E-Paper
Advertisement

Hyderabad Metro: ప్రయాణికులకు బంపర్ ఆఫర్: ఒకే టికెట్‌తో మెట్రో నుంచి గమ్యస్థానానికి.. లాస్ట్ మైల్ కనెక్టివిటీపై సర్కార్ నజర్!

Hyderabad Metro: ప్రయాణికులకు బంపర్ ఆఫర్: ఒకే టికెట్‌తో మెట్రో నుంచి గమ్యస్థానానికి.. లాస్ట్ మైల్ కనెక్టివిటీపై సర్కార్ నజర్!
Advertisement

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు (HMR) వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. మెట్రో ఫేజ్-1 నిర్వహణను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడమే కాకుండా, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు కోచ్‌ల కొనుగోలుకు సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు ఎండి సర్ఫరాజ్ అహ్మద్ కీలక వివరాలను వెల్లడించారు.

ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రయాణికులకు ఎలాంటి వ్యత్యాసం తెలియకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఎండి తెలిపారు. మెట్రో ఫేజ్-2 అనుమతుల కోసం వేచి చూడకుండానే, తక్షణ అవసరాల కోసం 60 కొత్త మెట్రో కోచ్‌లను (10 రైలు సెట్లు) కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ అనుమతి రాగానే టెండర్లు పిలవనున్నారు.

Advertisement

ప్రస్తుతం ఎల్ అండ్ టీ (L&T) ఆధ్వర్యంలో ఉన్న 69.2 కిలోమీటర్ల ఫేజ్-1 కార్యకలాపాలను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఒప్పందం ప్రకారం సుమారు ₹13,000 కోట్ల అప్పును ప్రభుత్వం స్వీకరిస్తుంది. మరో ₹2,000 కోట్లు ఎల్ అండ్ టీకి చెల్లించి ప్రాజెక్టును పూర్తిగా కొనుగోలు చేస్తుంది. దీనివల్ల హైదరాబాద్ మెట్రో రైలు 100 శాతం ప్రభుత్వ యాజమాన్య సంస్థగా మారుతుంది.

ఆర్థిక, అకౌంటింగ్ అంశాల సమీక్ష కోసం ఇప్పటికే IDBI క్యాపిటల్‌ను ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా నియమించారు. సాంకేతిక అంశాల కోసం DMRC (ఢిల్లీ మెట్రో) వంటి ప్రముఖ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. మెట్రోతో పాటు ఇతర రవాణా వ్యవస్థలకు పనికొచ్చేలా ఒకే టికెటింగ్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో స్టేషన్ నుంచి గమ్యస్థానాలకు చేరుకోవడానికి రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించారు. మొత్తం 162 కిలోమీటర్ల మేర 8 కారిడార్లలో చేపట్టనున్న ఫేజ్-2 విస్తరణ (అంచనా వ్యయం ₹42,000 కోట్లు) ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది.

Advertisement

ఈ 60 కొత్త కోచ్‌ల (అంటే 10 కొత్త రైళ్లు) రాకతో మెట్రో వ్యవస్థలో ప్రస్తుతం పీక్ అవర్స్‌లో (రద్దీ సమయాల్లో) ప్రతి 3 నుండి 5 నిమిషాలకు ఒక రైలు వస్తోంది. కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తే, ఈ సమయం 2 నుండి 2.5 నిమిషాలకు తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడున్న 3 కోచ్‌ల రైళ్లకు బదులుగా, రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో 6 కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనివల్ల ఒకేసారి ఎక్కువ మంది ప్రయాణించవచ్చు. కొత్త కోచ్‌ల వల్ల రోజువారీ ట్రిప్పుల సంఖ్య పెరుగుతుంది, దీనివల్ల రద్దీ సమయాల్లో స్టేషన్లలో ప్రయాణికులు తోపులాట లేకుండా ప్రయాణించవచ్చు.

Read Also: PhonePe Scam: వాట్సాప్‌లో ఆ లింక్ క్లిక్ చేశారో.. మీ ఫోన్ హ్యాక్ అయినట్టే! ‘ఫోన్‌పే’ గిఫ్ట్ మెసేజ్ వెనుక అసలు నిజం ఇదే.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×