E-Paper
Advertisement

Time Travel Movie OTT : నాలుగు కాలాల్లో నలుగురు డిటెక్టివ్ ల ఇన్వెస్టిగేషన్… మైండ్ బెండయ్యే థ్రిల్లర్

Time Travel Movie OTT : నాలుగు కాలాల్లో నలుగురు డిటెక్టివ్ ల ఇన్వెస్టిగేషన్… మైండ్ బెండయ్యే థ్రిల్లర్
Advertisement

Time Travel Movie OTT : మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలు ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి స్టోరీలను ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. . నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఇంటెన్స్ తో ఈ కథలు నడుస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ లో ఒకే చోట ఒకే వ్యక్తి మృతదేహం నాలుగు వేర్వేరు కాలాల్లో కనిపిస్తుంది. ఆ కాలానికి చెందిన నలుగురు డిటెక్టివ్ లు దీనిని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ చేయాలనిపించదు ఈ సిరీస్ ని చూస్తే. ఇది టైమ్ ట్రావెల్ థీమ్ తో రూపొందింది. ఈ సిరీస్ ఎక్కడ ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివారాలను తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్  

ఈ బ్రిటీష్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘బాడీస్’ (Bodies). ఇది ప్రధానంగా నెట్‌ఫ్లిక్స్ కోసం పాల్ టోమలిన్ క్రియేట్ చేశారు. మార్కో క్రూజ్‌పైంట్నర్హ, వోలు వాంగ్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్‌లను కలిగి ఉంది. 2023 అక్టోబర్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో ప్రీమియర్ అయింది. ఇందులో స్టీఫెన్ గ్రాహం, షిరా హాస్, జాకబ్ ఫార్చ్యూన్-లాయిడ్, అమాకా ఒకాఫోర్, కైల్ సోలర్ కీలక పాత్రలు పోషించారు. ఐయండిబిలో దీనికి 7.3/10 రేటింగ్ ఉంది.

Advertisement

Read Also :  రెక్కలతో పుట్టే బిడ్డ… ఆ తల్లి చేసిన పనికి కన్నీళ్ళు ఆగవు… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ

స్టోరీ ఏమిటంటే

లండన్‌లోని వైట్‌చాపెల్ ప్రాంతంలోని లాంగ్‌హార్వెస్ట్ లేన్‌లో ఒక మృతదేహం కనిపించడంతో కథ ప్రారంభమవుతుంది. ఇదే శరీరం నాలుగు వేర్వేరు సంవత్సరాల్లో ఒకే ప్రదేశంలో కనిపిస్తుంది. నలుగురు వేర్వేరు డిటెక్టివ్‌లు ఈ మిస్టరీ కేసును దర్యాప్తు చేస్తారు. మొదటగా 1890 విక్టోరియన్ కాలంలో ఒక డిటెక్టివ్, 1941 రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మరో డిటెక్టివ్. 2023 కాలంలో మరొక డిటెక్టివ్, 2053 భవిష్యత్తు కాలంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. ఈ నాలుగు కాలాల్లోని దర్యాప్తు ఒకే కుట్రకు ఎలా దారితీసింది ? 150 ఏళ్ల కాలక్రమాన్ని ఒక వ్యక్తి ఎలా ప్రభావితం చేశాడనేది ఈ సిరీస్ ప్రధాన కథ. చివరి ఎపిసోడ్ లో ఈ చిక్కుమూడుల అసలు రహస్యాలు తెలుస్తాయి. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్ ఇది. చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ దొరికినట్లే.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×