E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు షాకిచ్చిన ధీరజ్.. అమూల్య షాకిచ్చిన రామరాజు.. శ్రీవల్లి, భాగ్యం షాక్..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు షాకిచ్చిన ధీరజ్.. అమూల్య షాకిచ్చిన రామరాజు.. శ్రీవల్లి, భాగ్యం షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. కామాక్షిని అక్కడ కూర్చొన్న పెళ్ళికొడుకు ఈ అమ్మాయిని పెళ్లికూతురని అనుకుంటాడు.. వేదవతి మాత్రం ఈ అబ్బాయి చూపే మన వంకర ఏంటి పెళ్లికూతురు ఇక్కడ ఉంటే అటు చూస్తున్నాడేంటి అని అనుకుంటుంది.. ఇక కామాక్షి వెళ్లి కూల్డ్రింక్స్ తీసుకురమ్మని వేదవతి చెప్తుంది.. ఆ కూల్ డ్రింక్స్ తీసుకురాగానే అమూల్యని వేదవతి ఆ కూల్ డ్రింక్స్ ఇవ్వమని చెప్తుంది. కానీ పెళ్ళికొడుకు వద్దు ఆ అమ్మాయి కాదు ఈ అమ్మాయి ఇవ్వాలి అని అంటాడు. పెళ్లికూతురు అమ్మాయి..

అయితే ఈ అమ్మాయి ఎలా ఇస్తుంది అని వీళ్ళు అనుకుంటారు.. రాబోయే భార్య చేత తీసుకోవడంలో తప్పులేదు కదా అని అతను అంటాడు. ఏం మాట్లాడుతున్నావు కాబోయే భార్య ఏంటి..? అరె దొంగ సచ్చినోడా నాకు ఆల్రెడీ పెళ్లయిందిరా..? ఎల్కేజీ చదివే కూతురు కూడా ఉంది రా నీ కామాక్షి అంటుంది..పెళ్లికూతురు ఈమె కదా ఆమెనా అని పెళ్ళికొడుకు షాక్ అవుతాడు. పెళ్లికూతురు ఈ అమ్మాయి అని అందరూ అనగానే అతను షాక్ అవుతాడు. ఏదో పొరపాటు పడ్డాడు కదండీ.  ఈ అమ్మాయి మాకు బాగా నచ్చింది అన్నా కూడా రామరాజు కుటుంబంలోని వాళ్ళు ఎవరూ కూడా ఆ పెళ్ళికొడుకు ప్రవర్తన బాగోలేదని క్యాన్సల్ చేస్తారు. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రేమ మాత్రం ధీరజ్ని ఒక ఆట ఆడుకుంటుంది.. వీడు నాతో బాగా బెట్టు చేస్తున్నాడు నాతో మాట్లాడాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తుంది ప్రేమ. వాడి వస్తువులన్నీ తెచ్చి నా దగ్గర పెడుకుంటాను అప్పుడు కచ్చితంగా వాడు చచ్చినట్టు నాతో మాట్లాడతాడని ప్రేమ ప్లాన్ చేస్తుంది.. అటు అమూల్య విశ్వంతో మాట్లాడుతూ ఉంటుంది.. అయితే ఆ పెళ్లి సంబంధం చెడిపోవడానికి నేనే కారణం అని చెప్తాడు. ప్రేమ మాత్రం ధీరజ్ వెతుక్కుంటూ ఉంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. వేదవతి నా బిడ్డను ఏడిపిస్తున్నారా అని అంటుంది. అది ఏడిపించడం ఏంటి భార్యాభర్తల మధ్య ఉన్న రొమాన్స్ కదా అని నర్మదా అంటుంది. మీ ముసలి వాళ్లకి అర్థం కాదులే అని నర్మదా అనడంతో వేదవతి ఫీల్ అవుతుంది.. ప్రేమ దగ్గర తన వస్తువులు ఉన్నాయని తెలుసుకున్న ధీరజ్ ఎలాగైనా సరే వాటిని కొట్టేయాలని అనుకుంటాడు…

