E-Paper
Advertisement

Adventure Thriller OTT : హంగర్ గేమ్స్ పేరుతో అరాచకం… సీను సీనుకో ట్విస్ట్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్

Adventure Thriller OTT : హంగర్ గేమ్స్ పేరుతో అరాచకం… సీను సీనుకో ట్విస్ట్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్
Advertisement

Adventure Thriller OTT : థియేటర్స్‌లో 2023లో రిలీజ్ అయిన ఒక అడ్వెంచర్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా $340 మిలియన్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆడియన్స్ కూడా ఈ సినిమాను బాగా ఆదరించారు. ఇప్పటికే వచ్చిన నాలుగు పార్ట్ లు కూడా సూపర్ హిట్ అయ్యాయి. భవిష్యత్తులో జరిగే ఈ అడ్వెంచర్ సినిమాను చూస్తే గూస్ బంప్స్ పక్కా వస్తాయి. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ది హంగర్ గేమ్స్: ది బల్లాడ్ ఆఫ్ సాంగ్‌బర్డ్స్ & స్నేక్స్’ (The Hunger Games: The Ballad of Songbirds & Snakes) 2023లో వచ్చిన అమెరికన్ అడ్వెంచర్ యాక్షన్ ఫిల్మ్. ఇది మైఖేల్ లెస్లీ, మైఖేల్ ఆర్ండ్ట్ స్క్రీన్ ప్లే నుండి ఫ్రాన్సిస్ లారెన్స్ నిర్మించి దర్శకత్వం వహించారు. ఇది 2020 నవల ‘ది బల్లాడ్ ఆఫ్ సాంగ్‌బర్డ్స్ అండ్ స్నేక్స్ ఆధారంగా రూపొందింది. ఈ సినిమా ‘ది హంగర్ గేమ్స్‌’ కు ప్రీక్వెల్‌గా, హంగర్ గేమ్స్‌ సిరీస్‌లో ఐదవ సినిమాగా వచ్చింది. ఈ సినిమాలో టామ్ బ్లైత్, రాచెల్ జెగ్లర్, హంటర్ షాఫెర్, జాసన్ స్క్వార్ట్జ్‌మన్, పీటర్ డింక్లేజ్, జోష్ ఆండ్రెస్ రివెరా నటించారు. ఈ సినిమా Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘హంగర్ గేమ్స్’ సిరీస్‌లో నెక్స్ట్ మూవీ ‘Sunrise on the Reaping’ 2026 నవంబర్ లో విడుదల కానుంది.

Advertisement

Read Also :  రెక్కలతో పుట్టే బిడ్డ… ఆ తల్లి చేసిన పనికి కన్నీళ్ళు ఆగవు… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ

స్టోరీ ఏమిటంటే 

ఈ కథ పానెమ్ దేశంలో 10వ హంగర్ గేమ్స్ సమయంలో జరుగుతుంది. ఒకప్పుడు గొప్ప హోదాలో ఉండి, ప్రస్తుతం పేదరికంలో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి 18 ఏళ్ల కోరియోలానస్ స్నో ప్రయత్నిస్తుంటాడు. హంగర్ గేమ్స్ లో ప్రతిభ కనబరిచిన అతనికి, డిస్ట్రిక్ట్ 12కు చెందిన లూసీ గ్రే బేర్డ్ అనే గాయనిని గెలిపించే బాధ్యతను అప్పగిస్తారు. లూసీ గ్రే తన పాటలతో, పర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. స్నో తన తెలివితేటలను ఉపయోగించి ఆమెను ఆటలో గెలిపించడానికి ప్రయత్నించడమే కాకుండా, క్రమంగా ఆమెతో ప్రేమలో పడతాడు.

Advertisement

కానీ గేమ్స్ ముగిసిన తర్వాత పరిస్థితులు మారుతాయి. డిస్ట్రిక్ట్ 12లో ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు స్నో మనస్తత్వాన్ని మారుస్తాయి. లూసీ గ్రే పట్ల ఉన్న ప్రేమ కంటే తన సొంత ఎదుగుదల, అధికారమే ముఖ్యమని అతను భావిస్తాడు. దీంతో అతను చివరకు ఒక క్రూరమైన పాలకుడిగా మారిపోతాడు. మరి అతని వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ? అతని ప్రేమ కథ ఏమవుతుంది. ఈ స్టోరీ ఎలాంటి ముగింపును ఇస్తుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×