E-Paper
Advertisement

Army: సైన్యంలోకి మాజీ సీఎం మనవడు.. ఇండియన్ ఆర్మీకి కాదు, ఆ దేశం మిలటరీలోకి!

Army: సైన్యంలోకి మాజీ సీఎం మనవడు.. ఇండియన్ ఆర్మీకి కాదు, ఆ దేశం మిలటరీలోకి!
Advertisement

అతడు ఒకప్పటి ముఖ్యమంత్రి మనవడు. వేల కోట్ల ఆస్తులకు అధిపతి. అయినా సరే.. అతడు సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని అనుకుంటున్నాడు. అయితే, మీరు అనుకుంటున్నట్లు ఇండియాకు కాదు, వేరొక దేశానికి. అదెలా? ఒక భారతీయుడై ఉండి వేరొక దేశానికి ఎలా సేవ చేస్తాడనే కదా అనుకుంటున్నారు? ఇంతకీ ఈ నిర్ణయం తీసుకున్న ఆ మాజీ సీఎం మనవడు ఎవరు? అతడు రాజకీయాల వైపు కాకుండా.. రక్షణ రంగంలోకి చేరడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాడు?

సైన్యంలోకి లాలూ మనవడు

లాలూ ప్రసాద్ యాదవ్.. ఈ పేరు గురించి మీకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబ్ తక్ సమోసే మే అలూ హై.. తబ్ తక్ బీహార్ మే లాలూ హై (ఎప్పటి వరకు సమోసాలో బంగాళ దుంప(ఆలూ) ఉంటుందో అప్పటి వరకు బీహార్‌లో లాలూ ఉంటాడు) అంటూ ఆయన అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆలూలో సమోసా ఉన్నా.. బీహార్‌ రాజకీయాల్లో మాత్రం లాలూ లేరు. ప్రస్తుతం లాలూ దంపతులపై అనేక అవినీతి కేసులు నడుస్తున్నాయి. అయితే ఆయన ఇద్దరు కొడుకులు మాత్రం రాజకీయాల్లో యాక్టీవ్‌గానే ఉన్నారు. లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను కుటుంబం నుంచి, పార్టీ నుంచి వెలివేశారు. దీంతో ఆయన జనశక్తి జనతాదళ్ పార్టీ (JJP) పెట్టారు. మరో కొడుకు తేజస్వీ ప్రసాద్ యాదవ్ మాత్రం ఆర్జేడీలో ముఖ్య నేతగా కొనసాగుతున్నారు.

ఇద్దరు కొడుకులు.. ఏడుగురు కూతుర్లు

Advertisement

లాలు ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవీల కుటుంబం అంత చిన్నదేమీ కాదు. వారికి ఏకంగా 9 మంది పిల్లలు ఉన్నారు. వారికి ఇద్దరు కొడుకులు, ఏడుగురు కూతుర్లు. వారి పెద్ద కూతురు రోహినీ ఆచార్య సింగపూర్‌లో ఎంబీబీఎస్ చేసింది. అక్కడే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. ఇటీవలే ఆమె ట్విట్టర్ (X) వేదికగా తన పెద్ద కొడుకు ఆదిత్య (18) సైన్యంలో చేరుతున్నట్లు పోస్ట్ పెట్టింది. అయితే, ఆదిత్య చేరుతున్నది ఇండియన్ ఆర్మీలో కాదు, సింగపూర్ ఆర్మీ. భారతీయులై ఉండి.. అక్కడ ఆర్మీలో చేరడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. అదెలా సాధ్యం అని ప్రశ్నిస్తున్నారు.

Also Read: మంచంపై దొర్లుతూ రీల్స్ చూస్తూ.. రిలాక్స్ అవుతున్నారా? అయితే, జరిగేది ఇదే!

సింగపూర్‌లో అంతే..

Advertisement

రోహిణి ఆచార్య చాలా ఏళ్ల నుంచి సింగపూర్‌లోనే ఉంటున్నారు. దీంతో వారికి అక్కడి పౌరసత్వం లభించింది. వాళ్ల పిల్లలు కూడా అక్కడే చదువుకుంటున్నారు. సింగపూర్ చట్టం ప్రకారం.. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు తప్పకుండా అక్కడి సైన్యంలో చేరాలి. సుమారు రెండేళ్ల పాటు సైన్యానికి సేవలు అందించాలి. ప్రస్తుతం ఆదిత్య సింగపూర్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌లో చేరాడు. ఈ విషయాన్ని రోహిణీ ట్విట్టర్‌లో తెలియజేస్తూ.. తన కుమారుడు ఇంత చిన్న వయస్సులోనే సైన్యంలోకి చేరుతున్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఇది అతడిలో మరింత ధైర్యాన్ని, క్రమశిక్షణ, శక్తిసామర్థ్యాలను పెంచుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×