E-Paper
Advertisement

సైకో కిల్లర్ చేతిలో చిక్కుకున్న సైకాలజిస్ట్… 60 నిమిషాల డెడ్లైన్ తో అల్లకల్లోలం

సైకో కిల్లర్ చేతిలో చిక్కుకున్న  సైకాలజిస్ట్… 60 నిమిషాల డెడ్లైన్ తో అల్లకల్లోలం
Advertisement

Psychological thriller OTT : థ్రిల్లర్ కంటెంట్ ను హాలీవుడ్ వాళ్ళు చాలా క్రేజీగా తీస్తుంటారు. కొన్ని సినిమాలు అయితే ప్రతి సీన్ లో ఉత్కంఠత పెంచుతాయి. ఈ నేపథ్యంలో ఒక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఓటీటీలో సీట్ ఎడ్జ్ కి తీసుకెళ్తోంది. ఈ కథ ఒకే గదిలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే మాటల యుద్ధంతో మొదలవుతుంది. సినిమా మొదలైన పది నిమిషాలకే అసలు కథలోకి వెళ్ళిపోతుంది. చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే టెన్షన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఇది మామూలు క్రైమ్ సినిమాల్లా కాకుండా, మైండ్ గేమ్ లా సాగుతుంది. సినిమా చివర్లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. ఇక ఆ ఒక్క మలుపుతో సినిమా రేంజ్ మారిపోతుంది. సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2022లో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది లాస్ట్ క్లయింట్’ (The Last Client). ఈ సినిమాను ఆండర్స్ రోనో క్లార్లండ్ అనే దర్శకుడు తీశారు. ఆయన క్రైమ్ నవలలు రాసే ఫేమస్ రైటర్ కూడా. అందుకే ఈ సినిమాలో సస్పెన్స్, మలుపులు చాలా గ్రిప్పింగ్‌గా ఉంటాయి. సినిమా అంతా ఒకే గదిలో, కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణతోనే నడుస్తుంది. తక్కువ బడ్జెట్‌తో తీసినా, ఆ సిగ్నే ఎగోల్మ్ ఓల్సన్, ఆంటన్ హ్జెల్లే అనే నటుల నటనతో సీటు అంచున కూర్చోబెట్టేలా టెన్షన్ క్రియేట్ చేశారు. ఐఎండిబిలో 6.4/10 రేటింగ్ సంపాదించిన ఈ సినిమా, డెన్మార్క్ దేశానికి చెందినది. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

సుసాన్ అనే ఒక పెద్ద సైకాలజిస్ట్ తన క్లినిక్ మూసేసి ఇంటికి వెళ్దామనుకుంటూ ఉంటుంది. ఆ టైమ్‌లో మార్క్ అనే ఒక కుర్రాడు అర్జెంట్ అని లోపలికి వస్తాడు. వస్తూనే తలుపులేసి, నేనే ఊర్లో అందరినీ చంపేస్తున్న సీరియల్ కిల్లర్‌ అని బాంబు పేలుస్తాడు. నన్ను మార్చడానికి నీకు ఒకటే గంట టైమ్ ఇస్తున్నా, ఈలోపు నన్ను నువ్వు మార్చలేకపోతే నిన్ను కూడా లేపేస్తా అని డెడ్ లైన్ పెట్టి ఆమెకు షాక్ ఇస్తాడు. ఇక ఆ గదిలో సుసాన్ కి, ఆ కిల్లర్ కి మధ్య పెద్ద మైండ్ గేమ్ మొదలవుతుంది. వాడు తన గతాన్ని చెప్తుంటే, అందులో సుసాన్ కి కూడా సంబంధం ఉందని అర్థమవుతుంది.

సుసాన్ గతంలో చేసిన ఒక చిన్న తప్పు వల్ల వీడు ఇలా తయారయ్యాడని తెలిసి ఆమె షాక్ అవుతుంది. ఒక పక్క బయట పోలీసులు అతని కోసం గాలిస్తుంటారు, లోపల వీడేమో ఆమె ప్రాణాలతో ఆడుకుంటూ ఉంటాడు. గడియారం ముల్లు తిరుగుతున్న కొద్ది ఆడియన్స్లో కూడా టెన్షన్ పెరిగిపోతుంటుంది.  చివరికి అసలు ట్విస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? సుసాన్ గతంలో చేసిన మిస్టేక్ ఏమిటి ? ఆ సైకోని ఆమె ఒక గంటలో మారుస్తుందా ? అతని నుంచి ఆమె ప్రాణాలతో బయట పడుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : పగ తీర్చుకోవడానికి 10 ఏళ్ల నిరీక్షణ… పక్కా మాస్ రివెంజ్ స్టోరీ… ఐయండిబిలో 8.2 రేటింగ్

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×