E-Paper
Advertisement

కండలు లేకపోయినా కామన్ సెన్స్‌తో విలన్ల ఎముకలు విరిచేసే స్టూడెంట్… చూస్తే అస్సలు వదిలిపెట్టరు

కండలు లేకపోయినా కామన్ సెన్స్‌తో విలన్ల ఎముకలు విరిచేసే స్టూడెంట్… చూస్తే అస్సలు వదిలిపెట్టరు
Advertisement

Action Thriller OTT : స్కూల్ లైఫ్‌లో బుల్లీయింగ్ వల్ల విద్యార్థులు చాలా సఫర్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ కొరియన్ సిరీస్ ఓటీటీలో దుమ్ము దులుపుతోంది. ఈ సిరీస్ చూస్తే గూస్‌బంప్స్ పక్కాగా వస్తుంది. ఈ కథలో ఒక బలహీనంగా ఉండే టాప్ స్టూడెంట్ ని కొంత మంది ఆకతాయిలు ఘోరంగా ఏడిపిస్తుంటారు. ఆ తరువాత అతను ఎదురు తిరిగినప్పుడు స్టోరీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. రెండు సీజన్లు వచ్చిన ఈ సిరీస్ కి ఐయండిబిలో 8.4 రేటింగ్ ఉండటం విశేషం.

నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

2022లో వచ్చిన ఈ కొరియన్ వెబ్ సిరీస్ పేరు ‘వీక్ హీరో క్లాస్ 1’ (Weak Hero Class 1). ఈ సిరీస్ ఒక పాపులర్ వెబ్ టూన్ ఆధారంగా తీశారు. ఇందులో హీరో పార్క్ జీ-హూన్ ఒకప్పుడు కే-పాప్ సింగర్, కానీ ఈ సిరీస్‌లో తన నటనతో అందరికీ షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా వాడు తన కళ్ళతోనే కోపాన్ని చూపిస్తూ, ఎదుటివాడి మైండ్ రీడ్ చేస్తూ చేసే ఫైట్స్ ఈ షోకే హైలైట్. ఇక ఇందులో యాక్షన్ సీక్వెన్స్ చాలా నాటుగా ఉంటాయి. హీరో గాల్లో ఎగిరి తన్నడం కాకుండా, చేతికి దొరికిన పుస్తకం, పెన్, కిటికీ కర్టెన్లని ఆయుధాలుగా వాడుకుని కొడతాడు. అందుకే ఇది యూత్ కి బాగా కనెక్ట్ అయింది. మొదటి సీజన్ కేవలం హీరో గతాన్ని మాత్రమే చూపిస్తుంది, అసలైన మెయిన్ కథ అంతా సీజన్ 2లో ఉంటుంది.  ఇది 2022 నవంబర్ 18న 8 ఎపిసోడ్‌లుతో సీజన్ 1 విడుదలైంది. సీజన్ 2 ఏప్రిల్ 25న గత ఏడాది 8 ఎపిసోడ్‌లతో వచ్చింది. రెండు సీజన్లు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

సీ-యున్ అనే కుర్రాడు చూడటానికి చాలా అమాయకంగా, బక్కపలచగా ఉంటాడు. అతని లోకం ఏదో అతనిది, ఎప్పుడూ పుస్తకాల్లో తలదూర్చి చదువుకుంటూ ఉంటాడు. కానీ మనోడికి ఒక తిక్క ఉంది.. ఎవరైనా తన పనికి అడ్డువచ్చినా, తనని కెలికినా అస్సలు ఊరుకోడు. దీంతో ఆ క్లాస్‌లో ఉండే కొంతమంది రౌడీ బ్యాచ్ అతన్ని తక్కువ అంచనా వేసి వేధించడం మొదలుపెడతారు. కానీ వాళ్లకు తెలియదు, వాడు కొట్టడం మొదలు పెడితే హాస్పిటల్ బెడ్ మీద తేలాల్సిందేనని. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ సీ-యున్ గాడికి కండ బలం కంటే బుద్ధి బలం ఎక్కువ. వాడు మనలాగా గాల్లో ఎగిరి తన్నడు.. చేతిలో ఉన్న పెన్నునో, డస్టర్‌నో లేదా చుట్టూ ఉన్న వస్తువులనో వాడుకుని ఎదుటివాడి మైండ్ బ్లాక్ అయ్యేలా కొడతాడు.

ఎదురుగా ఉన్నోడు ఎంత పొడవున్నా, ఎంత లావున్నా వాడి వీక్ పాయింట్ పట్టుకుని కుమ్మేస్తాడు. ఈ క్రమంలోనే స్కూల్ బయట ఉండే గ్యాంగ్ స్టర్లతో కూడా గొడవలు మొదలవుతాయి. అప్పుడు సీ-యున్ కి తోడుగా ఇద్దరు స్నేహితులు తోడవుతారు. ఈ ముగ్గురు కలిసి ఆ రౌడీ బ్యాచ్‌ల ఆట ఎలా కట్టించారనేదే మెయిన్ స్టోరీ. స్కూల్ బుల్లీయింగ్ ఎంత దారుణంగా ఉంటుందో, దానికి ఎదురుతిరిగితే వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ సిరీస్‌లో పక్కా మాస్ లెవల్‌లో చూపించారు. చివరికి హీరో సీ-యున్ ఆ ఊబి నుంచి ఎలా బయటపడ్డాడు ? తన స్నేహితుల కోసం ఏం చేశాడనేది చూస్తే మీకు గూస్‌బంప్స్ రావడం పక్కా.

Advertisement

Read Also : సైకో కిల్లర్ చేతిలో చిక్కుకున్న సైకాలజిస్ట్… 60 నిమిషాల డెడ్లైన్ తో అల్లకల్లోలం

Related News

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

14,000 ఏళ్ల వయసున్న టీచర్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న క్లాసిక్ సై-ఫై మూవీ

Big Stories

Advertisement
×