E-Paper
Advertisement

Action thriller OTT : వరుస హత్యలతో పోలీసులకు చుక్కలు… అదిరిపోయే ట్విస్టులు ఉన్న హాంకాంగ్ మూవీ

Action thriller OTT : వరుస హత్యలతో పోలీసులకు చుక్కలు… అదిరిపోయే ట్విస్టులు ఉన్న హాంకాంగ్ మూవీ
Advertisement

Action thriller OTT : డిటెక్టివ్ సినిమాలంటే ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను అస్సలు మిస్ కావద్దు. ఈ హాంకాంగ్ యాక్షన్ థ్రిల్లర్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ, ఊహించని మలుపులు తిరుగుతుంది. వరుస హత్యల నేపథ్యంలో సాగే ఈ సినిమా చూపు కూడా తిప్పుకోనివ్వదు. ఈ హత్యల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ను వెలికితీసే క్రమంలో స్టోరీ నడుస్తుంటుంది. ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా ఓటీటీలో కూడా ట్రెండింగ్ లో ఉంది. దీని పేరు ఏమిటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2022లో విడుదలైన ఈ హాంకాంగ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘డిటెక్టివ్ vs స్లూత్స్’ (Detective Vs Sleuths). దీనికి వై కా-ఫై దర్శకత్వం వహించి, నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇందులో సీన్ లావు, చార్లీన్ చోయ్, రేమండ్ లామ్, కార్మాన్ లీ నటించారు. 2018 ఆగస్టు 21 నుండి 2018 డిసెంబర్ 17 వరకు హాంకాంగ్ లో చిత్రీకరణ జరిగింది. COVID-19 మహమ్మారి కారణంగా వాయిదా పడిన తర్వాత, ‘డిటెక్టివ్ vs స్లూత్స్’ 2022 జూలై 21న హాంకాంగ్‌లో విడుదలైంది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 41వ హాంకాంగ్ ఫిల్మ్ అవార్డులలో 11 విభాగాలలో 4 విభాగాలను గెలుచుకుంది. వాటిలో వై కా-ఫైకి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, సీన్ లాకు ఉత్తమ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ ఉన్నాయి. ఇది ఉత్తమ చిత్రంగా కూడా నామినేట్ అయింది. ప్రస్తుతం Apple tvలో ఈ మూవీ స్ట్రీమింగ్ లో ఉంది.

Advertisement

Read Also : నాలుగు కాలాల్లో నలుగురు డిటెక్టివ్ ల ఇన్వెస్టిగేషన్… మైండ్ బెండయ్యే థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే

లీ జున్ గతంలో హాంకాంగ్ పోలీసు విభాగంలో అత్యంత తెలివైన డిటెక్టివ్. అయితే ఒక కేసు విచారణ సమయంలో అతను చేసిన వింత ప్రవర్తన కారణంగా అతడిని ఉద్యోగం నుండి తొలగిస్తారు. అప్పటి నుండి అతను ఒక వంతెన కింద నివసిస్తూ, పాత కేసుల గురించి గోడలపై రాస్తూ పిచ్చివాడిగా కనిపిస్తుంటాడు. కానీ నిజానికి అతను నేరస్థుల కంటే వేగంగా ఆలోచించగలడు. ఈ సమయంలో హాంకాంగ్ నగరంలో అకస్మాత్తుగా వరుస హత్యలు జరుగుతాయి. ఈ హత్యలు చేసే వ్యక్తులు తమను తాము “ది చోజెన్ స్లూత్స్” అని పిలుచుకుంటారు. వీళ్ళ ప్రత్యేకత ఏమిటంటే, గతంలో పోలీసులు ఛేదించలేకపోయిన, తప్పించుకున్న నేరస్థులను వీళ్ళు చంపేస్తుంటారు. హత్య జరిగిన చోట ఆ పాత కేసుకు సంబంధించిన ‘ఫైల్ నంబర్’ను వదలి వెళ్తుంటారు.

Advertisement

వరుస హత్యలు జరుగుతున్న తీరును గమనించిన లీ జున్, తన నైపుణ్యంతో నెక్స్ట్ టార్గెట్ ఎవరో పోలీసుల కంటే ముందే పసిగడతాడు. ఒక ఉన్నతాధికారి లీ జున్ టాలెంట్ గుర్తించి అతని సహాయం తీసుకుంటుంది. వీళ్ళు కలిసి అసలు ఆ స్లూత్స్ ఎవరు? వారి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? అనే విషయాన్ని వెతుకుతుంటారు. ఈ విచారణలో లీ జున్‌కు ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏమిటి ? లీ జున్ కిల్లర్ ని ఎలా కనిపెడతాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×