E-Paper
Advertisement

Ala Kachuu OTT : ఇదెక్కడి యవ్వారంరా అయ్యా… అమ్మాయి కన్పిస్తే చాలు ఎత్తుకెళ్ళి తాళి కట్టే వింత ఆచారం… మూవీ 38 నిమిషాలే

Ala Kachuu OTT : ఇదెక్కడి యవ్వారంరా అయ్యా… అమ్మాయి కన్పిస్తే చాలు ఎత్తుకెళ్ళి తాళి కట్టే వింత ఆచారం… మూవీ 38 నిమిషాలే
Advertisement

Ala Kachuu OTT : బ్రైడ్ కిడ్నాపింగ్ అనే కిర్గిజ్‌స్తాన్ సంప్రదాయ కథతో ఒక షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. సుమారు 38 నిమిషాల ఈ సినిమా, ఒక మహిళ తన ఆత్మగౌరవం కోసం చేసే పోరాటాన్ని అద్భుతంగా చూపిస్తుంది. ఈ సినిమా అనేక అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో ప్రశంసలతో పాటు, అవార్డులను కూడా అందుకుంది. ఆస్కార్ కి కూడా నామినేట్ అయింది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం.

ఏ ఓటీటీలో ఉందంటే

2020లో వచ్చిన ఈ స్విస్ షార్ట్ ఫిల్మ్ పేరు ‘అలా కచూ టేక్ అండ్ రన్’ (Ala Kachuu Take & Run), దీనికి మరియా బ్రెండిల్ దర్శకత్వం వహించారు. నాడిన్ లుచింగర్, ఫ్లావియో గెర్బర్ దీనిని నిర్మించారు. 2022లో 94వ అకాడమీ అవార్డ్స్‌లో ‘బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్’ విభాగంలో ఈ చిత్రం నామినేట్ అయ్యింది. అంతే కాకుండా 45వ క్లీవ్‌ల్యాండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 16వ హోలీషార్ట్స్ ఫిల్మ్ ఫెస్టివల్, 38వ ఫ్లికర్స్ రోడ్ ఐలాండ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లలో ప్రదర్శించబడింది. ఇది prime videoలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. ఇందులో అలినా టుర్దుమమటోవా లీడ్ రోల్ లో నటించింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

19 ఏళ్ల సెజిమ్ అనే యువతి కిర్గిజ్స్తాన్‌లోని తన పల్లెటూరి నుండి రాజధాని బిష్కెక్ నగరానికి వెళ్లి, అక్కడ ఉన్నత చదువులు చదువుకోవాలని ఎన్నో కలలు కంటుంది. అయితే ఆమె ఆశయాలకు విరుద్ధంగా ఒకరోజు కొందరు యువకులు ఆమెను అకస్మాత్తుగా కిడ్నాప్ చేస్తారు. వాళ్ళు ఆమెను ఒక మారుమూల గ్రామానికి తీసుకెళ్లి, ఆమెకు ఏమాత్రం పరిచయం లేని ఒక వ్యక్తితో బలవంతంగా వివాహం చేసేందుకు ప్రయత్నిస్తారు. కిర్గిజ్ సంప్రదాయంలో దీనిని ‘అలా కచూ’ (వధువును ఎత్తుకెళ్లడం) అని పిలుస్తారు.

ఈ పరిస్థితుల్లో సెజిమ్ మానసిక వేదనకు గురవుతుంది. అతనితో పెళ్లికి అంగీకరించమని అటు అబ్బాయి కుటుంబం ఆమెపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుంది. చివరకు తన స్వంత తల్లి కూడా సంప్రదాయం పేరుతో ఆమెను అక్కడే ఉండిపోమని చెబుతుంది. తన చదువు, భవిష్యత్తు కోసం ఆ కట్టుబాట్లను ఎదురించి, ఆమె దీని నుండి ఎలా బయటపడింది అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : భయపడే వాళ్ళను బలి తీసుకునే ఆత్మలు… అడవి అంటేనే ఆమడ దూరం పారిపోయేలా చేసే మూవీ

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×