E-Paper
Advertisement

Weapons on OTT : ఇండియన్ ఓటీటీలోకి 2000 కోట్ల హాలీవుడ్ హారర్-థ్రిల్లర్… కల్లోనూ వెంటాడే కథ

Weapons on OTT : ఇండియన్ ఓటీటీలోకి 2000 కోట్ల హాలీవుడ్ హారర్-థ్రిల్లర్… కల్లోనూ వెంటాడే కథ
Advertisement

Weapons on OTT : హారర్ సినిమాలకు ఉండే క్రేజే సెపరేటు. కాస్త భయపెడితే చాలు ఇలాంటి సినిమాలకు వెంటనే ఫిదా అయిపోతారు ఆడియన్స్. అంతేకాదు ఇలాంటి సినిమాలు ఏ భాషలో వచ్చినా సరే వదిలి పెట్టకుండా చూస్తారు. థియేటర్లలోనే ఇలా ఉంటే ఓటీటీలో వదులుతారా ? అలాంటి క్రేజీ హర్రర్ మూవీ లవర్స్ కోసమే 2025లో ప్రపంచాన్ని వణికించిన భయంకరమైన మూవీ ఒకటి ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆ మూవీ ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న డిఫరెంట్‌ హాలీవుడ్‌ హారర్‌ థ్రిల్లర్‌ పేరు ‘వెపన్స్‌’ (Weapons). జాక్ క్రెగర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో జోష్ బ్రోలిన్, ఆస్టిన్ అబ్రామ్స్, జూలియా గార్నర్, కేరీ క్రిస్టోఫర్, టోబీ హస్, అమీ మాడిగన్, ఆల్డెన్ ఎహ్రెన్‌రిచ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గత ఏడాది ఆగస్ట్‌ 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ మూవీ భారీ కలెక్షన్ల బాక్స్ ఆఫీసు మోత మోగించింది. 335 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో రూ. 2 వేల కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. గత సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన రెండవ హర్రర్ చిత్రంగా నిలిచింది. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన ‘సిన్నర్స్’ మూవీ మొదటి స్థానంలో ఉంది.

Advertisement

ఇదిలా ఉండగా మూవీ థియేట్రికల్ రన్ తరువాత అంటే సెప్టెంబర్‌ 9 నుంచి నాలుగు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కి అందుబాటులోకి వచ్చింది ఈ మూవీ. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు ఆపిల్ టీవీ ప్లస్, వుడు, గూగుల్ ప్లేలలో ఈ మూవీ అవైలబుల్ గా ఉంది. అయితే ట్విస్ట్ ఏంటంటే థియేటర్లలో చూడటం వీలు కాని వాళ్ళు చూడడానికే అంత తొందరగా ఓటీటీలోకి తీసుకొచ్చారు. కాబట్టి రెంట్ బేసిస్ లో మూవీని ఇన్నాళ్ళూ ఓటీటీలో ఉంచారు. ఈ హారర్-థ్రిల్లర్ 2026 జనవరి 8 నుండి భారతదేశంలో జియో హాట్‌స్టార్ (JioHotstar)లో ప్రసారం కానుంది. ఇన్ని రోజులు అద్దెకు అందుబాటులో ఉన్న ఈ మూవీ ఎట్టకేలకు ఫ్రీగా స్ట్రీమింగ్ కానుందన్న మాట.

Read Also :  3 రూపాయల కోసం మతిపోగొట్టే పనులు… మనసుకు హత్తుకునే అచ్చ తెలుగు విలేజ్ డ్రామా

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

‘మేబ్రూక్’ అనే ఒక చిన్న పట్టణం చుట్టూ తిరుగుతుంది ఈ మూవీ స్టోరీ. బుధవారం రోజు రాత్రి 2. 17 గంటలకు ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుంటుంది. అర్దరాత్రి ఆకస్మాత్తుగా ఆ సిటీలోని 17 మంది పిల్లలు నిద్రలో నుంచి లేచి ఎక్కడికో వెళ్లిపోతారు. ఇలా తమ పిల్లలు రాత్రికి రాత్రి ఎలా అదృశ్యం అయ్యారో తెలియక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటారు. అసలు ఆ పిల్లలు ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్లారు? ఆ పిల్లల్ని ఎత్తుకెళ్లిన అదృశ్య శక్తి ఏంటి ? పేరెంట్స్ తమ పిల్లలను ఎలా వెనక్కి తెచ్చుకున్నారు ? స్కూల్ టీచర్ కు దీనివల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటి ? అనే విషయాలు తెలుసుకోవాలంటే మూవీని చూడాల్సిందే. ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టే ఈ మిస్టరీ థ్రిల్లర్ ను అస్సలు మిస్ అవ్వొచ్చు.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×