E-Paper
Advertisement

Sakshi Vaidya: ఉస్తాద్ భగత్ సింగ్ రిజెక్ట్ చేసిన నటి సాక్షి… ఆ వార్తలకు చెక్ పెట్టిందిగా!

Sakshi Vaidya: ఉస్తాద్ భగత్ సింగ్ రిజెక్ట్ చేసిన నటి సాక్షి… ఆ వార్తలకు చెక్ పెట్టిందిగా!
Advertisement

Sakhi Vidya: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఎంతో మంది హీరోయిన్లు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే పవన్ సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కానీ నటి సాక్షి వైద్య(Sakshi Vaidya) మాత్రం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో సినిమా రిజెక్ట్ చేసి వార్తల్లో నిలిచారు. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat Singh)సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో శ్రీ లీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించారు.

ఉస్తాద్ భగత్ సింగ్ రిజెక్ట్ చేసిన నటి..

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం సాక్షి వైద్యకు వచ్చినప్పటికీ ఈమె ఈ సినిమాను రిజెక్ట్ చేశారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఇలా సాక్షి ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో ఈమెపై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. ఈమె నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవడం వల్లే ఈ సినిమా నుంచి తొలగించారంటూ గతంలో వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా ఈ వార్తలపై సాక్షి వైద్య స్పందించారు. ఈ సందర్భంగా ఈమె పవన్ కళ్యాణ్ సినిమాని రిజెక్ట్ చేయడం గురించి మాట్లాడుతూ..

కుటుంబ పరిస్థితులే కారణం..

Advertisement

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో అవకాశం వచ్చిన మాట నిజమేనని అయితే ఆ సమయంలో నాకున్న కుటుంబ అత్యవసర పరిస్థితుల వల్ల షూటింగుకు హాజరు కాలేకపోయానని తెలిపారు. ఇలా డేట్స్ సర్దుబాటు కానీ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టును వదులుకున్నానే తప్పా వరుస ప్లాపుల కారణంగా తనను తొలగించారంటూ వచ్చిన వార్తలలో ఏమాత్రం నిజం లేదంటూ రూమర్లకు పూర్తిగా చెక్ పెట్టేశారు. ఉస్తాద్ భగత్ సినిమా గురించి ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని 2026 సమ్మర్ లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

నారీ నారీ నడుమ మురారి..

Advertisement

ప్రస్తుతం సాక్షి శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా 15న విడుదల కాగా 14వ తేదీ సాయంత్రం ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలోనే చిత్ర బృందం వరుస ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సాక్షి వైద్య పవన్ సినిమా నుంచి తప్పుకోవడం పై క్లారిటీ ఇచ్చారు.

Also Read: Sai Kamakshi Bhaskarla: నీకు ఏ పొజీషన్ ఇష్టం అంటూ నెటిజన్ అసభ్యకర ప్రశ్న.. గట్టిగా ఇచ్చి పడేసిన ‘పొలిమేరు’ భామ

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×