E-Paper
Advertisement

Akhanda 2 OTT: ఓటీటీలో అఖండ 2 తాండవం.. ఎప్పటినుంచంటే..!

Akhanda 2 OTT: ఓటీటీలో అఖండ 2 తాండవం.. ఎప్పటినుంచంటే..!
Advertisement

Akhanda 2 OTT Date: ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన భారీ చిత్రం అఖండ 2: తాండవం గురించి.. కీలక అప్డేట్ బయటకు వచ్చింది. థియేటర్లలో విడుదలైన తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. జనవరి 9, 2026.. నుంచి అఖండ 2 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని తెలిపింది.

నందమూరి బాలకృష్ణ .. దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఇది నాలుగో సినిమా కావడం విశేషం. అంతేకాదు..ఈ చిత్రం వీరిద్దరికీ మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఎన్నో వాయిదాల తర్వాత డిసెంబర్ 12, 2025న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. సింహ, లెజెండ్, అఖండ లాంటి మూడు భారీ బ్లాక్ బస్టర్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా కావటంతో ఈ చిత్రం తప్పకుండా మరో విజయం సాధిస్తుంది అని అందరూ నమ్మకం పెట్టుకున్నారు. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందనను పొందింది. కొంతమంది అభిమానులు సినిమాను బాగా ఆదరించినా..బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా భారీ వసూళ్లు సాధించలేకపోయింది.

Advertisement

ఇప్పుడు ఓటీటీ విడుదలతో.. ఈ సినిమాకు మరో అవకాశం దక్కింది. థియేటర్లకు వెళ్లలేకపోయిన ప్రేక్షకులు..అలాగే మళ్లీ చూడాలనుకునే అభిమానులు ఇంట్లోనే ఈ సినిమాను చూసే అవకాశం లభించనుంది. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు ఈ ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో డబ్బింగ్ వెర్షన్లు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో కూడా నెట్ఫ్లిక్స్ విడుదల చేయనుంది.

ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, కబీర్ దుహాన్ సింగ్, హర్షాలి మల్హోత్రా, శశ్వత చటర్జీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమాలో ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండేలా దర్శకుడు కథను రూపొందించారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే కొన్ని సీన్లు మాత్రం మితిమీరినట్లు ఉన్నాయి అని ఎన్నో విమర్శలు కూడా ఈ సినిమాపై వచ్చాయి. ఎక్కువ ఫైటింగ్ లో ఉండడం అలా అని చాలా సీన్లు సహజంగా లేకపోవడం వల్లే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది అనే టాక్ కూడా నడిచింది.

Advertisement

ఈ చిత్రాన్ని రామ్ ఆచంట.. గోపీ ఆచంట నిర్మించారు. సంగీతాన్ని థమన్ అందించగా, ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. ఓటీటీ ప్రేక్షకుల్లో అఖండ 2 ఎలా ఆదరణ పొందుతుందో చూడాలి. నెట్‌ఫ్లిక్స్ విడుదల తర్వాత ఈ సినిమా మరోసారి చర్చనీయాంశంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

ALSO READ: Dekhlenge Saala Recreation Video: పవన్ డేఖ్‌లేంగే సాలా రీక్రియేషన్‌ వీడియోతో దుమ్మురేపిన దేవిశ్రీప్రసాద్..!

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×