ప్రేమ, ధీరజ్ ఎలాగైనా సరే తనతో మాట్లాడేలా చేసుకోవాలని అనుకుంటుంది. అయితే ధీరజ్ మాత్రం ప్రేమ తన వస్తువులను తన దగ్గర పెట్టుకుని అనుకుంటాడు.. ప్రేమ ఇలా కావాలనే చేస్తుందనుకున్న ధీరజ్ లోపలికి వెళ్లి వేరే చోటు వేసుకొని వస్తాడు.. వాచ్ కార్ కి కూడా తన దగ్గరే ఉండడంతో వాటిని కూడా వెతుకుతాడు.. కానీ ధీరజ్ వాచ్ లేకపోతే ఫోన్ లో టైం లేదా అంటాడు. కారుకి ఎక్కడో మిస్సయింది సార్ నాకు ఒక డూప్లికేట్ కి కావాలి అని అడుగుతాడు. కానీ డూప్లికేట్ కి పంపిస్తానని ఓనర్ చెప్పడంతో ప్రేమా షాక్ అవుతుంది. వీడు నన్ను చీట్ చేస్తున్నాడు అని అనుకుంటుంది.. ఆ తర్వాత ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Advertisement

ఇక వేదవతి రామరాజు ఇద్దరు కూడా తన ఫ్రెండ్ ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తారు. ఇక్కడికి వెళ్ళగానే వాళ్ళని చూసి వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతారు.. తర్వాత పెళ్లి సంబంధం గురించి మాట్లాడతారు.. అయితే పెళ్లి సంబంధం మొదట్లో మేము వద్దనుకున్నాము కానీ ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి చేయాలని చూస్తున్నాము మీరు అడిగారు కదా అని మీ దగ్గరకు ఒక మాట అడుగుతామని వచ్చామని రామరాజు అంటాడు. మొదట ఏమి అనని ఆమె ఆ తర్వాత ఒప్పుకుంటుంది. అమూల్యకు పెళ్లి సంబంధం ఫిక్స్ అయిందని రామరాజు వేదవతి చాలా సంతోషంగా ఉంటారు. ఇక తర్వాత ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాలని అనుకుంటారు..

శ్రీవల్లి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్లారంట ఏం జరుగుతుందో ఏం పాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఆ పెళ్లి సంబంధం వాళ్ళు ఏమంటారు నాకు ఈ విషయం గడి పొడి ఎక్కువైపోయింది అని శ్రీవల్లి కంగారు పడిపోతూ బయట అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ రామరాజు వేదవతి రావడం చూస్తున్న శ్రీవల్లి వాళ్ల మొహాలు చూస్తుంటే ఈ సంబంధం ఓకే అయినట్టు లేదు అని అనుకుంటుంది.. రామరాజు ఇంట్లోకి రాగానే ఎమోషనల్ అవుతాడు. ఏంటి నాన్న కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఏమైంది అని చందు అడుగుతాడు.. ఇది కన్నీళ్లు కదరా ఆనందభాష్పాలు అని రామరాజు అంటాడు..

Also Read: అక్షయ్ కీలక నిర్ణయం.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. శ్రీయకు అబార్షన్..?

అమూల్యకు ఒక గొప్ప సంబంధం ఓకే అయింది అని అంటాడు. మాట వినగానే అమూల్య షాక్ అవుతుంది.. ఓరి నాయనో ఇంత బాంబు పేల్చారు ఏంట్రా అని షాక్ అవుతుంది.. అబ్బాయి చాలా అందంగా ఉంటాడని వేదవతి అనగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు అని అడుగుతారు. మార్కెట్ కార్పొరేటర్ అయిన నీరజ కొడుకు అని అనగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా అమూల్యకు చాలా మంచి సంబంధం ఫిక్స్ అయింది అని సంతోషంగా ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Big Stories

Advertisement
×