E-Paper
Advertisement

చేతిలో లవ్ లెటర్ బదులు డ్రగ్స్ ప్యాకెట్.. ప్రపోజల్ ప్లాన్ రివర్స్… ఓటీటీలో నవ్వులు పూయిస్తున్న మూవీ

చేతిలో లవ్ లెటర్ బదులు డ్రగ్స్ ప్యాకెట్.. ప్రపోజల్ ప్లాన్ రివర్స్… ఓటీటీలో నవ్వులు పూయిస్తున్న మూవీ
Advertisement

Adinaasam Vellapokkam on OTT: కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆ ప్రేమను చెప్పడానికి ఫ్రెండ్స్ ఇచ్చే క్రేజీ సలహాలు పాటించడం చాలా కామన్. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ స్టోరీ మాత్రం యమక్రేజీగా ఉంటుంది. ఓ కుర్రాడు తన లవర్‌కు ప్రపోజ్ చేయడానికి వేసిన ప్లాన్ కాస్తా.. నలుగురు ఫ్రెండ్స్‌ను ఏకంగా ఒక కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ చేతిలో చిక్కుకునేలా చేస్తుంది. పైగా జేబులో ఉండాల్సిన లవ్ లెటర్ ప్లేస్‌లో డ్రగ్స్ ప్యాకెట్ వచ్చి చేరితే ఆ తర్వాత జరిగే రచ్చ మామూలుగా ఉండదు కదా! ఇలాంటి పక్కా ఎంటర్‌టైనింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన మలయాళ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘అడినాశం వెల్లప్పొక్కం’ (Adinaasam Vellapokkam) ఇప్పుడు ఏకంగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మలయాళ విలక్షణ నటుడు షైన్ టామ్ చాకో లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా, నవంబర్ 26 నుంచి ఈటీవీ విన్ (ETV Win) లో స్ట్రీమింగ్ అవుతోంది. కాలేజీ అల్లరి, లవ్ ట్రాక్, డ్రగ్స్ గోల, గ్యాంగ్‌స్టర్ల హడావుడి.. ఇలా ఫుల్ ప్యాకేజీగా వచ్చిన ఈ సినిమా అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం.

స్టోరీ ఏమిటంటే ?

ఈ కథంతా లిబర్టీ ఇంజనీరింగ్ కాలేజీ చుట్టూ తిరుగుతుంది. పేరుకు లిబర్టీ కాలేజీ అయినా అక్కడ మాత్రం నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ప్రిన్సిపాల్ షీలా జకారియా (మంజు పిళ్లై) క్రమశిక్షణ విషయంలో అస్సలు రాజీపడదు. ఆమె కుమార్తె ఐడా (లిజబెత్ టామీ) అదే కాలేజీ బాగోగులు చూస్తూ ఉంటుంది. అక్కడ చదివే వరుణ్ రామమూర్తి (సంజయ్ థామస్)కి ఐడా అంటే ఇష్టం. అయితే తన ప్రేమను ఆమెకు చెప్పడానికి ధైర్యం సరిపోదు.

Advertisement

దీంతో వరుణ్ స్నేహితుడు బెన్నీ (వినీత్ మోహన్) ఓ వింత సలహా ఇస్తాడు. ధైర్యం తెచ్చుకోవడానికి డ్రగ్స్ తీసుకోమని చెబుతాడు. ఈ ఆలోచనతో వరుణ్‌తో పాటు అతడి స్నేహితులు బెన్నీ, లాలూ (సజిత్ థామస్), రిహాన్ (ప్రిన్స్ జూనియర్) కూడా ఓ పెద్ద సమస్యలో చిక్కుకుంటారు. అనుకోకుండా అండర్‌వరల్డ్ డాన్ కొలంబస్ (షైన్ టామ్ చాకో)కు చెందిన విలువైన డ్రగ్స్ సరుకు వీళ్ల చేతికి చిక్కుతుంది.

తన సరుకు కనిపించకుండా పోవడంతో కొలంబస్ రంగంలోకి దిగుతాడు. పోలీసుల దృష్టిలో పడకుండా దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి మోటివేషనల్ స్పీకర్ వేషంలో కాలేజీలోకి ప్రవేశిస్తాడు. అప్పటివరకు కాలేజీ అల్లరితో సరదాగా గడిపిన నలుగురు స్నేహితులు.. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ నుంచి తప్పించుకోవడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది. ఒకవైపు కొలంబస్, మరోవైపు కఠినమైన ప్రిన్సిపాల్, ఇంకోవైపు పోలీసుల నిఘా.. ఈ ముగ్గురి మధ్య ఆ నలుగురు ఎలా ఇరుక్కుపోయారు? చివరికి ఈ గందరగోళం నుంచి ఎలా బయటపడ్డారు? అన్నదే మిగతా కథ.

తెలుగులోనే స్ట్రీమింగ్

Advertisement

‘అడినాశం వెల్లపొక్కం’ చిత్రానికి ఏ.జె. వర్గీస్ దర్శకత్వం వహించగా, మనోజ్ కుమార్ కె.పి. సూర్య భారతి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. షైన్ టామ్ చాకో, బైజు సంతోష్, మంజు పిళ్లై, బాబు ఆంటోనీ, జాన్ విజయ్, అశోకన్, ప్రేమ్ కుమార్, వినీత్ మోహన్, సంజయ్ థామస్, లిజబెత్ టామీ తదితరులు నటించారు. ఈ సినిమా 2025 డిసెంబర్ 12న మలయాళంలో థియేటర్లలో విడుదలైంది. సుమారు 2 గంటల 6 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీ ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ వెర్షన్ 2026 నవంబర్ 26 నుంచి ETV Winలో స్ట్రీమింగ్ అవుతోంది. కాలేజీ కామెడీతో పాటు క్రైమ్, గ్యాంగ్‌స్టర్ హడావుడిని ఇష్టపడేవాళ్ళు ఈ వీకెండ్‌లో ఈ సినిమాను చూడొచ్చు.

Read Also: భర్తలకు తెలియకుండా భార్యల రహస్య పార్టీలు… ఓటీటీలో సంచలన సిరీస్

Tags

Related News

ఓటీటీలోకి జయసుధ సమ్మర్ హాలిడేస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మనుషులను మొక్కలుగా మార్చే వింత టెక్నాలజీ… ఆ తర్వాత వరుస హత్యలు… మతిపోగొట్టే సైఫై థ్రిల్లర్

ఆ కుర్రాడిని తాకితే చాలు బాధలన్నీ మాయం… ఓటీటీలో గత్తరలేపుతున్న హారర్ థ్రిల్లర్

ఒకప్పుడు ప్రాణ స్నేహితులు… కట్ చేస్తే కరుడుగట్టిన శత్రువులుగా… దుమ్మురేపే యాక్షన్ వార్ డ్రామా

8 మంది ఫ్రెండ్స్, 12 క్రేజీ గేమ్స్… నేటి నుంచే ఓటీటీలో ఫన్ రియాలిటీ షో

మృత్యువు వెంటాడుతున్న నగరం… చావు లేని ఆ ఒక్కడి కోసం వేట… తెలుగులో అదిరిపోయే థ్రిల్లర్

నేటి నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆధ్యాత్మిక వండర్ హనుమాన్ అంశ్’ స్ట్రీమింగ్… ఎక్కడ చూడాలంటే?

Big Stories

Advertisement
×