E-Paper
Advertisement

ఓటీటీలోకి వచ్చేసిన పాయల్ రాజ్‌పుత్ – శరవణన్ స్పై యాక్షన్ థ్రిల్లర్… ఐయండిబిలో 7.1 రేటింగ్

ఓటీటీలోకి వచ్చేసిన పాయల్ రాజ్‌పుత్ – శరవణన్ స్పై యాక్షన్ థ్రిల్లర్… ఐయండిబిలో 7.1 రేటింగ్
Advertisement

Action Thriller OTT : ఫాదర్-డాటర్ సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్‌తో పాటు హై ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్‌లతో ‘లీడర్’ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంతోంది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల లోపే ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ‘ది లెజెండ్’ స్టార్ సరవనన్ హీరోగా నటించన ఈ సినిమా ఈ వాల ఓటీటీలోకి వచ్చేసింది. మామూలు మనిషిగా బతికుతూ దేశం, కుటుంబం కోసం పోరాడే ఒక తండ్రి ప్రయాణం ఈ సినిమాలో బాగా చూపించారు. ట్విస్టులు, సస్పెన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం పూర్తి ఎంటర్‌టైనర్‌గా మారింది. యాక్షన్ థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడేవారికి ఇది తప్పకుండా చూడాల్సిన చిత్రం.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈరోజు మే 29న స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘లీడర్’ (Leader). అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. లెజెండ్ నటుడు శరవణన్ హీరోగా, అందాల హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో కలిసి నటించిన ఈ చిత్రం 2026 ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. అయినప్పటికీ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లు, వేగవంతమైన కథనం, ఎమోషనల్ టచ్‌లతో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఐఎమ్‌డీబీలో 7.1 రేటింగ్ సాధించిన ఈ సినిమా ఇప్పుడు తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. రెండు నెలల్లోనే ఓటీటీకి వచ్చేసిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ లవర్స్‌కు తప్పక చూడాల్సిన సినిమాగా మారింది. దర్శకుడు ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ తెరకెక్కించిన లీడర్ భారీ బడ్జెట్‌తో తీశారు. శరవణన్ స్వయంగా నిర్మాతగా పనిచేశారు. సినిమాలో శరవణన్‌తో పాటు పాయల్ రాజ్‌పుత్, ఆండ్రియా జెరెమియా, శ్యామ్, సంతోష్ ప్రతాప్ వంటి అనుభవజ్ఞులైన నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

లీడర్ కథ ఒక సాధారణ మెకానిక్‌గా బతికే సీక్రెట్ ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. బయటి ప్రపంచానికి సాధారణ కారు మెకానిక్‌గా కనిపించే శక్తివేల్ (శరవణన్) నిజానికి దేశ భద్రత కోసం పనిచేసే అండర్‌కవర్ ఏజెంట్. అతనికి భార్య మీరా (పాయల్ రాజ్‌పుత్) వినికిడి సమస్యతో ఉన్న చిన్న కూతురు ఉన్నారు. కూతురి ఆపరేషన్ కోసం డబ్బు అవసరం ఉన్న నేపథ్యంలో శక్తివేల్ ఒక ప్రమాదకరమైన మిషన్ చేపట్టాడు. తూత్తుకుడి నౌకాశ్రయంపై జరగబోయే భారీ దాడిని అడ్డుకోవాల్సిన ఈ మిషన్‌లో అతను ఎదుర్కొనే సవాళ్లు, సస్పెన్స్ ఉత్కంఠభరిత ఘటనలతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఒకవైపు క్రిమినల్ గ్యాంగ్స్‌తో, మరోవైపు పోలీసు శాఖతో జరిగే సంక్లిష్ట పరిస్థితుల మధ్య తన కుటుంబాన్ని రక్షించుకుంటూ శక్తివేల్ చేసే పోరాటమే ఈ చిత్రం హార్ట్ ఆఫ్ ది స్టోరీ.

Read Also :శాప గ్రస్త అడవిలో ఒంటరి మహిళ… ఓటీటీని వణికిస్తున్న హారర్ థ్రిల్లర్

Related News

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

14,000 ఏళ్ల వయసున్న టీచర్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న క్లాసిక్ సై-ఫై మూవీ

మనుషులంటేనే పడని మిస్టీరియస్ మనిషి… దిమ్మతిరిగే ట్విస్టులున్న మలయాళం థ్రిల్లర్

Big Stories

Advertisement
×