E-Paper
Advertisement

జీవితాన్ని మార్చేసే ఒకే ఒక్క ఫోన్ కాల్… ఇంటెన్స్ సస్పెన్స్‌ థ్రిల్లర్

జీవితాన్ని మార్చేసే ఒకే ఒక్క ఫోన్ కాల్… ఇంటెన్స్ సస్పెన్స్‌ థ్రిల్లర్
Advertisement

Aamir movie : రాజీవ్ ఖండేల్వాల్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరు. కానీ హిందీ టెలివిజన్ రంగంలో ‘చాక్లెట్ బాయ్’గా, అమ్మాయిల మనసు దోచుకునే హీరోగా పేరుగాంచిన సూపర్ స్టార్ అతను. 2000వ దశాబ్దం ప్రారంభంలో టీవీలోకి వచ్చి ‘సుజల్’ పాత్రతో ఇంటింటా సుపరిచితులయ్యారు ఆయన. కానీ 2007లో ఆయన తన కెరీర్‌కు కొత్త మలుపు ఇచ్చారు. టీవీని వదిలి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. అలా ఆయన హీరోగా వచ్చిన మొదటి సినిమా ‘ఆమిర్’. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పటికీ అందరి వాచ్‌ లిస్ట్‌లో ఉంటుంది.

సినిమా కథ ఏమిటి ?

ఈ చిత్రం కేవలం 1 గంట 39 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కానీ చూసినంత సేపు మనసును కదిలిస్తుంది. డాక్టర్ ఆమిర్ అలీ లండన్ నుంచి ముంబైకి తిరిగి వస్తాడు. అతని కుటుంబం మధ్యతరగతి జీవితం గడుపుతుంటుంది. తండ్రి మరణం తర్వాత అంత్యక్రియల కోసం వెళ్లి, చదువు పూర్తి చేసి వైద్యుడిగా తిరిగి వస్తాడు. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారి అతన్ని బాగా వేధిస్తాడు. బయటకు వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు అతనికి ఒక ఫోన్ ఇస్తారు. ఆ ఫోన్ ఎత్తగానే అతని జీవితం పూర్తిగా మారిపోతుంది.

Advertisement

అతన్ని ఉగ్రవాద కార్యకలాపాల్లోకి లాగి బలవంతంగా పని చేయమని, కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తారు. ఆమిర్ బయటకు వచ్చి ఒక ఎర్ర సూట్‌కేస్ తీసుకుని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణించాల్సి వస్తుంది. కానీ ఆ సూట్‌కేస్ ను ఎవరో దొంగిలిస్తారు. ఇక్కడి నుంచి ఆమిర్ ఎలా తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు ? ఆ సూట్‌కేస్‌ను ఎలా వెనక్కి తెస్తాడు? ఆ సూట్ కేస్ లో ఏముంది ? అన్నది ఈ సినిమా కథ. ఒక్కొక్క సన్నివేశం నరాలు తెగే ఉత్కంఠతో నిండి ఉంటుంది.

ఎందుకు చూడాలి ?

ఈ సినిమా చాలా సింపుల్‌గా కనిపించినా… కథలోని ట్విస్టులు, సస్పెన్స్ అదిరిపోయేలా ఉంటాయి. రాజీవ్ ఖండేల్వాల్ తన నటనతో ఆమిర్ పాత్రకు జీవం పోశారు. ఆయన ముఖంపై కనిపించే భయం, ఆందోళన, ధైర్యం అన్నీ స్ట్రెయిట్ గా ఆడియన్స్ గుండెకు గుచ్చుకుంటాయి. బాలీవుడ్‌ లో రాజీవ్ మొదటి సినిమా ఇదే కాబట్టి ఆయన ఫ్యాన్స్‌ కు స్పెషల్. ఇప్పటికీ థ్రిల్లర్ లవర్స్ వాచ్‌ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

నటీనటులు ఎవరు ?

Advertisement

రాజీవ్ ఖండేల్వాల్ డాక్టర్ ఆమిర్ అలీగా, ముఖేష్ అగ్రహారి వెయిటర్ గా, ఐశ్వర్య భాస్కర్ – ఫలక్ గా, వాసన్ బాల – మెసెంజర్ గా, రోహ్తాస్ గౌర్ – కస్టమ్స్ అధికారిగా, సుపవిత్ర బాబుల్ – విమాన ప్రయాణికురాలిగా, గజరాజ్ రావు – సెల్‌ఫోన్ వ్యక్తిగా నటించారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించి, కథను కూడా రాశారు. ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్‌తో తీశారు.

ఎక్కడ చూడాలి ? IMDb రేటింగ్ ఎంత ?

ఐఎండీబీలో ఈ మూవీకి 7.6 రేటింగ్‌ ఉంది. అమెజాన్ MX ప్లేయర్‌లో ఇప్పుడు అందుబాటులో ఉంది. హిందీలోనే ఉంది కాబట్టి సులభంగా చూడొచ్చు. వారాంతం సరదాగా గడపాలనుకుంటే ఇది బెస్ట్ ఛాయిస్.

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×