E-Paper
Advertisement

Action Thriller OTT : ఒకే అమ్మాయితో ఏడుగురు… శవంతో కాపురం… రక్తాన్ని మరిగించి రివేంజ్ డ్రామా

Action Thriller OTT : ఒకే అమ్మాయితో ఏడుగురు… శవంతో కాపురం… రక్తాన్ని మరిగించి రివేంజ్ డ్రామా
Advertisement

Action Thriller OTT : అమ్మాయిలపై అరాచకాలు అనే టాపిక్ ను రోజుకోసారైనా వార్తల్లో చూస్తూ ఉంటాము. కానీ వాళ్ళు ఒక్కసారి ఎదురు తిరిగితే కాళీమాత కళ్ళముందు మెదులుతుందనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. ఇందులో తన జీవితంతో ఆదుకున్న క్రూర మృగాల పని పట్టే అమ్మాయిని చూస్తే ఒళ్లు జలదరిస్తుంది, మరి ఈ బ్రూటల్ రివేంజ్ డ్రామాను ఏ ఓటీటీలో చూడవచ్చు ?

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఇండోనేషియన్ రివెంజ్ థ్రిల్లర్-డ్రామా చిత్రం ‘మార్లినా ది మర్డరర్ ఇన్ ఫోర్ యాక్ట్స్’ (Marlina the Murderer in Four Acts). 2017లో విడుదలైన ఈ సినిమా అంతర్జాతీయంగా మూవీ లవర్స్ ను ఆకట్టుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో Un Certain Regard విభాగంలో పోటీ పడింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ పొందింది. ఇండోనేషియా సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన ముఖ్యమైన చిత్రాల్లో ఇది ఒకటి. ప్రస్తుతం Prime Videoలో అందుబాటులో ఉంది. ఇండోనేషియన్ ఆడియోతో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు.

కథలోకి వెళ్తే…

Advertisement

ఇండోనేషియాలోని ఒక మారుమూల గ్రామంలో ఒంటరిగా జీవిస్తుంది మార్లినా (మార్సియా రోజా) అనే మహిళా. ఆమె భర్త అప్పటికే చనిపోతాడు. కానీ ఆమె ఇంకా అతని మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి, రోజూ మాట్లాడుతూ, భోజనం పెడుతూ ఉంటుంది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే ఆ అమ్మాయి గర్భవతి కూడా. ఆమె జీవితం ఒంటరితనం, దుఃఖం, భయంతో నిండిపోతుంది. అయితే అదే గ్రామంలో ఉండే మార్కస్ (ఎగి ఫెడ్లీ) ఆమె ఇంటికి వచ్చి ఆమెను బలవంతంగా భోజనానికి ఆహ్వానిస్తాడు. ఆ రాత్రి మార్కస్, అతని స్నేహితులు మార్లినా ఇంటికి వచ్చి ఆమెపై అఘాయిత్యం చేస్తారు.

Read Also : డబ్బుకు కొదవే లేదని కొరివితో తల గోక్కునే మెంటలోడు… బుర్రపాడు ట్విస్టులు మావా

Advertisement

ఈ దాడి తర్వాత మార్లినా మనసులో భయంకరమైన మార్పు వస్తుంది. ఆమె మార్కస్ ఇంటికి వెళ్లి అతన్ని చంపేస్తుంది. అతని తలను కట్ చేసి బ్యాగ్‌లో పెట్టుకుని తీసుకెళ్తుంది. ఇక్కడి నుంచి కథ నాలుగు యాక్ట్స్‌గా సాగుతుంది. యాక్ట్ 1 – ది రేప్, యాక్ట్ 2 – ది మర్డర్, యాక్ట్ 3 – ది జర్నీ, యాక్ట్ 4 – ది రివెంజ్ & కన్‌ఫ్రంటేషన్. ఇక ఒక్కసారి రివేంజ్ తీర్చుకోవాలని డిసైడ్ అయిన ఆ మహిళ వెనకడుగు వేయాడు. 93 నిమిషాలు ఈ ఊచకోత కేవలం పెద్దలకు మాత్రమే అని మరచిపోవద్దు. ఇందులో సీట్ ఎడ్జ్ థ్రిల్ తో పాటు, గుండెను మెలిపెట్టే ఎమోషనల్ డెప్త్‌ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు గనుక రివేంజ్ థ్రిల్లర్ మూవీ లవర్స్ అయితే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వొద్దు.

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×