E-Paper
Advertisement

Youtube Parent control: యూట్యూబ్‌లో పిల్లలకు టైమ్ లిమిట్.. పేరెంట్ కంట్రోల్ ఫీచర్‌తో మరిన్ని ఆంక్షలు

Youtube Parent control: యూట్యూబ్‌లో పిల్లలకు టైమ్ లిమిట్.. పేరెంట్ కంట్రోల్ ఫీచర్‌తో మరిన్ని ఆంక్షలు
Advertisement

Youtube Parent control: యూట్యూబ్ ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం. ప్రతి రోజూ బిలియన్ల మంది వివిధ వయసుల వారు ఇక్కడ వినోదం, విద్య, సంగీతం, వార్తలు, షార్ట్ వీడియోలు చూస్తారు. పిల్లలు, టీనేజర్లు ప్రతిరోజు ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడుపుతున్నారు. ఇంటర్నెట్ వినియోగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో కంటే ఆన్‌లైన్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలు సోషల్ మీడియా, యూట్యూబ్‌లో చూసే కంటెంట్ పట్ల ఆందోళన చెందుతున్నారు. హానికరమైన లేదా అనవసరమైన కంటెంట్ నుండి పిల్లలను కాపాడాలనుకుంటారు.

ఈ సమస్యలను పరిష్కరించడానికి యూట్యూబ్ కొత్త పేరెంట్ కంట్రోల్ (తల్లిదండ్రుల నియంత్రణ) ఫీచర్స్‌ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్స్ తల్లిదండ్రులకు.. పిల్లల ఏం చూస్తున్నారు? ఎంతసేపు చూస్తున్నారు? అని నిర్ణయించేందుకు పవర్‌ఫుల్ టూల్స్ ఇస్తాయి. యూట్యూబ్ తన అధికారిక బ్లాగ్‌లో ఈ అప్‌డేట్‌ల గురించి వివరించింది. యువతకు సురక్షితమైన డిజిటల్ సేవలు ఇవ్వాలనేది దీని లక్ష్యం.

పిల్లలు వీడియో షార్ట్స్ చూసేందుకు టైమ్ లిమిట్

Advertisement

యూట్యూబ్ షార్ట్స్ చిన్న వీడియోలు పిల్లలను చాలా సేపు ఆకర్షిస్తాయి. ఇప్పుడు తల్లిదండ్రులు షార్ట్స్ చూసే సమయానికి రోజువారీ టైమ్ లిమిట్ (సమయ పరిమితి) పెట్టవచ్చు. 15 నిమిషాలు, 30 నిమిషాలు, 45 నిమిషాలు, ఒక గంట లేదా రెండు గంటలు అని ఎంచుకోవచ్చు. పరిమితి పూర్తయ్యాక ఆ రోజు మరిన్ని షార్ట్స్ చూడలేరు. ఇది ఎండ్‌లెస్ స్క్రోలింగ్ అలవాటును తగ్గిస్తుంది. త్వరలో షార్ట్స్ పరిమితిని జీరోకి సెట్ చేసే ఆప్షన్ కూడా వస్తుంది. అప్పుడు ఆ రోజంతా షార్ట్స్ పూర్తిగా ఆపేస్తారు.

బెడ్‌టైమ్ అలర్ట్స్, బ్రేక్ రిమైండర్లు

యూట్యూబ్ కొత్త బెడ్‌టైమ్ అలర్ట్ ఫీచర్ తీసుకొచ్చింది. నిద్రపోయే సమయం అయ్యాక నోటిఫికేషన్ పంపుతుంది. పిల్లలు వీడియోలు చూడటం ఆపి విశ్రాంతి తీసుకోవాలని గుర్తు చేస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల రోజువారీ షెడ్యూల్ ప్రకారం బెడ్‌టైమ్ సెట్ చేయవచ్చు. అలాగే బ్రేక్ రిమైండర్ సౌలభ్యం ఉంది. ఎక్కువ సేపు చూస్తుంటే బ్రేక్ తీసుకోమని నోటిఫికేషన్ ఇస్తుంది. ఇది ఆరోగ్యకరమైన స్క్రీన్ అలవాట్లను ప్రోత్సహిస్తుంది.

విద్యా కంటెంట్ కోసం క్రియేటర్ గైడ్

Advertisement

టీనేజర్ల కోసం యూట్యూబ్ కొత్త క్రియేటర్ గైడ్ ప్రారంభించింది. ఇది ఉపయోగకరమైన, విద్యాత్మక వీడియోలను ప్రోత్సహిస్తుంది. టీనేజర్లకు ట్రస్టెడ్ లెర్నింగ్ ఛానెల్స్ సిఫార్సు చేస్తుంది. ఉదాహరణకు ఖాన్ అకాడమీ, క్రాష్‌కోర్స్, TED-Ed వంటి ఛానెల్స్ రికమెండ్ అవుతాయి. ఈ క్రియేటర్ గైడ్.. టీనేజర్లు క్వాలిటీ విద్యా కంటెంట్ సులభంగా చూడేలా చేస్తుంది. తక్కువ విలువైన లేదా డిస్ట్రాక్టింగ్ వీడియోల ఎక్స్‌పోజర్ తగ్గుతుంది.

టీనేజర్లకు వయస్సు ఆధారిత అకౌంట్లు

త్వరలో యూట్యూబ్ కొత్త సైన్-అప్ ఎక్స్‌పీరియన్స్ కూడా తీసుకురాబోతోంది. 18 ఏళ్లలోపు వారికి ప్రత్యేక వయస్సు ఆధారిత అకౌంట్లు ఇస్తుంది. ఈ అకౌంట్లలో వయస్సుకు తగిన కంటెంట్ మాత్రమే చూపిస్తుంది. ఏజ్ గైడ్ లైన్స్ (వయస్సు మార్గదర్శకాల) ప్రకారం వీడియోలు ఫిల్టర్ అవుతాయి. ఇది తల్లిదండ్రులకు యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ భద్రతపై ఎక్కువ నమ్మకం ఇస్తుంది. టీనేజర్లు తమ అభివృద్ధి దశకు సరిపడిన కంటెంట్ పొందుతారు.

Also Read: పిల్లల వాట్సాప్ అకౌంట్ ఇక తల్లిదండ్రుల చేతుల్లో.. భద్రత కోసం కొత్త ఫీచర్

కుటుంబాలకు మరింత సురక్షిత యూట్యూబ్ ఎక్స్‌పీరియన్స్

ఈ కొత్త అప్‌డేట్‌లు పిల్లల భద్రతపై యూట్యూబ్ దృష్టి పెట్టినట్లు చూపిస్తాయి. వీటితో తల్లిదండ్రులు ఇప్పుడు వీడియోలు చూసే సమయం, కంటెంట్ క్వాలిటీపై ఎక్కువ నియంత్రణ పొందుతారు. వినోదం, బాధ్యతాయుత వినియోగం మధ్య బ్యాలెన్స్ కల్పించడమే ఈ కొత్త ఫీచర్స్ లక్ష్యం. ఈ ఫీచర్స్.. పిల్లలు, టీనేజర్లలో ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లు పెంపొందించడానికి సహాయపడతాయి.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×