E-Paper
Advertisement

Action Thriller OTT: రెండు కుటుంబాల మధ్య దద్దరిల్లే గ్యాంగ్ వార్… ఓటీటీలో టాప్ రేటింగ్ తో ట్రెండింగ్

Action Thriller OTT: రెండు కుటుంబాల మధ్య దద్దరిల్లే గ్యాంగ్ వార్… ఓటీటీలో టాప్ రేటింగ్ తో ట్రెండింగ్
Advertisement

Action Thriller OTT : గత ఏడాది వచ్చిన ఒక హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ఈ కథ లండన్‌లోని రెండు శక్తివంతమైన మాఫియా కుటుంబాల మధ్య జరిగే ఆధిపత్య పోరు చుట్టూ తిరుగుతుంది. లండన్ వీధుల్లో జరిగే ఈ చీకటి ప్రపంచాన్ని చాలా నేచురల్‌గా చూపించారు ఈ సిరీస్ లో. ముఖ్యంగా అండర్ వరల్డ్ సెట్టింగ్స్ చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. ఇక ఈ సిరీస్ లో టామ్ హార్డీ, పియర్స్ బ్రోస్నన్ నటించడం వల్ల దీనికి ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ వచ్చింది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది ఈ సిరీస్. దీనికి ఐయండిబిలో 8.3 రేటింగ్ కూడా ఉంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘మాబ్‌లాండ్’ (MobLand). ఇది 2025 మార్చి 30న పారామౌంట్+ (Paramount+) ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ప్రస్తుతం jio hotstar లో కూడా అందుబాటులో ఉంది. ఇందులో హ్యారీ డి సౌజా పాత్రలో టామ్ హార్డీ, కాన్రాడ్ హారిగాన్ పాత్రలో పియర్స్ బ్రోస్నన్, మేవ్ హారిగాన్ పాత్రలో హెలెన్ మిర్రెన్ తమ నటనతో దుమ్ము లేపారు. దీనిని రోనన్ బెన్నెట్ సృష్టించగా, ప్రముఖ దర్శకుడు గాయ్ రిచీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో, ఇప్పటికే రెండవ సీజన్ కూడా రాబోతోంది. పారామౌంట్+ హిస్టరీలోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన సరీస్ లలో ఒకటిగా నిలిచింది. పది ఎపిసోడ్ లతో వచ్చిన ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ చాలా క్రేజీగా ఉంటుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

లండన్ సిటీలో హారిగాన్స్, స్టీవెన్సన్స్ అని రెండు పెద్ద రౌడీ గ్యాంగులు ఉంటాయి. ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఏళ్ల తరబడి పగ, ప్రతీకారాలు నడుస్తుంటాయి. సిటీ మొత్తం మాదే అని ఒకడంటే, కాదు మాదే అని ఇంకొకడు.. ఇలా ఒకరినొకరు నరుక్కుంటూ, చంపుకుంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఈ గొడవల్లో పడి సామాన్యులు బెంబేలెత్తిపోతుంటే, ఆ మాఫియా సామ్రాజ్యాలు మాత్రం కోట్లకు పడగలెత్తుతాయి. ఈ రొచ్చు లోకి హ్యారీ డి సౌజా (టామ్ హార్డీ) అనే ఒక తెలివైన ఫిక్సర్ ఎంట్రీ ఇస్తాడు. వీడు మామూలోడు కాదు, ఏ గొడవనైనా సెటిల్ చేయడంలో మొనగాడు కూడా.

ఈ రెండు ఫ్యామిలీల మధ్య జరిగే రక్తపాతంలో ఇరుక్కుపోయిన హ్యారీ, తన ప్రాణాలను కాపాడుకుంటూనే ఈ గ్యాంగుల ఆట కట్టించడానికి మాస్టర్ ప్లాన్ వేస్తాడు. పాత తరం డాన్ అయిన కాన్రాడ్ హారిగాన్ (పియర్స్ బ్రోస్నన్) ఇచ్చే పవర్ గేమ్స్ మధ్యలో హ్యారీ ఎలా నెట్టుకొచ్చాడనేదే అసలు మజా ఉంటుంది. ఇక కథ ముందుకు వెళ్లేకొద్దీ, కేవలం ఈ రెండు గ్యాంగులే కాకుండా బయటి దేశాల నుండి పెద్ద పెద్ద క్రిమినల్ గ్యాంగులు కూడా సీన్లోకి వస్తాయి. దీనితో లండన్ వీధులు రణరంగంలా మారిపోతాయి. తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి, తన ఉనికిని చాటుకోవడానికి హ్యారీ చేసే పోరాటం, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అసలు ఈ రౌడీల రాజ్యంలో చివరకు ఎవరు నిలిచారు ? ఎవరు పాతాళానికి పోయారు ? అనే విషయాలతో సిరీస్ మాత్రం క్రాక్ ఎక్కిస్తుంది.

Advertisement

Read Also :  గ్యాంగ్ స్టర్లకు వణుకు పుట్టించే లేడీ సింగం… ఓటీటీలోకి వచ్చేసిన తమిళ యాక్షన్ థ్రిల్లర్

Related News

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

Big Stories

Advertisement
×