E-Paper
Advertisement

Sci fi Movie OTT : ఆకాశం నుంచి దిగివచ్చే మనుషులు… ప్రపంచం అల్లకల్లోలం… గ్రిప్పింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

Sci fi Movie OTT : ఆకాశం నుంచి దిగివచ్చే మనుషులు… ప్రపంచం అల్లకల్లోలం… గ్రిప్పింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్
Advertisement

Sci fi Movie OTT : ఏలియన్ అటాక్ తో రకరకాల సినిమాలు వస్తున్నాయి. వాటిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా బాగా పాపులర్ అయింది. ఈ సినిమాలో ఉన్నట్టుండి ప్రపంచం మొత్తం చీకటిమయం అవుతుంది. మనుషులు కూడా దాదాపు అంతం అవుతారు. చాలా ఇంటెన్సివ్ గా, యాక్షన్ సీన్స్ తో ఈ మూవీ ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ స్టోరీలు ఇష్టపడేవాళ్ళకు ఇది వర్త్ వాచ్ మూవీ. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2019లో వచ్చిన ఈ రష్యన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘బ్లాక్‌అవుట్’ (Blackout). ఎగోర్ బరనోవ్ దర్శకత్వం ఇది తెరకెక్కింది. ప్రధాన పాత్రల్లో ప్యోటర్ ఫ్యోడోరోవ్ (ఓలెగ్), స్వెట్లానా ఇవనోవా (లిలియా), లుక్యాన్ మాట్వీవ్ (కోస్ట్యా) నటించారు. ఈ సినిమా రష్యన్ సై-ఫై జానర్‌లో బాగా పాపులర్ అయింది. ఐయండిబిలో 6.0/10 రేటింగ్ తో ప్రస్తుతం ప్రైమ్ వీడియో (prime video)లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : 25 ఏళ్లుగా క్రైమ్ అంటే ఏంటో తెలియని గ్రామం… బైక్‌ మిససవ్వడంతో గడబిడ… కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్

స్టోరీ ఏమిటంటే

భూమి మీద ఒక భారీ బ్లాక్‌ అవుట్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ, కమ్యూనికేషన్స్, లైట్స్ అన్నీ ఆఫ్ అవుతాయి. చాలా మంది మనుషులు సడన్‌గా అదృశ్యమవుతారు. కొందరు మాత్రమే బతికి ఉంటారు. తూర్పు ఐరోపాలోని ఒక చిన్న సర్కిల్ లో మాత్రం విద్యుత్ ఉంటుంది. సర్కిల్ వెలుపల ఉన్న ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో, సైన్యం ఆ ప్రాంతాలకు వెళ్లి పరిశీలిస్తుంది. అక్కడ ఉన్న మనుషులందరూ ఎటువంటి గాయాలు లేకుండానే వింతగా చనిపోయి ఉంటారు. దీనికి కారణం గాలిలో ఉండే ఒక రకమైన రేడియేషన్ అని అనుమానిస్తారు. ఇది ఏలియన్ అటాక్ గా తెలుసుకుంటారు. అసలు నిజం ఏమిటంటే మనుషులను కూడా ఒకప్పుడు ఆ గ్రహాంతరవాసులు సృష్టించిన జీవులేనని, భూమిని ఒక ల్యాబ్ లాగా వాడుకున్నారని తెలుస్తుంది. చివరగా ఒక ఏలియన్ షిప్‌ భూమి మీదకి రావడానికి సిద్ధమవుతుంది. మరి ఆ ఏలియన్ షిప్‌ భూమి మీదకి వస్తుందా ? భూమిని ఏలియన్స్ ఆక్రమించుకుంటాయా ? అనే విషయాలను మాత్రం ఈ రష్యన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×