OTT Movie : ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది ఐశ్వర్య రాజేష్. ఇదే ఏడాది ఐశ్వర్య మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ను పలకరించింది. కానీ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయ్యిందో, ఎప్పుడు థియేటర్లలో నుంచి పోయిందో కూడా ప్రేక్షకులకు తెలీదు. అలాంటి మూవీని ఇప్పుడు ఆహా ఓటీటీలో ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఇంతకీ ఈ మూవీ పేరేంటి? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
అర్జున్ సర్జా (Arjun Sarja), ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) ప్రధాన పాత్రలు పోషించిన తమిళ మూవీ ‘తీయవర్ కులై నడుంగ’. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ‘మఫ్టీ పోలీస్’ నవంబర్ లో రిలీజ్ అయ్యింది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జి. అరుల్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై ఎ. ఎన్. బాలాజీ ఈ మూవీని థియేటర్లలోకి తీసుకొచ్చారు. రచయిత హత్య నేపధ్యంలో సాగే ఈ కథలో యాక్షన్‌తో పాటు ఆటిజం వ్యాధిపై అవగాహన కల్పించే సందేశం కూడా ఉండడం విశేషం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో పెద్దగా ఆడలేదు. ప్రమోషన్లు సరిగ్గా జరగకపోవడంతో అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా ఆడియన్స్ కు తెలియకుండా పోయింది. శరవణన్ అభిమన్యు సంగీతం అందించిన ఈ మూవీ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం ‘మఫ్టీ పోలీస్’ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. 2025 డిసెంబర్ 19 నుంచి ఈ మూవీ ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది. తమిళ వెర్షన్ ఇప్పటికే సన్ నెక్స్ట్ (Sun nxt)లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ పై ఇంకా ఆహా (aha) ఇంకా ఎలాంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. మరి ఈ మూవీకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.
ఒక అపార్ట్మెంట్ లో ప్రముఖ రచయిత ముసుగు మనిషి చేతిలో హత్యకు గురవుతాడు. ఈ కేసును విచారించడానికి అర్జున్ రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేట్ చేస్తున్న టైమ్ లో ఈ హత్య వెనుక భారీ కుట్ర దాగి ఉందని తెలుస్తుంది. ఐశ్వర్య రాజేష్ ఆటిజం ఉన్న పిల్లల టీచర్. కానీ మ్యారేజ్ పోర్టల్‌లో ఉన్న ప్రవీణ్ రాజాతో పరిచయం పెంచుకుని, సన్నిహితంగా ఉంటుంది. రచయిత హత్యకు, ప్రవీణ్ తో పరిచయం ఉన్న ఐశ్వర్యకు లింకు ఉందనే షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది. ఆ ట్విస్ట్ ఏంటన్నది సినిమాలో చూడాల్సిందే.
Read also : పెళ్లి వద్దు ప్రేమే ముద్దనే అమ్మాయి… రాత్రీపగలు అలాంటి పనులే… క్లైమాక్స్ వరకు ఆ సీన్లే