Action Thriller movie : అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ ని చూడాలనుకుంటున్నారా ? అయితే ఈ సినిమా మిమ్మల్ని పక్కా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమాలో ఫైట్లు సహజంగా, క్రూరంగా ఉంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ దాదాపు 7 నిమిషాల పాటు సాగుతుంది. దీన్ని షూట్ చేయడానికి 8 రోజులు పట్టింది. ఫైట్ సీన్లలో రియాలిటీ కోసం నటీనటులు నిజంగానే ఒకరినొకరు కొట్టుకునేవాళ్ళు కూడా. ఈ ఇండోనేషియా యాక్షన్ థ్రిల్లర్ ని ఒక్క సారి చూస్తే, ఫైట్ సీన్స్ కోసం మళ్లీ చూస్తారు. అలా ఉంటుంది మరి ఈ సినిమా. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
ఈ ఇండోనేషియా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పేరు ‘ది రైడ్ 2’ (The Raid 2). 2014లో వచ్చిన ఈ సినిమా 2011 వచ్చిన ‘ది రైడ్’ కు సీక్వెల్. గారెత్ ఇవాన్స్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో ఐకో ఉవైస్, రామగా తన పాత్రను తిరిగి పోషించాడు. ఈ చిత్రం 2014 మార్చి 28న సోనీ పిక్చర్స్ క్లాసిక్స్ ద్వారా విడుదలైంది. దీని సినిమాటోగ్రఫీ, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలకు ప్రశంసలు వచ్చాయి కూడా. అయితే కొందరు దాని గ్రాఫిక్ హింసను విమర్శించారు కూడా. మొదటి భాగం కేవలం 100 నిమిషాలు ఉంటే, ఈ సీక్వెల్ 150 నిమిషాల నిడివితో భారీ స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా ప్రస్తుతం Netflix లో అందుబాటులో ఉంది. ఇది తెలుగులో అందుబాటులో లేదు, కానీ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు.
ఈ సినిమా మొదటి పార్ట్ లో బిల్డింగ్ ఫైట్ నుండి బయటపడిన పోలీస్ ఆఫీసర్ రామకి, అసలు ముప్పు బయట ఉందని అర్థమవుతుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, అవినీతి అధికారుల గుట్టు రట్టు చేయడానికి రామ తన ఐడెంటిటీని మార్చుకుంటాడు. ఒక నేరస్తుడిగా జైలుకు వెళ్ళి, అక్కడ మాఫియా డాన్ కొడుకైన ఉచో ప్రాణాలను కాపాడి, అతని నమ్మకాన్ని గెలుచుకుంటాడు. జైలు నుండి బయటకు వచ్చాక, రామ నేరుగా మాఫియా గ్యాంగ్‌లోకి చేరిపోయి, వాళ్ళ అండర్ వరల్డ్ సామ్రాజ్యంలో ఒకడిగా ఎదుగుతూ లోపలి విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడు.
అయితే మాఫియా డాన్ కొడుకు ఉచోకి తన తండ్రి పద్ధతులు నచ్చవు. వాడు జపాన్ మాఫియాతో గొడవ పెట్టుకుని పెద్ద గ్యాంగ్ వార్ మొదలుపెడతాడు. ఈ గందరగోళంలో రామ ఒక పోలీస్ అని వాళ్లకు తెలిసిపోతుంది. ఇక అక్కడి నుండి రామ ప్రాణాల కోసం చేసే పోరాటం మామూలుగా ఉండదు. చివరగా జరిగే భీకరమైన ఫైట్‌లో ఒక ఊపు ఊపే యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఇక క్లైమాక్స్ లో రామ మాఫియాను మట్టుబెడతాడా ? మాఫియాకి బలవుతాడా ? అనే విషయాలను, ఈ ఇండోనేషియా యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుడుకోండి.
Read Also : మ్యాజిక్ బుక్ మాయాజాలం… రియల్ లైఫ్ లో స్టోరీ… కేక పెట్టించే కొరియన్ మూవీ