E-Paper
Advertisement

Action Thriller OTT: 65 ఏళ్ల వయసులో కిరాయి హత్యలు… బామ్మ స్కెచ్ వేస్తే చావు మేళమే

Action Thriller OTT: 65 ఏళ్ల వయసులో కిరాయి హత్యలు… బామ్మ స్కెచ్ వేస్తే చావు మేళమే
Advertisement

Action Thriller OTT : ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే కొరియన్ సినిమాపై ఓ లుక్ వేయండి. ఇది 65 ఏళ్ల వృద్ధురాలి చుట్టూ తిరుగుతుంది. సీట్ ఎడ్జ్ కి తీసుకెళ్ళే సీన్స్ కూడా చాలానే ఉన్నాయి ఇందులో. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఈ సినిమా చూపు తిప్పుకోకుండా చేస్తుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో చూడచ్చు ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎక్కడ చూడవచ్చు అంటే 

ఈ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పేరు ‘ది ఓల్డ్ ఉమెన్ విత్ ది నైఫ్’ (The Old Woman with the Knife). దీనికి మిన్ క్యు-డాంగ్ దర్శకత్వం వహించారు. గు బియోంగ్-మో రాసిన అదే పేరుతో ఉన్న నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇది 2025 ఫిబ్రవరి 20న 75వ బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video ప్లాట్‌ఫామ్‌లో రెంటల్ పద్దతిలో అందుబాటులో ఉంది. అలాగే Viki, Apple TV లలో కూడా ఈ సినిమాని చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హార్న్‌క్లా అనే ఆమె 65 ఏళ్ల వృద్ధురాలు. బయట ప్రపంచానికి ఆమె చాలా సాధారణంగా కనిపిస్తుంది. కానీ నిజానికి ఆమె గత 40 ఏళ్లుగా ఒక ప్రొఫెషనల్ కిల్లర్ గా ఎన్నో హత్యలు చేసింది. ఇప్పుడు వయసు పెరగడంతో ఆమెలో మునుపటి వేగం తగ్గిపోతుంది. జ్ఞాపకశక్తి కూడా కొంచెం మందగిస్తుంది. ఇక ఈ ప్రమాదకరమైన వృత్తి నుంచి రిటైర్ అయ్యి ప్రశాంతంగా గడపాలని ఆమె అనుకుంటుంది. కానీ ఆమె గతంలో చేసిన ఒక హత్య వల్ల అనాథగా మిగిలిన ‘బుల్‌ఫైట్’ అనే యువకుడు, ఆమెపై పగ పెంచుకుంటాడు. ఆమెను ఎలాగైనా చంపడానికి వేచి చూస్తుంటాడు.

మరోవైపు హార్న్‌క్లాకు ఒక డాక్టరు ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఏర్పడుతుంది. వైలెంట్ గా హత్యలు చేసే ఆమెలో, ఆ కుటుంబం పట్ల తెలియని మమకారం మొదలవుతుంది. ఒక రోజు ఆ డాక్టరు కూతురు ప్రమాదంలో ఉన్నప్పుడు, హార్న్‌క్లా మళ్ళీ కత్తి పడుతుంది. చివరికి ఆమె తనను వెంటాడుతున్న వ్యక్తిని ఎలా ఎదుర్కొంది ? డాక్టరు ఫ్యామిలీ కోసం ఆమె మళ్లీ ఎందుకు కత్తి పట్టాల్సి వచ్చింది ? తన ప్రశాంతమైన జీవితం కోసం ఆమె ఏం చేసింది ? అనే విషయాలను, ఈ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : మర్డర్ కేసులో ఊహించని మలుపులు… బిత్తరపోయే డిటెక్టివ్… ఇది నెక్స్ట్ లెవెల్ థ్రిల్లర్

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×