలో క్లారిటీ లేదు. ఒకవేళ అరకును రాయగఢ డివిజన్ లో కలిపితే ఏపీ ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఏపీలో ప్రధాన పర్యాటక రంగంగా ఉన్న అరకును రాయగఢలో కలపకూడదంటున్నారు ప్రజలు.
ప్రజల ఆందోళనతో మార్పులు చేర్పులు
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాల్లో ఏదో ఒక చిక్కు ఉంటుంది. అవగాహన లేక ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా? కావాలనే ఇలా చేస్తుందా? అనేది అర్థం కావట్లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆయా ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కరంగా, మనోభావాలను దెబ్బతీసేలా ఉంటున్నాయి. రీసెంట్ గా ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను అనౌన్స్ చేసింది. కొత్త జోన్ పరిధిపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రజల్లో ఆందోళన వ్యక్తం అయ్యింది. అయితే… ఏపీ ప్రభుత్వం నుంచి కూడా వ్యతిరేకత రావంతో కేంద్రం మార్పులు చేర్పులు చేసి నూతన పరిధిని ప్రకటించింది. వాల్తేర్ డివిజన్ ను విశాఖ డివిజన్ గా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకున్నది.
విశాఖ రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే స్టేషన్లు!
⦿ పలాస -విశాఖపట్నం- దువ్వాడ
⦿ కూనేరు – విజయనగరం
⦿ నౌపాడ జంక్షన్ – పర్లాకిమిడి
⦿ బొబ్బిలి జంక్షన్ – సాలూరు
⦿ సింహాచలం నార్త్ – దువ్వాడ బైపాస్
⦿ వడ్లపూడి- దువ్వాడ
⦿ విశాఖ స్టీల్ ప్లాంట్ -జగ్గాయపాలెం
అటు వాల్తేర్ డివిజన్ లోని కొత్తవలస – బచేలి, కూనేరు -తెరువలి జంక్షన్, సింగాపుర రోడ్ – కోరాపుట్ జంక్షన్, పర్లాకిమిడి -గుణుపూర్ స్టేషన్ల పరిధిలో రాయగఢ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Read Also: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. ఈ మార్గంలో 30 రైళ్లు క్యాన్సిల్, కారణం ఏంటంటే?