E-Paper
Advertisement

బ్యాచిలర్ పార్టీకని వెళ్ళి దిక్కుతోచని చిక్కుల్లో… కట్ చేస్తే బట్టల్లేకుండా బీచ్ లో

బ్యాచిలర్ పార్టీకని వెళ్ళి దిక్కుతోచని చిక్కుల్లో… కట్ చేస్తే బట్టల్లేకుండా బీచ్ లో
Advertisement

Comedy Thriller: నవ్వులు పంచుతూనే ఉత్కంఠను పెంచే సినిమాలు చూడాలనుకునే వారికి ఈరోజు మన మూవీ సజెషన్. ఆ మూవీ పేరే తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టిన ’72 అవర్స్’ (72 Hours). నార్మల్ బ్యాచిలర్ పార్టీగా కామెడీతో మొదలయ్యే ఈ సినిమా… సడన్ గా క్రైమ్ ట్రాక్ లోకి వెళ్తుంది. సరదాగా మొదలైన ప్రయాణం కాస్తా… ప్రాణాల కోసం పరుగులు పెట్టే స్థితికి ఎలా చేరిందనే అంశాన్ని దర్శకుడు ఎంటర్టైనింగ్ గా చూపించాడు. మరి ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? తెలుగులో ఉందా లేదా ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సినిమాలో జో అనే వ్యక్తి మన హీరో. ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పని చేసే 40 ఏళ్ల ఎగ్జిక్యూటివ్. తన కెరీర్‌లో పెద్ద ప్రమోషన్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటాడు. కానీ యువతను ఆకట్టుకునే కొత్త ఆలోచనలు మాత్రం అతని బుర్రకు అందవు. అదే సమయంలో ఒక చిన్న పొరపాటు అతని జీవితాన్ని మరో కొత్త దారిలో నడిపిస్తుంది. ఒక వాట్సాప్ గ్రూప్‌లో అనుకోకుండా యాడ్ అవుతాడు జో.

Advertisement

అందులోనే అందరూ 20 ఏళ్ల అబ్బాయిలే. హీరో మాత్రమే 40 ఏళ్ల వ్యక్తి. ఇరవై ఏళ్ల యువకుల బ్యాచిలర్ పార్టీ ప్లాన్ గురించి తెలుసుకుంటాడు. దొరికిందే ఛాన్స్… యువత ఎలా ఆలోచిస్తారో దగ్గరగా గమనిస్తే తన కెరీర్‌కు ఉపయోగపడుతుంది అని భావిస్తాడు. వాళ్ళతో కలిసి మయామి ట్రిప్‌కు బయలుదేరుతాడు. అక్కడి నుంచి కథ అసలు మలుపు తిరుగుతుంది. మయామిలో మొదటి కొన్ని గంటలు అంతా సరదాగానే సాగుతుంది. పార్టీలు, నవ్వులు, కొత్త అనుభవాలు… ఇవన్నీ జోకు కొత్త ప్రపంచంలా అనిపిస్తాయి.

కానీ ఒక చిన్న పొరపాటు గ్యాంగ్‌ మొత్తాన్ని పెద్ద ప్రమాదంలో పడేస్తుంది. వాళ్లు బుక్ చేసుకున్న విల్లా సీక్రెట్ బయట పడడంతో పరిస్థితులు చేయిదాటి పోతాయి. అక్కడి నుంచి పోలీసుల వెంటపడడం, డ్రగ్ మాఫియా బెదిరింపులు, ప్రాణాలతో తప్పించుకునే ప్రయత్నాలు షురూ అవుతాయి. ఒక సాధారణ ఆఫీస్ ఉద్యోగి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందిస్తాడు ? అసలు ఆ విల్లా వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి ? చివరకు వాళ్ళు అక్కడి నుంచి ఎలా బయట పడ్డారు ? అసలు ప్రమాదానికి కారణం ఎవరు ? చివరికి ఈ 72 గంటల గందరగోళం ఎలా ముగిసింది? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతోందా ?

Advertisement

’72 అవర్స్’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు కామెడీ కూడా కావలసినంత ఉంది. డేంజరస్ సిట్యుయేషన్ లో పడ్డారే అనుకున్న ప్రతీ సీన్ లోనూ కెవిన్ హార్ట్ తన కామెడీతో నవ్వులు పూయిస్తాడు. వయసులో సగం ఉన్న యువకులతో కలిసి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు ఫన్నీగా అనిపిస్తాయి. అదే సమయంలో కథలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుడిని తర్వాత ఏమవుతుందా అనే ఆసక్తిలో ముంచేస్తాయి. క్రైమ్ బ్యాక్‌డ్రాప్ ఉన్నా, పూర్తిగా సీరియస్‌గా కాకుండా కామెడిగా కథను నడిపించారు. యూత్ ను ఆకట్టుకునే ఫ్రెండ్‌షిప్, సర్వైవల్, యాక్షన్ అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. ఈ సినిమా ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. జూలై 24న విడుదలైన ఈ మూవీ ఓటీటీలో ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ మాత్రం లేదు. వీకెండ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి చూడదగ్గ మంచి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, డోంట్ మిస్.

Read Also: రౌడీని రంగంలోకి దింపే చర్చ్… ఓటీటీలోకి వచ్చిన మలయాళ పీరియాడిక్ యాక్షన్ డ్రామా

Tags

Related News

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

పెళ్లి కాకుండానే పేరెంట్స్… వియ్యంకుల మధ్య మొదలైన వింత బంధం… ఫీల్ గుడ్ కొరియన్ సిరీస్ తెలుగులో

భూతాలు లేవు, దెయ్యాలు లేవు… అయినా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే హారర్ థ్రిల్లర్… 7.9 రేటింగ్

వింత వింత జంతువులతో క్రేజీ అడ్వెంచర్… తెలుగులోనే ఈ కిడ్స్ అండ్ ఫ్యామిలీ ధమాకా

గంటకి 300 కిలోమీటర్ల వేగం… బుల్లెట్ ట్రెయిన్‌లో డెడ్లీ కిల్లర్స్ వేట… తెలుగులో స్ట్రీమింగ్

రోజుకొకరితో బ్లైండ్ డేట్… ట్రయాంగిల్ లవ్ స్టోరీ… ప్రేమలో గెలవడానికి ప్రాక్టికల్ చిట్కాలున్న కొరియన్ సిరీస్ తెలుగులో

ఓటీటీలో మలయాళం సినిమాల హవా… ఈ 3 థ్రిల్లర్స్‌లో మీరెన్ని చూశారు?

Big Stories

Advertisement
×