E-Paper
Advertisement

OTT Movie: మర్డర్ కేసులో ఊహించని మలుపులు… బిత్తరపోయే డిటెక్టివ్… ఇది నెక్స్ట్ లెవెల్ థ్రిల్లర్

OTT Movie: మర్డర్ కేసులో ఊహించని మలుపులు… బిత్తరపోయే డిటెక్టివ్… ఇది నెక్స్ట్ లెవెల్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : క్లైమాక్స్ వరకు ఊహించని మలుపులతో సాగే సినిమాను చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాపై ఓ లుక్ వేయండి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. అటు సైన్స్ , ఇటు హారర్ ఎలిమెంట్స్ తో ఈ స్టోరీ మైండ్ ని బెండ్ చేస్తుంది. ఈ చైనీస్ మిస్టరీ క్రైమ్ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘ది సోల్’ (The soul) జియాంగ్ బో నవల ‘యిహున్ యూషు’ ఆధారంగా రూపొందిన చైనీస్ మిస్టరీ క్రైమ్ సినిమా. దీనికి చెంగ్ వీ-హావో దర్శకత్వం వహించారు. ఇందులో చాంగ్ చెన్, జానైన్ చాంగ్, సన్ అంకే, క్రిస్టోఫర్ లీ నటించారు. ప్రధాన పాత్రలో నటించిన చాంగ్ చెన్ తన పాత్ర కోసం సుమారు 12 కిలోల బరువు తగ్గి, క్యాన్సర్ రోగిగా అద్భుతంగా నటించారు. ఈ సినిమా ప్రతిష్టాత్మకమైన Golden Horse Awards లో ఉత్తమ నటుడు సహా పలు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక పెద్ద బిజినెస్ మెన్ అయిన వాంగ్ షి-కాంగ్ తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురవుతాడు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రాసిక్యూటర్ లియాంగ్, అతని భార్య (పోలీస్ ఆఫీసర్) అబావో రంగంలోకి దిగుతారు. మొదట్లో ఈ మర్డర్ వెనుక చేతబడి, క్షుద్ర పూజలు ఉన్నాయని అందరూ నమ్ముతారు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి కొడుకు తండ్రిని శపించడం, అక్కడ దొరికిన వింత గుర్తులు అలా అనిపిస్తాయి. కానీ లోతుగా వెళ్లేకొద్దీ, చనిపోయిన వాంగ్ కంపెనీలో జరుగుతున్న వింతైన మెదడు మార్పిడి ప్రయోగాలు బయటపడతాయి.

ఈ సినిమా సగం వరకు హారర్ థ్రిల్లర్‌లా అనిపించినా, అక్కడి నుండి కథ మొత్తం సైన్స్ ఫిక్షన్ వైపు మారుతుంది. చనిపోయిన వ్యక్తి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, తన మెదడును వేరే వాళ్ల శరీరంలోకి మార్చుకోవాలని ప్లాన్ చేశాడని తెలుస్తుంది. చివరికి ప్రాసిక్యూటర్ లియాంగ్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఈ మర్డర్ మిస్టరీని ఎలా చేధించాడు ? మెదడు మార్పిడి ప్రయోగాలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చైనీస్ ఫాంటసీ యానిమేటెడ్ మూవీ ఓటీటీలోకి… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×