E-Paper
Advertisement

Akhanda 2 OTT: అఖండ 2కి మరో షాక్.. ఓటీటీ విడుదల క్యాన్సిల్..!

Akhanda 2 OTT: అఖండ 2కి మరో షాక్.. ఓటీటీ విడుదల క్యాన్సిల్..!
Advertisement

Akhanda 2 OTT: అఖండ 2 తాండవం.. సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే అభిమానులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇది వీరిద్దరి మధ్య నాలుగో సినిమా కావడంతో..విడుదలకు ముందే పెద్ద హిట్ అవుతుందని చాలామంది భావించారు. ముఖ్యంగా సింహ, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి నుంచి వచ్చిన సినిమా ఇది కావడంతో.. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అనుకున్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది.

ఇక ఈ సినిమాకి ముందు నుంచి ఎన్నో సమస్యలు వచ్చి పడ్డాయి. మొదటగా..అఖండ 2 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల.. సినిమా విడుదల డిసెంబర్ 12కి వాయిదా పడింది. ఈ వాయిదా వల్ల సినిమాకు మొదటి దెబ్బ పడింది. ఈ వాయిదా పడటం వల్ల.. ఇతర సినిమాల పోటీ.. ప్రమోషన్ గ్యాప్ వంటి అంశాలు కూడా సినిమాపై ప్రభావం చూపాయి. దీంతో అఖండ 2 ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ హిట్ అవుతుందని అనుకున్న సినిమా.. చివరకు సగటు సినిమాగా మిగిలిపోయింది. చాలా చోట్ల ఈ చిత్రం బ్రేక్ ఇవ్వని కాలేదు.

Advertisement

ఇక థియేటర్ల తర్వాత ఓటీటీలో అయినా మంచి స్పందన వస్తుందని అభిమానులు ఆశించారు. అఖండ 2 జనవరి 9, 2026న Netflixలో స్ట్రీమింగ్‌కు వస్తుందని ప్రచారం జరిగింది. నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేయకపోయినా.. యాప్‌లో సెర్చ్ చేస్తే సినిమా పేరు కనిపించడం వల్ల ఆ తేదీకి విడుదల ఖాయమని అందరూ అనుకున్నారు.

కానీ ఇప్పుడు పరిస్థితి మరోలా మారింది. నెట్‌ఫ్లిక్స్ క్యాటలాగ్‌లో కనిపించిన అఖండ 2 టైటిల్ అకస్మాత్తుగా తీసేశారు. ముందుగా పనిచేసిన లింక్ కూడా ఇప్పుడు ఓపెన్ కావడం లేదు. దీంతో ఓటీటీ విడుదల వాయిదా పడిందా.. అనే సందేహాలు మొదలయ్యాయి. కొంతమంది పూర్తిగా ఈ సినిమా ఓటీటీ విడుదల క్యాన్సిల్ చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ..ఇది నిజంగా క్యాన్సిల్ అయ్యిందా లేక తాత్కాలిక మార్పేనా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. దీంతో అఖండ 2 సినిమా థియేటర్లలోనే కాకుండా, ఓటీటీలో కూడా సమస్యలు ఎదుర్కొంటోంది. నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు, ఈ సినిమా ఓటీటీ భవిష్యత్తు సందేహంతోనే ఉంటుంది.

Advertisement

ఈ సినిమాలో హీరోయిన్‌గా సంయుక్తా నటించగా.. కీలక పాత్రల్లో ఆది పినిశెట్టి, కబీర్ దుహాన్ సింగ్, హర్షాలీ మల్హోత్రా, సస్వత ఛటర్జీ కనిపించారు. ఈ సినిమాను రామ్ అచంట, గోపీ అచంట నిర్మించగా, సంగీతాన్ని థమన్ అందించారు.

ALSO READ: Mahesh Babu Disaster Movie: మహేష్ బాబు సినిమా అతని వల్లే డిజాస్టర్ అయ్యింది.. సంచలన విషయం బయటపెట్టిన నిర్మాత..!

Related News

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

Big Stories

Advertisement
×